DailyDose

అమర్నాథ్ యాత్రలో విషాదం.. అనకాపల్లి వాసి మృతి – TNI నేర వార్తలు

అమర్నాథ్ యాత్రలో విషాదం.. అనకాపల్లి వాసి మృతి  – TNI  నేర వార్తలు

* అమర్నాథ్ యాత్రకు వెళ్లిన అనకాపల్లి వాసి ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. గవరపాలెంలోని నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి అప్పారావు ఈనెల రెండో తేదీన 15 మందితో కలిసి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. బద్రీనాథ్‌లో దర్శనం ముగించుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఊపిరి అందక ఇబ్బందిపడిన అప్పారావును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పారావు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పారావు కుటుంబ సభ్యులను అనకాపల్లి తహశీల్దార్‌ పరామర్శించారు.

* గుంటూరు జిల్లా పొన్నూరు మండలం.. బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి అనుపమ (30), కిరణ్ (31)లు ఆత్మహత్య చేసుకున్నారు. తెనాలి మండలం పినపాడు రైల్వే గేటు వద్ద రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

* యువతి ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని హెచ్చరించాడు. పలువురికి ఆ వీడియోలను పంపాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

* నెల్లూరులో అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. పొదలకూరు రోడ్డులోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం మైదానంలో.. దాదాపు 3 కోట్ల 14 లక్షల విలువైన 74 వేల 547 మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీల్లో దొరికిన 15వేల 719 లీటర్ల మద్యం బాటిళ్లను ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కర్నాటక, గోవా, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన డ్యూటీ ఫైడ్ లిక్కర్ ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

* తెలంగాణ రాష్ట్రం కుమురం భీం జిల్లా రెబ్బెన ఎస్సై భవానీసేన్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడంతో మంగళవారం చర్యలు తీసుకున్నట్లు ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సై విధుల నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు చెప్పారు. పేద కుటుంబానికి చెందిన బాధిత యువతి కష్టపడి ఇంటర్‌ వరకు చదివింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి ఇల్లు వదిలి వెళ్లగా.. కుటుంబ పోషణ కోసం ప్రైవేటుగా చిన్నపాటి ఉద్యోగాలు చేస్తోంది. పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.

* గుంటూరు శివారులోని నల్లపాడు రోడ్డులో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. లారీలో ఒక్కసారిగా మంటలు రావటంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ హుటాహుటిన లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే లారీ సగానికి పైగా కాలిపోయింది. ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.

* అనంతపురం జిల్లాలోని గుత్తిలో రోడ్డు దాటుతున్న చిన్నారుల పైకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. చిన్నారులు మేనమామతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్‌ వీరిపై ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు.

* పెంపుడు కుక్క ఇంట్లోని వృద్ధురాలిపై దాడి చేసి చంపింది. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రిటైర్డ్‌ స్కూల్ టీచర్ అయిన 83 ఏళ్ల సుశీలా త్రిపాఠి, చిన్న కుమారుడితో కలిసి లక్నో నగరం బెంగాలీ తోలా ప్రాంతంలోని ఖైజర్‌బాగ్‌లోని ఇంట్లో నివాసం ఉంటున్నది. వారికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒకటి పిట్ బుల్. కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పనిమనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఆ వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో లక్నో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన అధికారుల బృందం బుధవారం ఆ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పిట్‌ బుల్‌ డాగ్‌ను పెంచుకునే లైసెన్స్‌ ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆ ఇంటికి వెళ్లినట్లు పశువైద్యుడు డాక్టర్‌ అభినవ్‌ వర్మ తెలిపారు. బొచ్చుతో పొట్టిగా ఉండే పిట్ బుల్ డాగ్స్‌ను శిక్షణ లేని వ్యక్తులు పెంచుకోవడం చాలా ప్రమాదకరమని అన్నారు.

