DailyDose

పార్లమెంటులో ఇక ఈ పదాలు వాడకూడదు

పార్లమెంటులో ఇక ఈ పదాలు వాడకూడదు

పార్లమెంటులో ప్రజోపయోగ చర్చల కంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికే ప్రజాప్రతినిధులు పోటీపడుతుంటారు. ఈ క్రమంలో హద్దు మీరి, హోదా మరిచి ఒకరిపై ఒకరు దూషణకు దిగుతుంటారు. కొన్నిసార్లు ఇది మరింత శ్రుతిమించి తీవ్రస్థాయిలో తిట్టుకుంటూ ఉంటారు.ఇకపై అలా ఇష్టానుసారం తిట్టుకోవడం కుదరదు. పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ఒకరినొకరు తిట్టుకునేందుకు ఇప్పటి వరకు ఉపయోగించిన కొన్ని పదాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు కొన్ని పదాలు వాడకూడదని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం.. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను అన్ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. ఈ పదాలను ఇకపై ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీల్లేదని అందులో స్పష్టం చేసింది. అలాగే, బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూజ్డ్, చీటెడ్, కరప్ట్, డిక్టేటోరియల్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్‌ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, స్నూప్‌గేట్‌ వంటి ఇంగ్లిష్ పదాలను ఆ జాబితాలో చేర్చింది.వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, తానాషా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్థానీ, ఖూన్ ‌సే ఖేటి, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా ఉన్నాయి. చట్ట సభ్యులు కనుక దీనిని ఉల్లంఘించి ఆ పదాలను ఉపయోగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్‌సభ, రాజ్యసభ అధిపతులకు ఉంటుందని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది.