NRI-NRT

టీడీపీ ఎన్నారై శాఖలకు ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం

టీడీపీ ఎన్నారై శాఖలకు ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం

తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ ఎన్నారై శాఖలకు కొత్త కార్యవర్గ కమిటీ సభ్యులు ఎంపికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటనలు విడుదల చేశారు. కువైత్, ఓమాన్, యూఏఈ, యూఎస్ఏ, ఖతార్ శాఖలకు కొత్త కమిటీలు ఎంపికయ్యాయి.
07152022162502n54
ఒమన్‌, ఖతర్‌, కువైట్‌ 1, 2, యూఏఈ, యూఎస్‌ఏ ఎన్నారై టీడీపీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఈ నియామకాల ప్రకటన జారీ చేశారు. ఎన్నారై టీడీపీ కువైట్‌ 1 ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా నాగేంద్రబాబు అక్కిలి, ఉపాధ్యక్షుడిగా రహంతుల్లా షేక్‌, ప్రధాన కార్యదర్శిగా మల్లిఖార్జున మారతు, కోశాధికారిగా మోహన్‌ రాచూరి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా శ్రీనివాసరాజు వెలిగండ్ల నియమితులయ్యారు. ఎన్నారై టీడీపీ కువైట్‌ 2 ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా మద్దిన ఈశ్వర్‌ నాయుడు, ఉపాధ్యక్షుడిగా షేక్‌ బాష, ప్రధాన కార్యదర్శిగా వేగి వెంకటేశ్‌, కోశాధికారిగా ఎనుగొండ నరసింహులు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా వీసీ సుబ్బారెడ్డిని నియమించారు.
07152022162512n7
ఎన్నారై టీడీపీ ఒమన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా మొహమ్మద్‌ ఇమామ్‌, ఉపాధ్యక్షుడిగా గారపాటి సత్యశ్రీధర్‌, ప్రధాన కార్యదర్శిగా వంకా రామన్‌, కోశాధికారిగా కంతేటి రాఘవేంద్ర, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా దాకే ప్రేమసాగర్‌, గల్ఫ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా హరిబాబు నల్లి నియమితులయ్యారు. ఎన్నారై టీడీపీ యూఏఈ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరావు మోతుకూరి, ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌ కాచర్ల, ప్రధాన కార్యదర్శిగా వాసు పొదిపిరెడ్డి, కోశాధికారిగా రాజా రవికిరణ్‌ కోడి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా హరి కల్లూరి, గల్ఫ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఖాదర్‌ బాషా షేక్‌ని నియమించారు. ఎన్నారై టీడీపీ యూఎ్‌సఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ అబ్బూరి, ఉపాధ్యక్షురాలిగా సంగీత దొంతినేని, ప్రధాన కార్యదర్శిగా రీనారెడ్డి కట్టా, కోశాధికారిగా రమేశ్‌ చుండ్రు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి శ్రీని మన్నె… ఎన్నారై టీడీపీ ఖతర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షుడిగా రమణ గొట్టిపాటి, ఉపాధ్యక్షుడిగా నరేశ్‌ ఎం, ప్రధాన కార్యదర్శిగా రవి పొనుగుమాటి, కోశాధికారిగా విక్రమ్‌ సుఖవాసి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా గోవర్ధన్‌రెడ్డి, గల్ఫ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఎంవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు.
07152022162523n12
07152022162538n81
07152022163716n93
07152022163723n66