DailyDose

కర్నూలులో రూ. 2 కోట్ల అక్రమ మద్యం ధ్వంసం – TNI నేర వార్తలు

కర్నూలులో రూ. 2 కోట్ల అక్రమ మద్యం ధ్వంసం – TNI  నేర వార్తలు

* ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పోలీసులు సుమారు రూ. 2 కోట్ల విలువైన అక్రమ మద్యంను ధ్వంసం చేశారు. 593 కేసుల్లో పట్టుబడిన 66 వేల అక్రమ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని జిల్లాలోని పంచలింగాల గ్రామం .తాండ్రపాడుకు వెళ్లే మార్గంలో రోడ్డు రోలర్‌ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్‌ కౌశల్‌ మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లాలో పట్టుబడ్డ నాన్ డ్యూటీ పేయిడ్‌ లిక్కర్‌ను ధ్వంసం చేశామన్నారు.కర్నాటక బోర్టర్‌, లోకల్‌ పోలీసులతో వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైన అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..ఇరువురికి తీవ్ర గాయాలు..
విశాఖ గురుద్వారా నుంచి అక్కయ్యపాలెం వెళ్లే రహదారి మార్గం మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ..హోండా యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు..సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు..గాయపడిన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో విశాఖ NRI హాస్పిటల్కు తరలించిన పోలీసులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*విజయనగరం జిల్లా : దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం కారును పరిశీలించగా.. కారులో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. దాంతో గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

*అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిందితులను పోలీసులు అరెస్టు చేసి, మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి గంజాయి ముఠా అరెస్టుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం.. టాస్క్‌ ఫోర్స్‌ బృందం, నకిరేకల్‌ పోలీసులు కేతపల్లి పీఎస్‌ పరిధిలోని ఎన్‌హెచ్‌ 65లోని కొర్లపాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు.విజయవాడ నుంచి హైదరాబాద్‌గా వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ కారును ఆపి.. తనిఖీలు చేయగా.. అందులో గంజాయిని గుర్తించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముభిన్‌ షేక్‌కు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న చందన్‌కుమార్‌ హరిజన్‌, పఠాన్‌ షేక్‌ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. వీరంతా ఏపీలోని విశాఖపట్నంలో తెలిసిన వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసుకొని వెళ్తుండగా.. కొర్లపాడ్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.పోలీసులను గమనించి చందన్‌కుమార్‌, పఠాన్‌ షేక్‌ కారు దిగి పారిపోయగా.. ముబీన్‌ షేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 25 గంజాయి పాకెట్లలో 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ మొగిలయ్య, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్‌ఐ అనిల్‌రెడ్డితో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మాదకద్రవ్యాలను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు

*చైనాలోని షాంఘైలో ఉన్న ఓ ప్ర‌ఖ్యాత ఆస్ప‌త్రి వ‌ద్ద ఓ ఆగంత‌కుడు శ‌నివారం క‌త్తితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జూన్‌లోనే ఆ న‌గ‌రంలో కోవిడ్‌19 ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు. గాయ‌ప‌డ్డ‌వారిని రుయిజిన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క‌త్తితో దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో హాస్పిట‌ల్ వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ అయ్యాయి. హాస్పిట‌ల్ వ‌ద్ద ఉన్న మార్బుల్ స‌ర్ఫేస్‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపించాయి. షాంఘై హాస్పిట‌ల్‌లోని ఏడ‌వ అంత‌స్తు వ‌ద్ద ఆగంత‌కుడు త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో బెదిరిస్తూ కొంద‌ర్ని బంధీ చేశాడు. ఆ స‌మ‌యంలో పోలీసులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. క‌త్తి దాడిలో గాయ‌ప‌డ్డ ఓ వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌ను విచారిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. రుయిజిన్ హాస్పిట‌ల్‌కు చెందిన అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేశారు.

*అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం గొందిరెడ్డిపల్లికి చెందిన రైతు(Farmer) నూర్ మహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం నూర్ మహమ్మద్‌కు చెందిన పంపుసెట్లకు అధికారులు మీటర్లు బిగించారు. మోటార్ ఆన్ చేస్తే మీటర్ రీడింగ్ నమోదు అవుతుందంటూ నూర్ మహ్మద్ దృష్టికి తీసుకు వచ్చారు. ప్రతి నెలా కరెంట్ బిల్లులు చెల్లించాలంటే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయని నూర్ మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

*శ్రీశైలం శిఖరం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినుకొండ నుండి శ్రీశైలం వస్తున్న కారు… శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* కజకిస్తాన్‌లో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు అతడు ఎంబీబీఎస్‌ చదువుతున్న కళాశాల నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాద్, మేరీ కుమారి దంపతుల కుమారుడు పి.వినయ్‌ కుమార్‌(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం మూడో ఏడాది పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 7న(గురువారం) స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న ఓ కుంటలో సరదాగా ఈతకు వెళ్లాడు.

*అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నిందితులను పోలీసులు అరెస్టు చేసి, మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి గంజాయి ముఠా అరెస్టుకు సంబంధించి వివరాలను మీడియాకు వివరించారు. డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం.. టాస్క్‌ ఫోర్స్‌ బృందం, నకిరేకల్‌ పోలీసులు కేతపల్లి పీఎస్‌ పరిధిలోని ఎన్‌హెచ్‌ 65లోని కొర్లపాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు.

*హైదరాబాద్‌ మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావుపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావు ఓ వివాహితను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భర్తపైనా దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వనస్థలీపురం పోలీసులు సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావును వనస్థలీపురం పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.

* సహచర ఉద్యోగినిపై అత్యాచారయత్నం చేసిన అటవీశాఖ అధికారికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పీఆర్‌ రాజీవ్‌ తీర్పునిచ్చారు. ప్రకాష్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. 2017లో రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్డులోని ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డివిజనల్‌ కార్యాలయంలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా పనిచేసిన మల్లి వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో ఉద్యోగినిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ఎవ్వరూ ఆఫీసు లో లేని సమయంలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ప్రకాష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన విచారణ జరిగింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న రాజమహేంద్రవరం 8వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి పీఆర్‌ రాజీవ్‌ తుది తీర్పును వెల్లడించారు. సెక్షన్‌ 354 ఐపీసీ కింద నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా, సెక్షన్‌ 354-డి నేరానికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. మొత్తం 8 ఏళ్లు జైలు శిక్ష విధించారని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు చేశారు. పీపీగా ఎం.వెంకటేశ్వరావు వ్యవహరించారు. కోర్డు హెడ్‌ కానిస్టేబుల్‌ పి.కొండలరావు ఈ కేసు విచారణలో కృషిచేశారు.

*వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. షెడ్యూల్డ్‌ తెగల కులానికి చెందిన రొడ్డా భవానీ (32) గురువారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వైసీపీ నేతల వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ లైన్‌మేన్‌గా పనిచేస్తున్న భవానీ భర్త భారతి వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పలగుప్తం ఎంపీపీ దంగేటి అచ్యుతజానకి భర్త రాంబాబు, ఉప సర్పంచ్‌ చీకురుమెల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ, సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ భర్త వరసాల సత్యనారాయణలు.. భవానీని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధింపులకు గురి చేశారు. వైసీపీ నేతలతోపాటు డీఎల్పీవో విక్టర్‌ కూడా వేధింపులకు గురిచేసినట్టు మృతురాలి భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

*కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాదు, మేరీ కుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి కుమారుడు పి.వినయ్‌కుమార్‌(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చేస్తున్నాడు.

* విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో విషాదం చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తు‌న్న వర్షాల కారణంగా గోడకూలి లక్ష్మి, అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అడ్డాల లక్ష్మి(47) అశోక్ కుమార్ రాజు (5) నానమ్మ, మనవడిగా గుర్తించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందటంతో.. కుమరాంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

* తెలంగాణలోని కరీంనగర్‌-హైదరాబాద్ రాజీవ్‌ రహదారిలోని తిమ్మాపూర్ బస్టాండ్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి శివాని అక్కడికక్కడే చనిపోయింది. ఇంటి నుంచి బయలుదేరిన చిన్నారి.. తన తల్లి పనిచేసే మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్దకు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన కారు చిన్నారిని ఢీకొట్టి.. విద్యుత్‌ స్తంభాన్ని తాకి ఆగిపోయింది. కారు ఢీకొన్న వేగానికి చిన్నారి గాలిలోకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. కేవలం అరకిలోమీటర్ దూరంలో ఉన్న తల్లి వద్దకు చేరుకొనే లోపే ఈ ఘటన చోటుచేసుకుంది.

* విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు.. నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు దీన్ని గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

* బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో విషాదం చోటుచేసుకుంది. సైనిక ఉద్యోగం రాదనే మనస్తాపంతో గోపిదేశి మణికంఠ అనే 20ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీలో చేరాలనే పట్టుదలతో శిక్షణ తీసుకుని పరుగు పందెం, మెడికిల్ పరీక్షలో పాసయ్యడాని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ నెలలో రాత పరీక్షకు సిద్ధమవుతున్న మణికంఠ.. ఆ పరీ‌క్ష ఆగిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అగ్నిపథ్‌ నిబంధనల కారణంగా ఉద్యోగం రాదనే దిగులుతో.. ఉరివేసుకున్నాడని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒడిశా నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు.. నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రహదారి పక్కనే ఉన్న గొయ్యిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు నిర్మిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు దీన్ని గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.