* ఒక కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక కుటుంబంలోని ఆరుగురు మధ్యప్రదేశ్‌లోని నందగౌముల్క్ నుంచి మహారాష్ట్రలోని ముల్తాయ్‌కు స్కార్పియోలో వెళ్తున్నారు.అయితే కారు డ్రైవర్‌ లీలాధర్ హివారే తప్పుడు నిర్ణయంతో వారు ముప్పులోపడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు కెల్వాడ్ వద్ద వరదలు పోటెత్తుతున్న నందా కాలువపై తక్కువ ఎత్తులో ఉన్న వంతెనను దాటేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో ఆ కారు కొట్టుకుపోయింది. సహాయం కోసం అందులోని వారు కేకలు వేసినా ఫలితం లేకపోయింది.కాగా, ఇది చూసిన కొందరు స్థానికులు ఏమీ చేయలేకపోయారు. మరి కొందరు కొట్టుకుపోతున్న కారును తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పదేళ్ల బాలుడు, ఒక మహిళ, ఒక పురుషుడి మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

* విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలో మహిళపై కోతుల దాడి..మద్దాల కుమారి అనే మహిళకు తీవ్ర గాయాలు..చికిత్స నిమిత్తం తెల్లదేవరపల్లి పిహెచ్సి కు తరలింపు..

* కడప ల్లాలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. రాయచోటి మండలంలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యం కావడం గ్రామంలో కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.

* విజయవాడ కృష్ణలంక సత్యం గారి హోటల్ సమీపంలో కరెంట్ ట్రాన్స్ఫారం పేలి పక్కనే ఉన్న వాటర్ ప్లాంట్ లో చెలరేగిన మంటలు..ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన స్థానికులు..ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది..

* ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలో మహిళపై కోతుల దాడి..మద్దాల కుమారి అనే మహిళకు తీవ్ర గాయాలు..చికిత్స నిమిత్తం తెల్లదేవరపల్లి పిహెచ్సి కు తరలింపు..

*పూడూరు మండలం సోమన్ గుర్తి వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం( లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా… చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. పరిగి మండలం సుల్తాన్ పూర్‌లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన జావెద్ (12), ఉమర్(6), జహినాబీ(68)లుగా గుర్తించారు.

*పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి కొత్తపేటలో పెను ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కుప్పకూలింది.. కాగా ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి యాజమాని శిరాసాల ఏడుకొండలు(65) ఉదయాన్నే టీ తాగటానికి బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది.

* తెనాలి సమీపంలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై యువతీ యువకుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. తలలు పగిలిపోయి గుర్తించలేని స్థితిలో ఇద్దరి మృతదేహాలున్నాయి. పినపాడు – మల్లెపాడు మధ్య ట్రాక్‌పై మృతదేహాలను స్థానికులు గుర్తించారు. చేబ్రోలు మండలం, బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

*అనంతపురం: జిల్లాలోని గుత్తిలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న చిన్నారుల పైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

