Devotional

తెలుగు రాష్ట్రాల్లో భక్తీ శ్రద్దలతో గురుపౌర్ణమి వేడుకలు – ఆధ్యాత్మికం

తెలుగు రాష్ట్రాల్లో  భక్తీ శ్రద్దలతో  గురుపౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి . తెల్లవారుజాము నుంచే సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. విద్యుత్‌ వెలుగు ఆలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నది. అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు.గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపౌర్ణమి అని పిలుస్తారు. హిందులు ప్రతిఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజును గురుపూజోత్సవం జరిపి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం శుభసూచకమని భావిస్తారు.

2. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 92 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. 21 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, ఇతర ఆభరణాలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 92 లక్షల 3 వేల 894 రూపాయల నగదు, 238 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 18 కిలోల 250 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి పర ్యవేక్షణలో ఏఈవోలు బి.శ్రీనివాస్‌, జయకుమారి, ప్రతాప నవీన్‌, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, గోలి శ్రీనివాస్‌, హరిహరనాథ్‌, పూజిత, తిరుపతిరావు, నటరాజు, లక్ష్మణరావు, వరి నర్సయ్య, గుండి నర్సింహమూర్తి, వెల్ది సంతోష్‌, అరుణ్‌కుమార్‌, అకౌంట్స్‌ అడ్వైజర్‌ ఆగమరావు, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
1284294-koil-alwar-tirumanjanam
3. తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించాక భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు రాంభూపాల్‌రెడ్డి, మారుతి ప్రసాద్‌, సతన్‌కుమార్‌, మధుసూదన్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
278-VIJ4-GIRIPRADAKSHINA2
how to determine aspect ratio of monitor
4. వైభవంగా సింహ‘గిరి ప్రదక్షిణ’
మహావిష్ణువు ద్వయావతారుడిగా కొలువుదీరిన సింహాచలం క్షేత్రంలో వార్షిక ఉత్సవం ‘గిరి ప్రదక్షిణ’ మంగళవారం మధ్యాహ్నం వైభవంగా ప్రారంభమైంది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లు ఉత్సవం జరగకపోవడంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి తరలివచ్చిన భక్తులతో ఉదయం ఆరు గంటలకే సింహాచలం భక్త జనసంద్రమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు స్వామి వారి ప్రత్యేక రథం (పూల రథం)లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈవో ఎం.వి.సూర్యకళ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో సింహాచలం నుంచి హనుమంతవాక జంక్షన్‌ వరకు బీఆర్‌టీఎస్‌ రోడ్డు కిటకిటలాడింది. మూడు నుంచి నాలుగు లక్షల మంది స్వామి వార్షిక యాత్రలో పాల్గొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

5. అప్పన్నకు ఘనంగా 4వ విడత చందనం సమర్పణ
సింహాచలం అప్పన్నకు నాలుగవ విడత చందనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని అర్చకులు స్వామికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు అప్పన్నస్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. బస్సులు, మెట్లమార్గం ద్వారా వేలాది మంది భక్తులు ఇప్పటికే కొండపైకి చేరుకుంటున్నారు.

6. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ.కోటి 92 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. 21 రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, ఇతర ఆభరణాలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 92 లక్షల 3 వేల 894 రూపాయల నగదు, 238 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 18 కిలోల 50 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి పర ్యవేక్షణలో ఏఈవోలు బి.శ్రీనివాస్‌, జయకుమారి, ప్రతాప నవీన్‌, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, గోలి శ్రీనివాస్‌, హరిహరనాథ్‌, పూజిత, తిరుపతిరావు, నటరాజు, లక్ష్మణరావు, వరి నర్సయ్య, గుండి నర్సింహమూర్తి, వెల్ది సంతోష్‌, అరుణ్‌కుమార్‌, అకౌంట్స్‌ అడ్వైజర్‌ ఆగమరావు, పీఆర్‌వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

7. ఆషాడ పూర్ణిమ సింహాద్రి_అప్పన్న..
సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి నాలుగు విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్న గిరిపున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు. పరమాత్మ సర్వవ్యాపకుడు. ఈ సందేశాన్ని మనకు అందించినవాడు సింహాచల స్వామి. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు సింహాచల వరాహలక్ష్మీ నరసింహుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అప్పటి నుంచి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో పూర్ణిమ తిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పణ చేస్తారు.ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు..

8. జూలై 15న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పుష్పయాగం
అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. జూలై 14వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.జూలై 15వ తేదీ ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.మధ్యాహ్నం 2.50 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పెద్దశేష వాహ‌నంపై స్వామి అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.ఇటీవల శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

9. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ పరిసరాల్లో ఉన్న 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. వీరికి దర్శనం 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి . నిన్న 74,212 మంది భక్తులు స్వామివారి దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చిందని తెలిపారు.తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి.
maxresdefault
10. 17న‌ మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఆహ్వాన ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల ఉత్స‌వాల‌కు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన‌ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఆల‌య అధికారులు.

11. నేటితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలు
శాకంబరి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. శాకంబరి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి అలంకరణకు భక్తులు జీడిపప్పులు, బాదం, పిస్తాలతో పాటు.. పూలజడ, మంగళసూత్రాలు సమర్పించారు. లవంగాలు, యాలకులతో అమ్మవారికి భక్తులు హారం సమర్పించారు. పూర్ణాహుతితో శాకంబరి ఉత్సవాలు ముగియనున్నాయి