DailyDose

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి – TNI తాజా వార్తలు

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి   – TNI  తాజా వార్తలు

*ఈ నెల 18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ నేప‌థ్యంలో తెలంగాణ శాస‌న‌స‌భ‌లో చేసిన‌ ఏర్పాట్ల‌ను సీఈవో వికాస్ రాజ్ శ‌నివారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సోమ‌వారం జ‌ర‌గ‌నున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలోని మొద‌టి క‌మిటీ హాల్‌లో 2 ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

* ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అనంతపురంలో ఘన సత్కారం జరిగింది. తెలుగు సాహిత్యానికి, జానపదాలను కాపాడేందుకు ఆయన చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. సొసైటీ ఫర్ హ్యూమనిజం అండ్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో అనంతపురంలో శుక్రవారం గోరటి వెంకన్నతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కల్చరల్ క్లబ్ ‘పరివర్తన’ అధ్యక్షుడు డాక్టర్ ఎం సురేష్‌బాబు అధ్యక్షత వహించి గోరటి వెంకన్న సాహిత్య సేవలను ఆవిష్కరించారు.

*గోదావరి వరదలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని ఆదేశించిన ఆయన, సహాయక బృందాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సౌకర్యాల కల్పన, సేవలు నాణ్యంగా ఉండాలని..సీఎం అధికారులకు తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వెయ్యి చొప్పున నగదు అందించాలని ఆదేశాలిచ్చారు. బాధితులంతా శిబిరాలు విడిచి వెళ్లేలోగా సహాయం పంపిణీ చేయాలన్న సీఎం జగన్‌.. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై అధికార్లు సీఎం నివేదించారు.

*అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇస్తే ఎలా అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను బొత్స తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల మూసేశారంటే విద్యాశాఖ మంత్రిగా దానికి బాధ్యత వహిస్తానన్నారు. ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని చెప్పారు. పాఠశాలల్లో తరగతుల విలీనంపై దాదాపు 270 అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
*గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద బాధిత ముంపు ప్రాంతాల జిల్లా వైద్యశాఖ అధికారులు, డాక్టర్లతో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు.

*ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంట గంటకూ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం దగ్గర 21.30 అడుగులకు నీటిమట్టం చేరింది. 25.08 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద విలయం కొనసాగుతోంది. లంక గ్రామాల్లో ముంపు బాధితులకు తినడానికి తిండి లేదు. తలదాచుకోవడానికి చోటు లేదు. ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్లల్లోని సామగ్రి గోదావరి పాలైంది. పంటలు నీట మునిగాయి. కొట్టుకుపోగా మిగిలిన సామగ్రి, కోళ్లు, పశువులను వెంట బెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కోనసీమ జిల్లా లో తీరానికి ఆనుకుని ఉన్న వందకుపైగా లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. సర్కారు కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. వరద ముప్పు నాలుగు రోజులుగా కొనసాగుతున్నా ఇప్పటికీ 8మండలాల్లో లంక గ్రామాలకు అధికారుల జాడే లేదు. ఉన్న సిబ్బంది పెద్దగా సమస్యల్లేని లంకగ్రామాల్లో సహాయక చర్యలపైనే దృష్టిసారిస్తున్నారు.

*రాష్ట్రంలో జరుగుతున్నఅక్రమ మైనింగ్‌‌పై వైసీపీ నాయకులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్‌పై సిగ్గు పడాల్సింది పోయి …. నిర్లజ్జగా సమర్దించుకుంటూ మసి పూసి మారేడికాయ చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్ల వైసీపీ బకాసురుల చేతిలో రాష్ట్రంలోని కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతున్నాయన్నారు. వైసీపీ మూడేళ్లో చేసిన అభివృద్ది సూన్యమన్నారు. వారి ఎజెండా కేవలం దాచుకో… దోచుకో అనే విధంగా ఉందన్నారు. 175 నియోజకవర్గాలు ఉంటే …. 150 నియోజకవర్గాల్లో ఎదేచ్చగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు దోచుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టు చరిత్రాత్మక కొండలను కాపాడుకోవాలని చెప్పినప్పటికీ , అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు.

*ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నందిగామ గాంధీ సెంటర్ అన్నా క్యాంటీన్‌ను టీడీపీ ఏర్పాటు చేసింది. అన్నా క్యాంటీన్ ఏర్పాటుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ అధికారులు, పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సౌమ్య, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రేపటి నుంచి అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రయివేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. అన్నా క్యాంటీన్‌పై కూడా వైసీపీ నీచ రాజకీయాలు చే‌స్తుందని సౌమ్య మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్నా క్యాంటీన్‌ను ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ స్వచ్చందంగా ఏర్పాటు చేస్తే పార్టీకి పేరు వస్తుందనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడి అన్నం పెట్టలేని వైసీపీ పోలీసులను పంపించి ఆపాలని చూస్తుందన్నారు. ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్‌లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య భోజనం చేశారు.

* ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో అన్న క్యాంటీన్ప్రా రంభమైంది. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి క్యాంటిన్‌ను ప్రారంభించారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను తీసివేసి పేద వాళ్ళ పొట్ట కొట్టిందని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభిస్తామన్నారు. టీడీపీ పెడుతున్న అన్న క్యాంటీన్‌లను ఆపే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. అన్న క్యాంటీన్ స్థలంలో భారీగా ప్రభుత్వ మద్యం సీసాలు ఉన్నాయని, అన్నం పెట్టె స్థలాలను మద్యం తాగే వారికి కేరఫ్ అడ్రస్‌లుగా మార్చడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో కల్తీ మద్యం తాగి చనిపోవడంపై ప్రభుత్వం సిగ్గు పడాలని దేవినేని ఉమా అన్నారు. అన్న క్యాంటిన్ ప్రారంభానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

* రేపల్లె మండలం పోటు మెరకలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ పేర్కొన్నారు. రెండు బ్రాండ్‌ల మద్యం తాగిన వారే చనిపోయారన్నారు. పలువురు అస్వస్థతకు గురయ్యారన్నారు. శాంపిల్స్ ల్యాబ్‌లకు పంపించామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత ఓ నిర్ధారణకు వస్తామన్నారు. చనిపోయింది మద్యం వల్లా, ఫుడ్ పాయిజన్ వల్లా అనేది తేలాల్సి ఉందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు.

* భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ఉంది. 70.90 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. వరద ప్రవాహం 24,24,000 క్యూసెక్కులకు చేరుకుంది. 71.30 అడుగుల నుంచి 70.90 నీటిమట్టం అడుగులకు తగ్గింది. ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం జలదిగ్బంధంలో ఉండిపోయింది.

*ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రుతుపవనద్రో ణి కూడా ఉత్తర ఒడిశా మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీపై ఒక మోస్తరుగా ఉంటుందని వాతావర ణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం కోస్తా, రాయలసీమ ల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, సీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

*నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు తీపి కబురు… ఈసారి పరీక్షా సమయాన్ని పెంచారు. ఏటా నీట్‌ ఎగ్జామ్‌ 3గంటలపాటు ఉంటుంది. అయితే ఈసారి పరీక్షా సమయాన్ని 3 గంటల 20 నిమిషాలకు పెంచా రు. పరీక్షాసమయాన్ని పెంచడం అనేది గేమ్‌ ఛేం జర్‌గా వైద్యవిద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే గతేడాది నుంచి 180 ప్రశ్నలకు బ దులు 200 ప్రశ్నలు ఇస్తున్నారు. వాటిలో 180 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అయితే సమ యం 3 గంటలే ఉండేది. అంటే విద్యార్ధులు ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషంలోనే ఆన్సర్‌ గుర్తించాల్సి ఉం డేది. కానీ ఫిజిక్స్‌ ప్రశ్నలను నిమిషంలోనే అన్సర్‌ చేసే అవకాశం ఉండదని నిపుణులంటున్నారు. అయితే బయాలజీ, కెమిస్ట్రీలో తక్కువ సమయం లో జవాబులు పెట్టవచ్చంటున్నారు. విద్యార్ధులు ముందుగా బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలకు ఆన్సర్లు గుర్తించి… ఆ తర్వాత ఫిజిక్స్‌ పేపర్‌కు జవాబులు ఇస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా …. ఆదివారం జరగనున్న నీట్‌ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తం గా మొత్తం 546 పట్టణాల్లో నీట్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.

* దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల వైద్యాధికారులు వారి వారి స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శుక్రవారం ఈ మేరకు జిల్లా వైద్యాధికారులకు మార్గదర్శకాలను పంపారు. క్షేత్ర స్థాయి సిబ్బందికి మంకీ పాక్స్‌పై అవగాహన కల్పించాలని, ఆస్పత్రుల్లోని వైద్యులంతా వైర్‌సకు సంబంధించిన సాధారణ లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని నిర్దేశించారు. అనుమానితులకు పరీక్షలు చేయాలని.. ఎవరికైనా వైరస్‌ నిర్ధారణ అయితే సర్వైలెన్స్‌ బృందాలను రంగంలోకి దించి కాంటాక్టులను తక్షణమే ట్రేసింగ్‌ చేయాలని పేర్కొన్నారు. చికిత్స, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌లో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (ఐపీసీ) ప్రొటోకాల్‌ పాటించాలని సూచించారు. అనుమానితులందరికీ స్ర్కీనింగ్‌, పరీక్షలు చేయాలని.. వారి నమూనాలు సేకరించాలని, కమ్యూనిటీతో పాటు ఆస్పత్రుల్లోనూ సర్వైలెన్స్‌ కొనసాగించాలని ఆదేశాలిచ్చారు.

* రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో నూతనంగా నిర్మించే భరోసా కేంద్రాల భవనాలకు భూమి పూజ కార్యక్రమాన్ని మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళలు, బాలికలను ఆదుకోవడానికి రాష్ట్రంలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 2016లో ప్రారంభించిన ఈ కేంద్రాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకుగాను వీటి నిర్వహణలో ప్రజా భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఐదు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలకు మేఘా ఇంజనీరింగ్‌ సీఎ్‌సఆర్‌ కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని డీజీపీ చెప్పారు. జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న సఖి కేంద్రాలతో భరోసా కేంద్రాలు సమన్వయంతో పనిచేేస్త మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.

*భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటి రికార్డుస్థాయిలో ప్రవహిస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా వారధిపై రాకపోకలను నియంత్రించింది. దీంతో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం రామాలయంపై వరద ప్రభావం స్పష్టంగా పడింది. శుక్రవార భద్రాద్రి రామయ్యకు నిర్వ హించిన నిత్యకల్యాణంలో కేవలం ఒక్కరు మాత్రమే పాల్గొనడంతో అంతరాలయంలోనే స్వామి వారికి కల్యాణం నిర్వహించారు. కాగా రామాలయాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య సైతం వందలోపే ఉంది. 13న రూ.78 వేలు, 14న రూ.55 వేల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో భద్రాద్రి రామాలయానికి భారీగా భక్తుల రాక ఉంటుండటంతో ఆదాయం సమకూరుతోంది. సుమారుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు సాధారణ రోజుల్లో వస్తున్న క్రమంలో మూడు రోజులుగా రోజుకు రూ.80 వేలలోపే ఉండటం గమనార్హం. వరద వల్ల భద్రాచలంలో పలు హోటళ్లను స్వచ్చందంగా నిర్వాహకులు మూసివేశారు. పని చేసేందుకు సిబ్బంది రాకపోవడం, కూరగా యలు లభించకపోవడంతో సమస్య తలెత్తుతోందని హోటల్‌ వ్యాపారి కల్కి పుల్లారావు ఆంధ్రజ్యోతితో పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం పడమర మెట్ల వైపు భారీగా డ్రెయిన్‌, బ్యాక్‌ వాటర్‌ రావడంతో సుమారు 50 దుకాణాలు నీట మునిగాయి. అలాగే ఇతర దుకాణ దారులు సైతం మరింతగా వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.

*పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబానికి షాక్ తగిలింది. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడలు ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానిచ్చేలా చూడాలని, ఆమెకు రక్షణ కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలిచ్చింది. ప్రజ్ఞారెడ్డిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, భర్త ఏక్‌నాథ్‌రెడ్డి, అత్తమామలపై ఆరోపణలున్నాయి. కోడలిపై కోపంతో ఆమె గది తలుపు దగ్గర రాత్రికిరాత్రి అత్తామామలు గోడకట్టారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ప్రజ్ఞారెడ్డి కోర్టును ఆశ్రయించారు.

*ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్‌ డోస్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం ఆయన సీఎ్‌సలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా, జల్‌ జీవన్‌ మిషన్‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, త్వరలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ అందించాలని, రైల్వే స్టేషన్లు, బసఖ్‌ స్టేషన్లు తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు అందించాలని సూచించారు. సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ.. జల్‌జీవన్‌ మిషన్‌కు సంబంధించి రూ.వెయ్యి కోట్లకు డీపీఆర్‌లు సిద్ధం చేసి అవసరమైన అన్ని అనుమతులూ ఇచ్చామని, ఈ నెలలో ఆ నిధులు కూడా విడుదల చేస్తామని కేబినెట్‌ కార్యదర్శికి వివరించారు. కాగా, రాష్ట్రంలో 3.44 కోట్ల మందికి బూస్టర్‌ డోసు (ప్రికాషనరీ డోస్‌) వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి 18 నుంచి 59 ఏళ్ల లోపు వారందరికీ బూస్టర్‌ డోసు అందిస్తామని తెలిపారు.

*దేవదాయశాఖ గ్రేడ్‌-3 ఎగ్జిక్యూటివ్‌ అధికారుల పోస్టుల భర్తీకోసం నిర్వహిస్తున్న స్ర్కీనింగ్‌ పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది. ఠీఠీఠీ.ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 24న ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుందని పేర్కొంది. కాగా ఈ పరీక్షకు మొత్తం 1,07,482 మంది దరఖాస్తు చేసుకున్నారు.

