Devotional

ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతకంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
Talasani-1-1-V-jpg-816x480-4g