Health

పురుషుల్లో ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ!

పురుషుల్లో ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ!

పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ప్రధానమైనది. భారతదేశంలో ఈ క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పురుషులు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, ప్రతి పురుషుడూ క్రమం తప్పకుండా ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలని పలు అంతర్జాతీయ వైద్య నివేదికలు సూచిస్తున్నాయి.

కుటుంబంలో ఎవరికైనా ఉంటే..
పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటమే కాకుండా, అధిక సంఖ్యలో పురుషులు ఈ క్యాన్సర్‌ వ్యాధికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 50 ఏండ్లు దాటిన పురుషులు ప్రతి సంవత్సరం ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటిజన్‌(పీఎస్‌ఏ) రక్తపరీక్ష, డిజిటల్‌ రెక్టల్‌ పరీక్ష చేయించుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలో ఎవరికైనా (తల్లిదండ్రులు, తోబుట్టువులు) ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే.. మిగిలిన వారు 40 ఏండ్ల వయసు నుంచే క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవాలి.

పుట్టుమచ్చల ముప్పు
స్త్రీ, పురుషుల్లో చర్మంపై ఏర్పడే పుట్టుమచ్చలు కొన్ని సందర్భాలలో చర్మ క్యాన్సర్లకు దారితీయవచ్చు. అందుకని చర్మంపై ఏర్పడే పుట్టుమచ్చల్లో ఏదైనా మార్పు కనిపించినా, వాటి పరిమాణంలో గానీ, ఆకారంలోగాని తేడా కనిపిస్తే వాటిని క్యాన్సర్‌ మచ్చలుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే చర్మంపై ఉన్న పుట్టుమచ్చలు సాధారణమైనవా లేక క్యాన్సర్‌ సంబంధించిన మచ్చలా తెలుసుకునేందుకు ఏబీసీడీఈ పద్ధతిని వినియోగించవచ్చు

‘ఏబీసీడీఈ’ పద్ధతి అంటే..
ఎ – పుట్టుమచ్చలను మధ్యగా విభజించి చూసినప్పుడు రెండు అర్ధ భాగాలు ఒకేలా ఉండకూడదు.
బి – పుట్టుమచ్చ అంచులు, పలుచని రంగులో లేదా గరుకుగా ఉండకూడదు.
సి – పుట్టుమచ్చ రంగులో మార్పు రాకూడదు.
డి – పుట్టుమచ్చ వ్యాసం 1/4 అంగుళం కన్నా ఎక్కువగా ఉండకూడదు
ఈ – పుట్టుమచ్చ చర్మం మీద ఉబ్బెత్తుగా, వాచినట్లుగా ఉండవద్దు.

ఈ లక్షణాలు ఉంటే..
పెద్దపేగులో క్యాన్సర్‌ వ్యాధి తొలుత చిన్న గుల్లలుగా మొదలవుతుంది. క్రమంగా క్యాన్సర్‌ కణుతులుగా మారుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అవి పెద్దపేగు క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే.

పెద్దపేగు క్యాన్సర్‌ ప్రధాన లక్షణాలు
పొత్తికడుపు భాగంలో నొప్పి లేదా పట్టేసినట్లు ఉండటం.
ఆకస్మికంగా బరువు తగ్గడం.
మలద్వారం వద్ద రక్తస్రావం కావడం, మలంలో రక్తం పడటం.
డయేరియా, మలబద్ధకం తదితర సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగడం.

వీరు అప్రమత్తంగా ఉండాలి..
గతంలో క్యాన్సర్‌ వచ్చి తగ్గినవారు.
అల్సరైటివ్‌ కొలైటిస్‌ ఉన్నవారు.
రక్తసంబంధీకుల్లో (తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు) ఎవరికైనా క్యాన్సర్‌ ఉన్నట్లు తేలితే
అప్రమత్తంగా ఉండాలి.
ప్రతి మూడేండ్లకు ఒకసారి ఎఫ్‌ ఒబిటి, ఫ్లెక్సిబుల్‌ సిగ్మాయిడో స్కోపి వంటి పరీక్షలు చేయించాలి.

ఆ కారణాల వల్లే నోటి క్యాన్సర్‌
మనదేశంలో ఇతర క్యాన్సర్ల కంటే నోటి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. అందుకని ప్రతి వ్యక్తికీ నోటి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ ఎంతో అవసరం. సాధారణంగా నోటిలో కలిగే ప్రాథమిక మార్పుల వల్ల కూడా నోటి క్యాన్సర్‌ను ఆరంభదశలో గుర్తించవచ్చు. అధికశాతం మందిలో పొగాకు ఉత్పత్తులు తినడం, పొగతాగడం, మద్యపానం తదితర కారణాల వల్ల నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నోటిలో మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్‌ మసాలా వంటి అలవాట్లు ఉన్నవారు వెంటనే మానుకోవాలి.
నోటిలో ఏవైనా గడ్డలు లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సకాలంలో