*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌.. ఇలా అన్నింటిలోనూ రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. స్వామి మాలలో ఉన్న మంత్రి తాను ఏమీ ఎరుగనట్లుగా పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. శుక్రవారమిక్కడ టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి పెద్దిరెడ్డి మైనింగ్‌ యజమానుల దగ్గర కమీషన్లు దండుకుంటున్నారు. ఎవరైనా కమీషన్లు ఇవ్వకపోతే మైనింగ్‌లో వాటాలు రాయించుకుంటున్నారు. ఇవి రెండూ కుదరకపోతే రూ.వందల కోట్లు జరిమానాలు విధిస్తున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకు చెందిన మైనింగ్‌ కంపెనీకి రూ.1,000 కోట్లకు పైగా జరిమానా విధించి.. బెదిరింపులతో వైసీపీలో చేర్చుకున్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీకి చెందిన మనోహర మైన్స్‌కు కూడా జరిమానాలు విధించి దాని యజమానిని వైసీపీలో చేర్చుకున్నారు. తెలంగాణకు చెందినవారికి ఏపీలో మైన్స్‌ ఉన్నాయి. వారు గత ఎన్నికల్లో వైసీపీకి ఆర్థిక సాయం చేశారు. చివరకు వారి దగ్గర కూడా కమీషన్లు దండుకుంటున్నారు. పెద్దిరెడ్డి కనుసన్నల్లో చిత్తూరు జిల్లా నుంచి ప్రతిరోజూ 300 టిప్పర్ల ఇసుక బెంగళూరు, చెన్నైకి తరలిపోతోంది. ఈ అక్రమాలను మీడియా సమక్షంలో నిరూపించేందుకు మేం సిద్ధం. జగన్‌ మీడియా, టీవీ9, ఎన్టీవీ ఎవరైనా రావచ్చు’ అని సవాల్‌ విసిరారు.

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (ఏపీ, తెలంగాణ) చిట్ట చివరి స్టేట్‌ వైడ్‌ బెస్ట్‌ ఔట్‌గోయింగ్‌ ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌గా డాక్టర్‌ పూనాటి హరిశంకర్‌ రికార్డు సృష్టించారు. ఉస్మానియా రీజనల్‌ పరిధిలో ఫైనల్‌ ఎంబీబీఎ్‌సలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు కంబైన్డ్‌ స్టేట్‌లో బెస్ట్‌ ఔట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌గా నిలిచారు. తద్వారా డాక్టర్‌ కేఎన్‌ రావ్‌ గోల్డ్‌మెడల్‌ను కైవసం చేసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యామ్‌ప్రసాద్‌ నుంచి బంగారు పతకం అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నార్కేట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సలో హరిశంకర్‌ 2013వ బ్యాచ్‌ విద్యార్థి. కామినేనిలో మెడిసిన్‌లో చేరిన మరుసటి ఏడాది ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థిగా శుక్రవారం ఏపీలో జరిగిన ఎన్టీఆర్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో హరిశంకర్‌ ఉత్తమ వైద్య విద్యార్థి తో పాటు మొత్తం ఆరు బంగారు పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

*‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యా పథకానికి ఆ పేరు కొనసాగించాలి. ఆయన పేరు తొలగించి జగనన్న పేరు పెట్టడం కుల దురహంకార చర్య’’ అని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ఒక ప్రకటనలో విమర్శించారు.

*టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు అమలు చేయడం హర్షణీయమని కనిగిరి టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సభ్యత నమోదు చేసుకున్న కార్యకర్తలకు పార్టీ అండ గా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పంచాయతీ పరిధిలోని పద్మాపురానికి చెందిన ముత్తుముల రవి ఇటీవల నీటికుంటలో జారిపడి మృతి చెందాడు. పార్టీ కార్యకర్త మృతి విషయా న్ని ఉగ్రనరసింహారెడ్డి శుక్రవారం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా కింద రూ.2 లక్షల చెక్కును అందజేసి, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా టీడీపీ సభ్యత్వ నమోదులో మొదట కనిగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మొదటి స్థానంలో, లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి రెండో స్థానంలో, కనిగిరి మూడో స్థానంలో ఉన్నాయి.

