DailyDose

ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ పేర్లను మార్చిన మహా సర్కార్

ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ పేర్లను మార్చిన మహా సర్కార్

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మారుస్తున్నట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రకటించారు. నవీ ముంబై విమానాశ్రయానికి లోక్‌సభ మాజీ ఎంపీ డిబి పాటిల్ పేరు పెట్టనున్నట్లుగా తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని గతంలోనే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకున్నప్పటికీ, అది చట్టవ్యతిరేకమని అందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. కాగా జూన్ 29న తన చివరి క్యాబినెట్ సమావేశంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మరియు ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.