**ఎన్టీఆర్: జిల్లాలోని ఎనికేపాడు అను ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారంటూ… ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు వెల్లువెత్తాయి. ఆస్పత్రి ఎదుట భారీగా పోలీసుల మోహరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*వానాకాలం! నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు! దుస్తులు బయట ఆరేసుకునే పరిస్థితే లేదు! ఇంటి ఆవరణలోనో.. ఇంట్లోనో ఆరేసుకోవాల్సిన పరిస్థితి! దుస్తులను అలా ఆరేయడమే ఆ కుటుంబం పాలిట శాపమైంది! బరువు ఎక్కువ కావడంతో దుస్తులు ఆరేసిన ఇనుప తీగ తెగింది! అది కాస్తా.. అక్కడే ఉన్న ఫ్యూజును తాకింది! ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారులు దానిని తొక్కారు! విద్యుత్తు షాక్‌తో విలవిలలాడారు! కన్న బిడ్డలను కాపాడుకోవడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు కూడా ఒకరి తర్వాత మరొకరుగా విద్యుత్తు షాక్‌కు గురయ్యారు! నలుగురూ అక్కడికక్కడే మరణించారు! ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్‌ కాలనీలో మంగళవారం జరిగింది. కాలనీకి చెందిన హైమద్‌ (35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పర్వీన్‌ (30), కుమార్తె మహిమ్‌ (6), కుమారులు అద్నాన్‌ (4), ఫైజాన్‌ ఉన్నారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో అదే కాలనీలో ఉంటున్న పుట్టింటికి మూడు రోజుల కిందట పిల్లలతో కలిసి పర్వీన్‌ వెళ్లింది. సోమవారం రాత్రి పెద్ద కుమారుడు పైజాన్‌ను తల్లిదండ్రుల వద్దే ఉంచి మిగతా ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం దుస్తులు ఉతికిన పర్వీన్‌.. బయట వర్షం పడుతుండడంతో ఇంటి ఆవరణలో ఉన్న ఇనుప వైర్‌పై ఆరేసింది. బరువు అధికం కావడంతో ఇనుప వైరు తెగి పక్కనే ఉన్న ఫ్యూజ్‌కు తగిలింది. తీగకు విద్యుత్తు సరాఫరా అయింది. ఆ సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు అద్నాన్‌, మహిమ్‌ ప్రమాదవశాత్తు ఇనుప తీగకు తగిలారు. విద్యుత్తు షాక్‌ కొట్టడంతో పిల్లలు గిలగిలా కొట్టుకుంటున్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన పర్వీన్‌ కూడా విద్యుత్తు షాక్‌కు గురైంది. భార్యాపిల్లలను కాపాడే ప్రయత్నంలో హైమద్‌ కూడా తీగను పట్టుకున్నాడు. దీంతో, నలుగురూ విద్యుత్తు షాక్‌కు గురై.. అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు బతికుండవచ్చనే భావనతో స్థానికులు తొలుత ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాలను ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

* నవమాసాలు మోసి కని, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లెదుటే మృత్యువాతపడ్డాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక నిత్యం మానసిక వేదనకు గురైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగింది.

*సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, కేంద్ర కేబినెట్‌ మాజీ సెక్రటరీ టీఆర్‌ ప్రసాద్‌ (81) విశాఖపట్నంలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. 1963 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్‌ సెక్రటరీగా పనిచేశారు. కొంతకాలం డిఫెన్స్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. విశాఖపట్నం పోర్టు చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. 2002 అక్టోబరులో సర్వీసు నుంచి రిటైరయ్యారు. 2004 డిసెంబరు వరకు 12వ ఆర్థిక సంఘం సభ్యునిగా పనిచేశారు. విశాఖపట్నంలో విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నిడుబ్రోలు.

*విజయవాడ సత్యనారాయణ‌పురం భాను‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌ గురై దంపతులు మృతిచెందారు. మోటార్ స్విచ్ వేస్తుండగా భర్త విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. భర్తను రక్షించబోయి భార్య కూడా షాక్ గురై ఇద్దరు మోటార్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దంపతుల మృతితో భానునగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

* ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంకు చెందిన కొట్టాల తరుణ్‌ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఇంటి వద్ద ఖాళీ సమయంలో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడేవాడు ఇం దు కోసం ఓ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని, అందులో తన బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేశాడు. ఆట ఆడుతుండగా ఖాతా నుంచి రూ. 1.80 లక్షలు కట్‌ అయినట్లు ఫోన్‌కు సందేశం రావడం తో ఆందోళన చెందాడు. దాన్యం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులు ఇటీవలే తరుణ్‌ ఖాతాలో వేశారు. డబ్బులు పోయిన విషయం ఇంట్లో తెలుస్తుందనే భయంతో అతను మూడు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

* వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టు కూలీ మంజుల(46) అనే మహిళ మృతి చెందింది. గత రెండు రోజుల క్రితం తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో చెట్టు కూలీ ఆమె మీద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా వనస్థలిపురంలోనీ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. మంజులకు బర్త మల్లేష్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంజుల స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండ గూడెం కాగా ఇండ్లల్లో పని చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని ఎనికేపాడు అను ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారంటూ… ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు వెల్లువెత్తాయి. ఆస్పత్రి ఎదుట భారీగా పోలీసుల మోహరించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.