* శ్రీనివాస సేతు నిర్మాణ పనుల నేపథ్యంలో శుక్రవారం నుంచి తిరుపతిలో అమలు కావాల్సిన ట్రాఫిక్‌ మళ్లింపులు వాయిదా పడ్డాయని ట్రాఫిక్‌ డీఎస్పీ కాటమరాజు చెప్పారు. వారధి నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్‌ ట్రాఫిక్‌ మళ్లింపులకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తిచేయలేక పోవడంతో మళ్లింపులు చేపట్టలేదన్నారు. సోమవారం నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. బస్టాండు సమీపంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీదుగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని ప్రజలను, వాహనదారులను కోరారు.
*మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు నిరసనగా శుక్రవారం ఉదయం మహిళా సంఘాలు 2కే వాక్ నిర్వహించారు. 2కే వాక్‌లో న్యాయవాదులు, మహిళా సంఘాలు, అన్ని పార్టీల నుంచి మహిళ ప్రతినిధులు పాల్గొన్నారు. టు కే వాక్కులో మహిళా విద్యార్థుల బ్యాండ్ ఆకర్షణగా నిలిచారు. సేవ్ ఉమెన్ అంటూ నినాదాలతో టూకే వాక్ నిర్వహించారు.

* వరద సహాయక పనులలో కాంగ్రెస్శ్రే ణులు చురుగ్గా పాల్గొనాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. బాధితులకు నిరంతరం అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందన్నారు. ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని భట్టి పేర్కొన్నారు. ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా సేవలో సైనికుల్లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలని భట్టి పేర్కొన్నారు.

*ఉస్మాన్ సాగర్‌కు వరద పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా మూసిలోకి 408 క్యూసెక్కుల నీరు వెళుతోంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786 అడుగులకు చేరుకుంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులకు చేరుకుంది. హిమాయత్ సాగర్‌కు వరద నీరు తగ్గుతోంది. హిమాయత్ సాగర్కు 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 170క్యూసెక్కుల నీరు మూసిలోకి వెళుతోంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరుకుంది.

*ఎగువన పడుతున్న వర్షాలు.. వాగులు, ఉపనదుల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం జలదిగ్బంధంలో ఉంది. గోదావరి వరదతో నలుదిక్కులా నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం దగ్గర 69.90 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం రాత్రి 11 గంటలకు భద్రాచలం వద్ద 64 అడుగులకు చేరుకున్న గోదావరి ప్రవాహం శుక్రవారం సాయంత్రానికి 69.90 అడుగులకు చేరింది. ఈ నెల 10న భద్రాచలం వద్ద క్రమంగా పెరిగిన గోదావరి ప్రవాహం 11న తుది ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53.9 అడుగులకు చేరుకుంది. అనంతరం కొన్ని గంటల పాటు నిలకడగా ఉండి తగ్గుముఖం పట్టింది. 12వ తేదీ ఉదయం 51.7అడుగులకు తగ్గి.. క్రమంగా మళ్లీ పెరిగి ఉదయం 6 గంటలకు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53అడుగులను దాటి 58.5 అడుగులకు వచ్చింది. 15 వ తేది సాయంత్రం అందిన సమాచారం వరకు భద్రాచలం దగ్గర 69.90 అడుగుల మేర గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది.

*75 ఏళ్ల స్వాతంత్ర్య సంస్మరణ సందర్భంగా నిర్వహిస్తోన్న స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాల‌లో భాగంగా హైదరాబాద్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI), ద‌క్షిణాధి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం శుక్రవారం వారోత్సవ వేడుక‌లు ప్రారంభించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ 2022 జూలై 11 నుండి 17 వరకు మహా వారోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా GSI అదనపు డైరెక్టర్ జనరల్ జనార్ధన్ ప్రసాద్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర యోధుల త్యాగాలు, పోరాటం కారణంగానే నేడు మ‌నం స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు.ఈ సందర్భంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాజిల్లాలవారీగా రూపొందించిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్ (DRM)లను ఆయన విడుదల చేశారు.

*భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపధ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్(Kcr) ఆదేశాలతో ముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్ధానిక, మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్ధాయిలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే చర్యల్లో భాగస్వాములవుతున్నారు. ఈ నేపధ్యంలో ఊహించని వరదలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందిని, రిస్క్యూటీంలతో పాటు హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు.

*ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ నిర్వాకం బహిర్గతమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా ఎస్ఐ చంద్రశేఖర్ దేశందాటి వెళ్లిపోయారు. దర్శికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులతో బ్యాంకాక్‌ వెళ్లారు. ఎస్ఐ బ్యాంకాక్ వ్యవహారంపై ఎస్పీ మలిక గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఎస్ఐ బ్యాంకాక్ వెళ్లడంపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్‌ బ్యాంకాక్ పర్యటనపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు.

*ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యూనివర్శిటీ 25వ స్నాతకోత్సవాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ యూనివర్శిటీ‌లో చదివిన అనేకమంది ప్రపంచవ్యాప్తంగా మంచి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. యూనివర్శిటీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు.

*వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదువులు, చెరువులు అన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తపేట నియోజక వర్గం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సైతం వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఆయనకు ప్రాణాపాయం తృటిలో తప్పింది. వరద ప్రాంతాల్లో పడవలో ప్రయాణిస్తుండగా అది కాస్తా పక్కకి ఒరిగిపోయింది. దీంతో జగ్గిరెడ్డి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయనను రక్షించారు.

*ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం విప్రో కంజ్యూమర్‌ కేర్, లైటింగ్‌ తాజాగా ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. చిరుతిళ్లు, మసాలా దినుసులు, రెడీ టు ఈట్‌ విభాగంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నది సంస్థ లక్ష్యం. కాగా, సంతూర్, యార్డ్‌లీ, చంద్రిక, గ్లూకోవిట, సేఫ్‌వాష్‌ వంటి బ్రాండ్లను సంస్థ ప్రమోట్‌ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తన ఉత్పత్తులను ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య మార్కెట్లలో విక్రయిస్తోంది. 2021–22లో విప్రో కంజ్యూమర్‌ కేర్‌ రూ.8,634 కోట్ల టర్నోవర్‌ సాధిచింది.

*రైతులకు లక్ష రూపాయల వ్యవసాయ రుణం మాఫీ కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 16నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు సంతకాల ేసకరణ ఉద్యమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే లక్ష రూపాయల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానన్న కేసీఆర్‌ ఆ మాటే మరిచారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ లో అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

*భారీ వర్షాలకు పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, మిషన్‌ భగీరథ పైపు లైన్లు లీకేజీలు కావడం, పంపింగ్‌ స్టేషన్లలో మురికినీరు చేరడం, తదితర సమస్యల కారణంగా గ్రామాలకు నీటి సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 2,222 గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. అదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జిల్లాల్లోని 2,222 గ్రామాల్లో మిషన్‌ భగిరథ మంచినీటి సరఫరా నిలిచిపోయింది.

*తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీనే కోరుకుంటున్నారని, సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపర్చాలని నిర్ణయించుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ విడుదల చేసిన సర్వే ఫలితాల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి 53 మంది బలమైన అభ్యర్థులు ఉ న్నారని చెబుతూనే.. బీజేపీకి 30 శాతం ఓట్లు వచ్చి కాంగ్రె్‌సకు 23 శాతం ఓట్లు వస్తాయని పేర్కొనడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఆ సర్వే నివేదిక లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. ఢిల్లీలో గురువారం ఆ యన మీడియాతో మాట్లాడారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ తర్వాత కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 3 శాతం పెరిగిందని పేర్కొన్నారు. మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌ స భను, రాహుల్‌ గాంధీ వరంగల్‌ సభను పోల్చి చూస్తే తెలంగాణలో ఎవరికి పట్టు ఉందో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. తాను ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడే రేవంత్‌ కూడా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనడాన్ని ఆయన తప్పుబట్టారు.

* బ్రిటీష్‌ పాలనలో ఎదురైన కొన్ని సమస్యలను ఏవిధంగా అధిగమించారో వివరిస్తూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రచించిన ‘మహా సంగ్రామర్‌ మహానాయక్‌’ అనే ఒడియా నాటకాన్ని ఈనెల 17న సాయంత్రం 6గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ప్రదర్శించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శా ఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ గురువారం మీడియా తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నాటకాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నాటక ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.

*ఏపీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్‌లో రాయితీకి డిజిటల్‌ ఆధార్‌ కార్డును అనుమతించాలని యాజమాన్యం నిర్ణయించింది. టికెట్ల రిజర్వేషన్‌ సందర్భంగా ఎవరైనా డిజిటల్‌ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు ఏదిచ్చినా 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో 60ఏళ్లు దాటిన వారికి 25శాతం రాయితీ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అయితే కరోనా కారణంగా 2020 మే 21నుంచి ఆపేసిన ఆర్టీసీ ఇటీవలే పునరుద్ధరించింది.

*వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 3వేలమంది కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈనెల 16న మండపేటలో పవన్‌కల్యాణ్‌ నిర్వహించే రైతు భరోసా సభలో అన్ని వివరాలూ బయటపెడతామని జనసేన రాష్ట్ర పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గురువారం కాకినాడ ముత్తాక్లబ్‌లో విలేకరుల సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. రైతులపట్ల ప్రత్యేకంగా కౌలు రైతుల విషయంలో సీఎం వైఖరి కేవలం రాజకీయపరంగా దురుద్దేశంతోనే పవన్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారన్నారు. రైతు స్వరాజ్య వేదిక, జిల్లాల ఎస్పీలు, ఆర్‌టీఐ, ఎఫ్‌ఐఆర్‌, పోస్ట్‌మార్టమ్‌, కుటుంబ సభ్యుల ద్వారా పక్కా సమాచారంతో సేకరించిన ఆత్మహత్యల వివరాలు తగిన ఆధారాలతో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

