DailyDose

పాటలు రాయాలన్నదే ఆశయం!

పాటలు రాయాలన్నదే ఆశయం!

అయితే ఏంటీ… అంటారా? ఆమె తెలుగమ్మాయి కాదు. అమెరికన్‌. పేరు బ్రీ. తెలుగు భాషను అభ్యసించే విధానం చూస్తే తెలుగు పండితులకు కూడా అబ్బురం అనిపిస్తుంది. వ్యాకరణం మీద ఇపుడిప్పుడే పట్టు సంపాదిస్తోంది. తెంగ్లీషు అంటే కోప్పడే ‘బ్రీ’కి భాష ఎంత ఇష్టమంటే.. తన స్మార్ట్‌ఫోన్‌లో తన అమ్మ పేరును ‘అమ్మ’ అని సేవ్‌ చేసుకుంది. ఇటీవలే హైదరాబాద్‌కి వచ్చిన బ్రీని ‘నవ్య’ పలకరించింది.

‘‘అయితే ఏంటీ… అంటారా? ఆమె తెలుగమ్మాయి కాదు. అమెరికన్‌. పేరు బ్రీరతదేశానికి మొదటిసారి రావటమిదే. మాది అమెరికాలోని ఇండియానా రాష్ట్రం. కేవలం తెలుగు ప్రజల మధ్య కొన్నాళ్లు ఉండాలనే హైదరాబాద్‌కు వచ్చా. మొన్నీమధ్య పుస్తకావిష్కరణ సభతో పాటు రవీంద్రభారతికి వెళ్లా. నవచేతన బుక్‌ హౌస్‌కు వెళ్లి అక్కడ అక్బర్‌ బీర్బల్‌, పరమానంద శిష్యుల కథలు పుస్తకాలు కొన్నా. ఇక్కడికి వచ్చాక ధైర్యంగా తెలుగు మాట్లాడుతున్నా. భాష గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నా.

అలా తెలుగుభాష పరిచయం.. అమీర్‌ఖాన్‌ ‘దంగల్‌’ సినిమా 2018లో చూశా. ఆ తర్వాత ఇండియన్‌ లాంగ్వేజ్‌ సినిమాల నోటిఫికేషన్స్‌ చాలా వచ్చాయి. అలా ప్రథమంగా ‘రాజా ది గ్రేట్‌’ తెలుగు చిత్రాన్ని చూశా. ఎందుకో తెలీదుకానీ.. హిందీ భాష కంటే తెలుగు భాష నా మనసుకు నచ్చింది. తెలుగు భాష గురించి వెతికా. తెలుగు చిత్రాలు చూడటం ప్రారంభించా. పవన్‌కళ్యాణ్‌, మహే్‌షబాబు, సాయి పల్లవి.. ఇలా కొందరి పేర్లు పలకడం నేర్చుకున్నా. ఇటీవలే ‘చార్లీ 777’ సినిమా హాల్లో చూశా.

చిన్నపిల్లోడే స్ఫూర్తి! ఆన్‌లైన్‌లో తెలుగు ఆడియోలు వినేదాన్ని. లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ ఫోరమ్స్‌లో ప్రశ్నలు అడిగేదాన్ని. తెలుగువాళ్లను పరిచయం చేసుకోవటానికి వారాంతాల్లో బయటికి వెళ్లేదాన్ని. తెలుగు వారితో మాట్లాడాలని తహతహలాడేదాన్ని. అచ్చులు, హల్లులు బాగా వచ్చు అనుకున్నాక.. మళ్లీ అడిగితే మర్చిపోయేదాన్ని. దీంతో కొన్నాళ్లు తెలుగుకి దూరంగా ఉన్నా. మా అక్క 2020 డిసెంబరులో చనిపోయింది. ఆ కష్టకాలంలో తెలుగు నేర్చుకోవటం మళ్లీ ఆరంభించా. కష్టంగా అనిపించేది. భాష నేర్చుకుంటుంటే ఉపశమనం కలిగినట్లుండేది. ఓ రోజు ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లా. మూడో తరగతి చదివే తన కొడుకు జపనీస్‌, అరబిక్‌ భాషల్ని వేలి గుర్తులను పెట్టుకుంటూ నేర్చుకుంటున్నాడు. అది చూశాక నాలో స్ఫూర్తి రగిలింది. ఆ టెక్నిక్‌తోనే ఒకే రోజు ఒకటి నుంచి వంద వరకూ నేర్చేసుకున్నా. అందంగా రాయటం సాధన చేశా.
07092022011345n35
గుణింతాలు నేర్చుకున్నాక..
పరిసరాల్లో కనిపించే వన్నీ తెలుగులో రాసుకునేదాన్ని. తెలుగులోనే మాట్లాడేదాన్ని. రోజుకు ఐదు గంటలు రాయటం, చదవటం సాధన చేసేదాన్ని. కొత్త పదం నేర్చుకుంటుంటే.. ప్రతిరోజూ కొత్త అనుభూతి. కొన్ని వేమన పద్యాలు, గాయత్రీ మంత్రం కంఠోపాఠంగా నేర్చుకున్నాక సిలికాన్‌ ఆంధ్ర మనబడి వాళ్లను కలిశా. అక్కడ వ్యాకరణం గురించి తెలుసుకున్నా. పాటలు రాయాలన్నదే ఆశయం!అలా రాయటం చిరాకు! ఒక్కసారి కొత్తపదం వింటే ఇట్లే గుర్తుండిపోతుంది. ప్రతి పదం తెలుగులో రాయాలని, తెలుగులోనే మాట్లాడాలనే ఇష్టం. అందుకే పెన్నును ‘కలం’ అని మాత్రమే అంటా. ఈస్ట్‌, వెస్ట్‌ అని ఇంగ్లీ్‌షలో మాట్లాడను. ‘తూర్పు, పడమర’ అనే అంటా. ఏదో నేర్చుకున్నానంటే.. నేర్చుకున్నాను అనే బాపతి కాకుండా భాష విషయంలో పక్కాగా ఉంటా. తెంగ్లీష్‌ రాయడమంటే చిరాకు, అసహనం కూడా. ఎందుకంటే ఇంగ్లీ్‌షలో ‘పదాలు’ అని రాస్తే.. దాన్ని ‘పదాలు’ అని చదవాలా? లేక ‘పాదాలు’ అని చదవాలా? తలకట్టు, దీర్ఘము.. మారినా అర్థమే మారుతుంది కదా! ఇలా రాస్తే భాష దెబ్బతింటుంది కాబట్టే పొరబాటున కూడా ఫోన్‌లో తెంగ్లీష్‌ చాట్‌ చేయను. తెలుగులోనే రాస్తా.

