Movies

ఐకాన్ స్టార్ మరో అరుదైన రికార్డ్

ఐకాన్ స్టార్  మరో అరుదైన రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్మ రో అరుదైన రికార్డు‌ను సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్ర ఆల్బమ్ 5 బిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రంపై మొదటి నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డు సాధించింది ‘పుష్ప’. ఇప్పటికే ‘పుష్ప’ మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో తెలియంది కాదు. అలాగే ఇప్పుడు పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైన అన్ని భాషలలో కలిపి 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డును క్రియేట్ చేశారు.

దేవీ శ్రీ ప్రసాద్సం గీతం అందించిన ‘పుష్ప’ చిత్ర ఆల్బమ్ విడుదలైన అన్నిచోట్లా సూపర్బ్ స్పందనను రాబట్టుకుంది. ఇందులోని.. ‘దాక్కో దాక్కో మేక’, ‘ఏయ్ బిడ్డా’, ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ పాటలకు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమేన క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్‌లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘పుష్ప’ సినిమాలోని ప్రతీ విషయం కూడా ప్రేక్షకులకు అడిక్షన్‌లా మారిపోయింది. ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది ‘పుష్ప’ మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా మ్యూజికల్‌గా సంచలనాలు సృష్టించింది. పుష్ప అదే కంటిన్యూ చేసింది. 5 బిలియన్ వ్యూస్: ఐకాన్ స్టార్ Allu Arjun మరో అరుదైన రికార్డ్పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని మొదటి నుంచి అల్లు అర్జున్ చెబుతూనే ఉన్నారు. అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైపోతుందిప్పుడు. ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. దర్శకుడు సుకుమార్‌ను పొగుడుతూ.. పుష్ప సినిమాను ఆయన వర్ణించిన తీరు అద్భుతం. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాంటి సినిమా అసలు ఎలా తీశారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్‌ ను ఆకాశానికి ఎత్తేసారు బాలీవుడ్ దిగ్దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి . ఈ విషయాన్ని కూడా బన్నీ ముందుగానే అంచనా వేశారు.

సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగా ఉండటమే కాకుండా.. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని అల్లు అర్జున్ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ‘పుష్ప’ ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ‘పుష్ప’ తరహాలో ‘తగ్గేదే లే’ అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా.. ఇప్పటికీ ‘పుష్ప’ క్రేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కానే కాదు.