DailyDose

దేశంలో పెరుగుతున్న పెండ్లికాని యువత

దేశంలో పెరుగుతున్న పెండ్లికాని యువత

దేశంలో పెండ్లికాని యువత పెరిగిపోతున్నట్టు ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది. జాతీయ యువజన విధానం-2014 ప్రకారం 15-29 ఏండ్ల మధ్య వారిని యువతగా పరిగణిస్తారు. వీరిలో పెండ్లి కానివారు 2011లో 17.2% మంది ఉండగా, 2019 నాటికి వీరి సంఖ్య 23 శాతానికి పెరిగింది. పెండ్లికాని ప్రసాదుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాతీయ గణాంకాల కార్యాలయం నివేదిక పేర్కొంది. 2011 నాటికి పెండ్లికాని పురుషుల సంఖ్య 20.8% ఉండగా, 2019 నాటికి 26.1 శాతానికి పెరిగింది. యువతుల సంఖ్య కూడా 2011లో 13.5% నుంచి 2019 నాటికి 19.9 శాతానికి చేరింది. జమ్ముకశ్మీర్‌, యూపీ, ఢిల్లీ, పంజాబ్‌ల్లో పెండ్లికాని యువత సంఖ్య ఎక్కువగా ఉండగా, కేరళ, తమిళనాడు, ఏపీ, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో తక్కువగా ఉన్నది.

*తగ్గిన బాల్య వివాహాలు
బాల్యవివాహాలు 2019-21 నాటికి 1.7 శాతానికి తగ్గాయి. యువతులు విద్యావంతులు అవుతున్నకొద్దీ పెండ్లి చేసుకొనే వయస్సు కూడా పెరుగుతున్నదని సర్వే పేర్కొంది. 18 ఏండ్లు దాటకముందే వివాహమయ్యే యువతుల సంఖ్య 15 ఏండ్లలో సగానికి సగం తగ్గినట్టు తెలిపింది. కౌమార దశలోనే తల్లులయ్యే వారి సంఖ్య 16 నుంచి 7శాతానికి తగ్గినట్టు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణత, ఆయుర్దాయం పెరుగుదలతో 2036 నాటికి దేశంలో యువత జనాభా తగ్గిపోతుందని, వృద్ధుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. యువతీయువకుల సంఖ్య 1991లో 22.27 కోట్లు కాగా, 2021 నాటికి 37.14 కోట్లకు పెరిగింది. అయితే 2036 నాటికి వీరి సంఖ్య 34.55 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది.

దేశంలోని యువతలో అవివాహితులు పెరుగుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. జాతీయ యువజన పాలసీ-2014 ప్రకారం.. 15-29 ఏళ్ల మధ్య వయసు వారిని యువత అని నిర్వచించారు. ఈ ఏజ్‌ గ్రూప్‌లో యువత(యువతీయువకులు) విషయంలో 2011 లెక్కల ప్రకారం 17.2ు మంది అవివాహితులు ఉండగా.. 2019కి అది 23 శాతానికి పెరిగింది. ఇదే సమయానికి పురుషుల్లో అవివాహితుల సంఖ్య 20.8ు నుంచి 26.1 శాతానికి పెరగ్గా.. యువతుల్లో 13.5ు నుంచి 19.9శాతానికి పెరిగింది. జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో అవివాహిత యువత సంఖ్య అధికంగా ఉందని.. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తక్కువగా ఉందని ఈ సర్వే వివరించింది. యువత పెళ్లిళ్లను వాయిదా వేయడం.. ఆలస్యంగా వివాహం చేసుకోవడానికి గల కారణాలను మాత్రం ఈ సర్వే విశ్లేషించలేదు. కాగా.. చిన్న/తక్కువ వయసులో పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. 2005-06 సంవత్సరంలో 15-19 వయసు యువతుల్లో 11.9ు మంది పెళ్లిళ్లు చేసుకోగా.. 2019-21కి వారి సంఖ్య 1.7శాతానికి తగ్గింది.