*ఏపీఎ్‌సఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్‌లో రాయితీకి డిజిటల్‌ ఆధార్‌ కార్డును అనుమతించాలని యాజమాన్యం నిర్ణయించింది. టికెట్ల రిజర్వేషన్‌ సందర్భంగా ఎవరైనా డిజిటల్‌ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు ఏదిచ్చినా 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో 60ఏళ్లు దాటిన వారికి 25శాతం రాయితీ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అయితే కరోనా కారణంగా 2020 మే 21నుంచి ఆపేసిన ఆర్టీసీ ఇటీవలే పునరుద్ధరించింది.

*సరోగసీ (అద్దె గర్భం) ద్వారా తల్లి అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రసూతి సెలవులకు అర్హురాలేనని హైకోర్టు స్పష్టం చేసింది. శిశువు ఆలన పాలన చూసుకొనేందుకు ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆమెకు సెలవులు మంజూరు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా డీఈవో, పెద్దనందిపాడు ఎమ్‌ఈవోకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు జిల్లా, పెద్దనందిపాడు మండలం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా (స్కూల్‌ అసిస్టెంట్‌) చేస్తున్న పి.సౌదామణి సరోగసీ (అద్దెగర్భం) ద్వారా తల్లి అయ్యారు. శిశువు ఆలన పాలన చూసుకొనేందుకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ఆమె డీఈవోను కోరారు. ఆ అభ్యర్థనను డీఈవో నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

*‘చేపల చెరువులు తవ్వేందుకు ముందుగా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేయడం చట్టవిరుద్ధం. చట్ట నిబంధనల గురించి అవగాహన లేదనే కారణంతో చేసిన తప్పును క్షమించలేం’’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్ట నిబంధనల ప్రకారం అనుమతులు పొందని వారి చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. వారిపై చట్ట నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

*ఎంతసేపూ దోచుకుందాం, దాచుకుందాం అనే ధోరణితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌రెడ్డి పేద ప్రజల ఆకలి బాధలు పట్టించుకోకుండా అక్రమ సంపాదనపైనే దృష్టి సారించారని రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ ఆరోపించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేదలు నానా తిప్పలు పడ్డారని, నేటికీ ఆ కష్టాల నుంచి గట్టెక్కలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. పేద ప్రజల ఆకలి బాధలు తీర్చాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందించేందుకు సరఫరా చేస్తోందన్నారు. ఆ మేరకు కేంద్రం ద్వారా అందిన బియ్యాన్ని నాలుగు నెలలుగా పేదలకు ఇవ్వకుండా వైసీపీ సర్కార్‌ పాలన సాగించడం దారుణమన్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కడప కలెక్టరేట్‌ వద్ద జరిగిన బీజేపీ నిరసన కార్యక్రమంలో సీఎం రమేశ్‌ మాట్లాడారు. అసలు పేదలంటే జగన్‌ సర్కార్‌కు లెక్కలేకుండా పోయిందన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరడంతో పాటు శాంతి భద్రతలు అదుపుతప్పాయన్నారు.

*డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ జీవైవీ విక్టర్‌ను బుధవారం అర్ధరాత్రి సస్పెండ్‌ చేశారు. సరైన అర్హతలు లేకుండా, తప్పుడు పత్రాలు సమర్పించి గతేడాది మార్చిలో ఆయన డీసీఐ నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం అనేక అడ్డదారులు తొక్కారు. చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ విచారణ చేపట్టి నివేదిక సమర్పించడంతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ డీసీఐకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విశాఖపట్నం పోర్టు చైర్మన్‌ కె.రామమోహన్‌రావు బుధవారం రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని వెంటనే ముంబైలోని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ, కోల్‌కతాలోని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు. కాగా.. వారంక్రితమే డీసీఐ సెక్రటరీ కె.అశ్వనీ శ్రీకాంత్‌ను సస్పెండ్‌ చేశారు. ఎండీ పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ జరిగినప్పుడు ఈయనే కీలకంగా వ్యవహరించారు.

