DailyDose

రాష్ట్రపతి ఎన్నికలో విధానాలివే..!

రాష్ట్రపతి ఎన్నికలో విధానాలివే..!

అధికార, ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త రాష్ట్రపతి ఎవరవు తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి, అయితే కొత్త రాష్ట్రపతి ఎవరా అన్న ఉత్కంఠ వీడాలంటే జూలై 20 వరకు వేచిచూ డాల్సిందే. ఈ ఎన్నికలు ఎలా జరుగుతా యన్న సందేహం అందరికీ వస్తుంది. కాని రాష్ట్ర అసెంబ్లీలకు, పార్లమెంటుకు జరిగే ఎన్నికలకు రాష్ట్రపతి ఎన్ని కలకు పొంతన లేదు. ఎమ్‌ఎల్‌ఎలు, ఎమ్‌పిలు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడితారు. అత్యంత సంక్లిష్టంగా ఉండే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రమే ఉండే ఐదు విధానాల గూర్చి సంగ్రహంగా…
***ఓటు ఎలా చెల్లుబాటవుతుంది
దేశంలో జరిగే ఇతర ఎన్నికల్లో ఇవిఎమ్ లను వాడు తుండగా, ప్రెసిడెంట్ ఎలక్షన్లలో బ్యాలెట్ పేపర్‌నే వాడుతు న్నారు. ఇవిఎమ్ వాడినప్పుడు చెల్లుబాటుకాని ఓట్లంటూ ఉండవు, బ్యాలెట్ పేపర్ ద్వారా అయ్యే ఓటింగ్‌లో పొర పాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్ లోకసభ సభ్యులకు, గులాబీ రంగు బ్యాలెట్ ఎమ్‌ఎల్‌ఎలకు ఇవ్వడం జరుగుతుంది. లోకసభ సభ్యులకు అందించే బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లు హింది, ఇంగ్లీ షుల్లో ప్రింట్ అయి ఉండగా, ఎమ్‌ఎల్‌ఎ లకు అందించే బ్యాలెట్ పేపర్లో ఇంగ్లీష్, స్థానిక అధికారిక భాషలో ముద్రించబడి ఉంటుంది. ఏ బ్యాలెట్‌లోనైనా మొదటి ప్రాధాన్యత ఓటును మార్క్ చేసినట్లయితేనే అది చెల్లుబాట వుతుంది, రెండో ప్రాధాన్యత అనేది ఐచ్ఛికం. ఏదైనా బ్యాలె ట్ పత్రం చెల్లుబాటు కాలేదంటే కారణాలు సాధరణంగా కిందివి ఉండవచ్చు.
* ఏదైనా ఒక బొమ్మను గుర్తించకపోతే
* ఒక వ్యక్తికంటే ఎక్కువమంది పేర్లతో ఒకే బొమ్మను మార్క్ చేస్తే
* ఒక బొమ్మ తో పాటు మరి కొన్నింటిని, ఒకే వ్యక్తి పేరుతో మార్క్ చేస్తే
* ఓటరు గుర్తించిన ఓటుతో ఆ వ్యక్తి గుర్తించబడితే
* ప్రాధాన్యతను తెలిపేందుకు 1,2,3 నంబర్లను కాకుండా పదాల్లో తెలిపితే.
***నామినేషన్ తిరస్కరణ
ప్రెసిడెంట్ ఎలక్షన్లలో పోటీపడేందుకు కొన్ని అర్హతలవసరం, అయితే కింది సందర్భాల్లో నామినేషన్ తిరస్కరించబడుతుంది.
* నామినేషన్లను స్కౄటినైజ్ చేసేప్పుడు అర్హతకుసంబం ధించిన లోపం ఉంటే పోటీపడిన వ్యక్తి తిరస్కరణకు గురవు తారు
* ప్రెసిడెంట్ అభ్యర్థిని సూచించే వ్యక్తికి సరైన అర్హత లేకున్నా అభ్యర్థిత్వం తిరస్కరిస్తారు.
* అభ్యర్థి సంతకం, తనను సూచించిన వ్యక్తి సంతకం ఏదైనా తప్పుగా తేలితే కూడా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించ డం జరుగుతుంది.
ఏడవ ప్రెసిడెంట్ ఎన్నికల్లో(1977) 37 అభ్యర్థిత్వాలు రాగా 36 తిరస్కరించబడి, నీలం సంజీవయ్య ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు.
****పోలింగ్ బూత్‌లను ఎంచుకోవడం(ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌పి)
దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఎలక్షన్ బూత్‌ను ఎంచుకునే సౌకర్యం పౌరులకు ఉండదు. కాని ప్రెసిడెంట్ ఎన్నికల్లో వోటర్లైన ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌పిలు వారు వోటువేసే బూత్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఎమ్‌పిలు న్యూఢిల్లీలో ఓటువేయగా, ఎమ్‌ఎల్‌ఎలు వారి సొంత రాష్ట్ర రాజధానుల్లో ఓటు వేయవచ్చు. ఎన్నిక జరిగే సమయంలో ఎన్నికల కేంద్రాన్ని ఎలక్షన్ కమిషన్ నిర్థారి స్తుంది (ఢిల్లీ, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో). అలాగే ఎన్నికల సమయంలో ఎమ్‌పి రాష్ట్రంలో, ఎమ్‌ఎల్‌ఎ దేశ రాజధానిలో గనక ఉంటే వారి ఓటుహక్కుకు భంగం కలగ కుండా ఏర్పాట్లను ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అలాగే ఎమ్‌ఎల్‌ఎ లేదా ఎమ్‌పి వారికి నిర్దేశించిన ప్రాంతంలో ఓటు వేయలేకపోతే పది రోజుల ముందుగా ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. అత్యంత అనివార్య సమయాల్లో ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా ఓటు వేసే వెసులుబాటు వీరికి కల్పిస్తారు.
**డిజిట్ డబ్బు దండగ
అభ్యర్థిగా పోటీ పడే ప్రతి ఒక్కరు రూ.15,000లను సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జమచేయాల్సిన సొమ్మును రెండు దఫాలుగా పెంచారు, మొదట 1974 ( ఆరవ రాష్ట్రపతి ఎన్నిక) లో 2,500 పెంచగా, తరువాత 1997లో సొమ్ము మొత్తాన్ని 15,000 గా చేశారు. అభర్థి గెలిచినా, ఓడినా, చెల్లిన ఓట్లలో 1/6 ఒట్లు ఓటమి చెందిన అభ్యర్థికి వచ్చినా, డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి పొందడానికి వీలులేదు.
**పార్లమెంట్ హౌజ్‌లోనే ఒట్లను లెక్కిస్తారు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఒట్ల లెక్కింపును పార్లమెంట్ హౌజ్‌లోనే చేపడతారు. ఇతర ప్రాంతాల్లో అయిన ఓట్లను, ప్రత్యేకమైన సీల్డ్ కవర్లలో ఉంచి ఢిల్లీకి పంపిస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్‌లను తెరవ కుండా ప్రత్యేక కవర్లలో ఉంచి, అభ్యర్థి నిర్ధారించిన వ్యక్తి సమక్షంలో దేశ రాజధానికి పంపించడం జరుగుతుంది.