Health

కండ్లద్దాలకు చెక్‌ పెట్టే చుక్కల మందు

కండ్లద్దాలకు చెక్‌ పెట్టే చుక్కల మందు

ప్రెస్బియోపియా (దగ్గరలో ఉన్న వస్తువులు కనిపించకపోవడం) కారణంగా పేపర్‌ చదవడానికి కూడా వయోధికులు కండ్లద్దాలతో కుస్తీపడటం చూస్తూనే ఉంటాం. దీనికి సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు అమెరికా శాస్త్రవేత్తలు. కండ్లలో వేసుకొనే చుక్కల మందు ద్వారా ప్రెస్బియోపియాను తాత్కాలికంగా దూరం చేయవచ్చని పేర్కొన్నారు. ‘వుయిటీ’గా పిలిచే ఈ కండ్లల్లో వేసుకునే చుక్కల మందుకు రోజుకు ఒక్కసారి ఒక్కో చుక్కను కండ్లల్లో వేసుకుంటే ఆరుగంటల పాటు కండ్లు స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ఈ చుక్కల మందు ఖరీదు రూ. 6,300.