Business

మ‌ళ్లీ పెరిగిన టాటా మోటార్స్ కార్ల ధ‌రలు.. ఎంతంటే?

మ‌ళ్లీ పెరిగిన టాటా మోటార్స్ కార్ల ధ‌రలు.. ఎంతంటే?

టాటా మోటార్స్ కార్ల ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించింది. ఇన్‌పుట్ కాస్ట్‌లు పెరిగిపోవ‌డంతో త‌క్ష‌ణం కార్ల ధ‌ర‌లు పాక్షికంగా పెంచ‌క త‌ప్ప‌డం లేద‌ని పేర్కొంది. స‌గ‌టున ఆయా కార్ల ధ‌ర‌లు 0.55 శాతం పెరుగ‌నున్నాయి. వేరియంట్‌, మోడ‌ల్‌, కారు శ్రేణిని బ‌ట్టి ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయ‌ని వివ‌రించింది. ఇన్‌పుట్ కాస్ట్ వ్య‌యం త‌గ్గింపున‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. వినియోగ‌దారుల‌ పై ఇన్‌పుట్ కాస్ట్ వ్య‌యం స్వ‌ల్పంగా మాత్ర‌మే పెంచుతున్నామ‌ని తెలిపింది. టాటా పంచ్‌, టాటా నెక్సాన్‌, టాటా హారియ‌ర్‌, టాటా స‌ఫారీతోపాటు వివిధ ర‌కాల కార్ల‌ను టాటా మోటార్స్ విక్ర‌యిస్తున్న‌ది. ఈ నెల‌లోనే టాటా మోటార్స్.. వాణిజ్య వాహనాల ధ‌ర‌ల‌ను 1.5-2.5 శాతం పెంచుతున్న‌ట్లు టాటా మోటార్స్ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి టాటా మోటార్స్ త‌న కార్లు, వాణిజ్య వాహ‌నాల ధ‌ర‌లు పెంచుతూనే వ‌చ్చింది. గ‌త జ‌న‌వ‌రి 19న తొలిసారి అన్నిర‌కాల ప్యాసింజ‌ర్ కార్ల ధ‌ర‌లు ఒక‌శాతం పెంచేసింది. గ‌త మార్చిలో ప్ర‌యాణ కార్ల‌పై 2-2.5 శాతం ధ‌ర‌లు పెంచింది. అంత‌కుముందు 2021 డిసెంబ‌ర్ ఆరో తేదీన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల‌పై 1.5-2 శాతం ధ‌ర‌లు పెంచింది.