DailyDose

మైక్రోసాఫ్ట్‌లో 1,800 మందికి ఉద్వాసన

మైక్రోసాఫ్ట్‌లో 1,800 మందికి ఉద్వాసన

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లోనూ ఉద్యోగా ల కోత ప్రారంభమైంది. వివిధ దేశాల్లో పని చేస్తున్న 1,800 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. వ్యాపా ర కార్యకలాపాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పని చేస్తున్న 1.8 లక్షల మందిలో వీరి సంఖ్య ఒక శాతం కంటే తక్కువని తెలిపింది. వీరిని తీసివేసినా కొత్త ఉద్యోగుల నియామకాలు ఆగవని స్పష్టం చేసింది.