NRI-NRT

దుబాయి వీసా విషయంలో భారతీయులకు ఉన్న ఈ వెసులుబాటు గురించి తెలుసా..?

దుబాయి వీసా విషయంలో భారతీయులకు ఉన్న ఈ వెసులుబాటు గురించి తెలుసా..?

ప్రతియేటా యూఏఈ(UAE)కి పర్యటన, బిజినెస్, ఉద్యోగం, ఇతరాత్ర అవసరాల కోసం విదేశాల నుంచి చాలా మంది వెళ్తుంటారు. దీనికోసం దాదాపు అందరూ ముందుగా పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని దేశాల వారికి విజిట్ వీసా అవసరం లేకుండా వీసా ఆన్ అరైవల్ లేదా వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యం ఉంటుంది. ఈ సౌకర్యం కొన్ని సందర్భాల్లో భారతీయ పౌరులకు కూడా వర్తిస్తుంది. ఇలా యూఏఈలో వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ వెసులుబాటు ఏఏ దేశాల వారికి ఉంటుంది? భారతీయులకు ఏఏ సందర్భాల్లో వర్తిస్తుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీసా ఫ్రీ ఎంట్రీ..
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం ఉంటుంది. జీసీసీ దేశాలకు చెందిన వారికి యూఏఈ‌లో ఎంట్రీకి వీసా పర్మిట్ అవసరం లేదు. ఈ దేశాల వారు ఎంట్రీ పాయింట్ వద్ద వారివారి దేశాలకు చెందిన పాస్‌పోర్ట్ లేదా నేషనల్ ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది.

వీసా ఆన్ అరైవల్..
వీసా ఆన్ అరైవల్ సౌకర్యం 30, 90 రోజుల వ్యవధితో ఉంటుంది. 30 రోజుల వ్యవధితో కొన్ని దేశాల వారికి, 90 రోజుల వ్యవధితో మరికొన్ని దేశాల వారికి ఈ వెసులుబాటు ఉంది. ఇక 30 రోజుల కాలపరిమితితో ఇచ్చే వీసా ఆన్ అరైవల్‌కు మరో 10 రోజుల పాటు పొడిగించుకునేందుకు గ్రేస్ పిరీయడ్ సైతం ఇస్తారు. ఈ 30 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే..

90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాలివే..
ఈ జాబితాలోని దేశాల పౌరులకు ఎంట్రీ వీసా కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వీరికి 90 రోజుల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. ఈ దేశాల జాబితాలో Argnetina, Seychelles, Montenegro, Honduras, Bulgaria, Sweden, Romania, Liechtenstein, Denmark, Austria, Slovakia, Nauru, Hungary, Chile, Switzerland, Russian Federation, Lithuania, El Salvador, Bahamas Island, Slovenia, Netherlands, Iceland, Costa Rica, Uruguay, Saint Vincent and the Grenadines, Luxembourg, Estonia, Barbados, Solomon Island, Norway, Italy, Croatia, Finland, Maldives, Paraguay, Belgium, South Korea, France, Kiribati, Cyprus, Poland, Serbia, Malta, Germany, Brazil, Spain, Portugal, Latvia, Czech Republic, Greece, Andorra, Mauritius, Australia, Monaco, Canada, New Zealand, Hong kong, China, San Marino, Ireland, Singapore ఉన్నాయి.

ఇక వీసా ఫ్రీ ఎంట్రీ లేదా వీసా ఆన్ అరైవల్ వెసుబాటు భారతీయ పౌరులకు ఎప్పుడు వర్తిస్తుందంటే.. భారతీయ పాస్‌పోర్టుతో పాటు అమెరికా జారీ చేసిన విజిట్ వీసా లేదా గ్రీన్‌కార్డు లేదా బ్రిటన్ రెసిడెన్సీ వీసా లేదా యూరోపియన్ యూనియన్ రెసిడెన్సీ వీసా కలిగి ఉంటే ఇది వర్తిస్తుంది. దీని ద్వారా 14 రోజుల పాటు యూఏఈలో ఉండేందుకు వీలు పడుతుంది. ఇక గ్రీన్‌కార్డుదారులు ఆరు నెలల వరకు అక్కడ ఉండొచ్చు. ఇదిలాఉంటే.. పర్యాటకుల్లో చాలా మంది దుబాయ్ నగరానికి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇలా 2018 ఒకే ఏడాదిలో అత్యధికంగా 16 మిలియన్ల(1.6కోట్లు) మంది విజిటర్లు సందర్శించారట. ఇప్పటివరకూ ఇదే రికార్డ్. వీరిలో 9.97లక్షల మంది భారతీయ పర్యాటకులు ఉన్నారని దుబాయ్‌కు చెందిన డిజిటల్ మీడియా ఏజెన్సీ గ్లోబల్ మీడియా ఇన్‌సైట్ వెల్లడించింది.