Politics

డార్జిలింగ్‌లో మోమోస్ చేసి ఆక‌ట్టుకున్న బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ

డార్జిలింగ్‌లో మోమోస్ చేసి ఆక‌ట్టుకున్న బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవ‌ల పెయింటింగ్ వేసి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. డార్జిలింగ్‌లోని స్థానిక స్టాల్‌లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మరో ఇద్దరు మహిళలతో కలిసి మోమోస్‌ను బయటకు తీస్తున్న వీడియోను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌న అధికారిక‌ ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసింది. మ‌మ‌తా బెన‌ర్జీ జ‌న‌నాయ‌కురాలు. ఆమె మాస్ లీడ‌ర్‌. సింహాసనంపైనే కూర్చుండి ఉండిపోరు.ఆమె ఎప్పుడూ ప్ర‌తి బెంగాల్‌ కుటుంబంలో భాగ‌మ‌వుతారు.’ అని టీఎంసీ పార్టీ పేర్కొంది. ఈ వీడియోలో మ‌మ‌తా బెన‌ర్జీ సాధ‌ర‌ణ మ‌హిళ‌లా మోమోస్‌ను పాత్ర‌లోంచి తీస్తున్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లుకొడుతోంది. అంద‌రూ ఆమె సింప్లిసిటీని ప్ర‌శంసించారు.
https://twitter.com/MamataOfficial?ref_src=twsrc%5Etfw