తెలుగు నేర్చుకునేందుకు ఆన్‌లైన్‌ గేమ్స్‌…
ఇండియానాలో తెలుగు ప్రజలు తక్కువ. అందుకే విన్న వెంటనే వెంటనే అర్థం చేసుకోవటం, వేగంగా మాట్లాడటం రాదు. ఈ సమస్యలను త్వరలో అధిగమిస్తా. తెలుగు నేర్చుకోవడానికి.. నేను పడిన ఇబ్బందులు మరెవరూ పడకూడదు. తెలుగు అక్షరాలను సులువుగా గుర్తుపట్టడానికి డిజైన్స్‌, కొండ గుర్తులు, టిప్స్‌ చేశా. వీటితో ఓ మెటీరియల్‌ తయారు చేస్తున్నా. ప్రొటోటైప్‌ వర్క్స్‌ చేస్తున్నా. శబ్ధం సాయంతో భాష నేర్చుకునే ఆన్‌లైన్‌ గేమ్స్‌ కూడా తయారు చేస్తున్నా. కోడింగ్‌ కూడా వచ్చు. అమెరికాలో ఐటీ వాళ్లకు పాఠాలు చెప్పా. కొన్ని సంగీత పరికరాలపై పట్టుంది. ఆ సంగీతజ్ఞానం వల్ల అచ్చులు, హల్లులు, విభక్తులను.. పాటలా హమ్‌ చేస్తూ గుర్తు పెట్టుకుంటా. రష్యన్‌ భాష రాయటం, కాస్త మాట్లాడటం వచ్చు. భాష నేర్చుకోవడమంటే ఆ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవటం కూడా. నా వరకొస్తే తెలుగు నేర్చుకోవటానికి ‘ద ఇన్‌టెన్సివ్‌ కోర్స్‌ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌’ పుస్తకం చాలా ఉపయోగపడింది. హైదరాబాద్‌కి మళ్లీ వచ్చి.. స్ర్కిప్ట్‌ రైటింగ్‌లో చేరతా. ఒక్క ఇంగ్లీష్‌ పదం లేకుండా తెలుగు మాట్లాడాలి. చివరగా.. తెలుగు సినిమాలకు పాటలు రాయాలనేదే నా ఆశయం.

మా నాన్న బిజినెస్‌ చేస్తారు. నాకిద్దరు తమ్ముళ్లు. ఓ చెల్లి ఉంది. భారతదేశం, ఇక్కడి సంస్కృతి అంటే అమ్మకు ఇష్టం. ఓసారి మా మామ్‌తో ‘ఈ రోజునుంచి అమ్మ అని పిలుస్తా’ అన్నాను. ‘ఏం భాష?’ అని అడిగింది అమ్మ. ‘తెలుగు’ అన్నాను. ‘ఆ రష్యన్‌ భాష నేర్చుకోవటం కంటే.. ఈ భాష బావుంది. నేర్చుకో’ అంటూ ప్రోత్సహించింది. భాష నేర్చుకునే క్రమంలో సిలికాన్‌ ఆంధ్రలో ఉండే ‘ఇందిర’ నాకు గురువయ్యారు. ప్రస్తుతం రాయటం, చదవటం బాగా వచ్చు కాబట్టి మిత్రులకు పంపించి భాషను సరిచేయమనే అవసరం రాలేదు. ప్రతి కొత్త పదం పుస్తకంలో రాసుకుంటా. సాధనే నా బలం. అన్నట్లు ‘బ్రీ’ అంటే స్ట్రాంగ్‌ అని అర్థం!