*ఆరోగ్యశాఖలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నువ్వా – నేనా అంటూ ఇటు అధికారులు, ప్రభుత్వ పెద్దల మధ్య మధ్య తీవ్రస్థాయిలో అంతర్గత యుద్ధం మొదలైంది. ముఖ్యంగా పోస్టింగ్‌ల విషయంలో తాము చెప్పిందే ఫైనల్‌ అంటూ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీరు చెప్పినా మేము చేయాల్సిన అవసరం లేదని అధికారులు అడ్డం తిరుగుతున్నారు. ఒక అప్రాధాన్యమైన పోస్టు కోసం గత రెండు నెలలుగా ఆరోగ్యశాఖలో ఈ విధమైన కల్లోలం నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో స్టేట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (ఎస్‌పీఎం) అనే పోస్టు ఉంది. ఈ పోస్టులో ఎవరూ పని చేసినా పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు. ఏ రాష్ట్రానికైనా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌కు ఎండీ ఉంటారు. ఆరోగ్యశాఖ కమిషనర్‌ లేదా డైరెక్టర్‌ ఎన్‌హెచ్‌ఎంకు ఎండీగా ఆదనపు విధులు నిర్వహిస్తారు. ఎన్‌హెచ్‌ఎం ఎండీని కాదని ఎస్‌పీఎం ఏమీ చేయడానికి లేదు. చిన్న ఫైల్‌ కూడా పెట్టే అవకాశం లేదు.

*రాష్ట్రంలో మండలానికో బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటుపై పాఠశాల విద్యాశాఖ అత్యుత్సాహానికి బ్రేక్‌ పడింది. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా 25 జూనియర్‌ కాలేజీలను బాలికల కళాశాలలుగా మార్చేస్తూ జూన్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంటర్‌ విద్య కోసం బాలురు చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల ఉర్దూ కాలేజీలను కూడా బాలికల కళాశాలలుగా మార్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొన్నిచోట్ల సవరణలు చేశారు. ఆ జీవోనే నిలుపుదల చేశారు.

*ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 11 నుంచి 17 వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగుర వేయాలనే లక్ష్యంతో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం అమలుపై గురువారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ, శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

* పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఆప్షన్‌-3లో నిర్మిస్తున్న ఇళ్లను సత్వరమే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల హౌసింగ్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హౌసింగ్‌ బోర్డు ఎండీ నారాయణ భరత్‌గుప్తా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని లే-అవుట్లలో ఏవైనా సమస్యలు ఎదురైతే మున్సిపల్‌ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

*తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్‌ అయ్యారు. కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, కాస్త అలసట, జ్వరంతో బాధపడుతున్నట్లు బులిటెన్‌లో తెలిపాయి ఆస్పత్రి వర్గాలు.69 ఏళ్ల వయసున్న ఎంకే స్టాలిన్‌.. కొవిడ్‌-19 నిర్ధారణ కావడంతో మంగళవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ఆయన సైతం ప్రకటించారు.తమిళనాడు గత కొంతరోజులుగా.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌, సబ్‌ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. అయితే ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే నమోదు అవుతున్నాయని, త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించింది.

*దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఓ ఏడేళ్ల బాలిక.. జికా వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు

*అన్‌పార్లమెంటరీ పదాలంటూ కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన జాబితాలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా తెలిపారు. ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారని, పేపర్లను వృథా చేయొద్దన్న ఉద్దేశంతో తాము దానిని ఇంటర్నెట్‌లో పెట్టామన్నారు. తామైతే ఏ పదాలను నిషేధించలేదని, తొలగించిన పదాల సంకలనాన్ని తాము విడుదల చేస్తామని ఓం బిర్లా తెలిపారు.

*సరోగసీ ద్వారా బిడ్డను తీసుకున్న తల్లికి మెటర్నరీ సెలవు మంజూరు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పెదనందిపాడు మండలం ఉప్పలపాడు హైస్కూల్‌‎లో పని చేసే టీచర్‌ కు మెటర్నరీ లీవ్‌ ఇవ్వకపోవడంపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఆ తరువాత ఆ బిడ్డకు అండం ఇచ్చిన తల్లికీ మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు సూచించింది. అలాగే బిడ్డను పెంచేందుకు తల్లికి మూడు నెలల పాటు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాలని ఆదేశించింది. మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 2017కు తెచ్చిన సవరణల ద్వారా మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

* ఏమాత్రం తగ్గడం లేదు. గోదావరికి వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. గంటగంటరే గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16.27 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, ఎండి అంబేద్కర్ పర్యవేక్షిస్తున్నారు. 6ఎన్డీఆర్‌ఎఫ్‌, 4ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద సహాయక చర్యల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

*పెట్రోలు, డీజిల్‌ ధరల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. మొన్నటివరకు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండేది. స్వల్ప తేడాతో ఆ తర్వాతి స్థానంలో మన రాష్ట్రం ఉండేది. మహారాష్ట్ర కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్‌నాథ్‌ షిండే.. గురువారం నాటి కేబినెట్‌ భేటీలో లీటరు పెట్రోలుపై వ్యాట్‌ను రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ.111.35నుంచి రూ.106.35కు తగ్గింది. డీజిల్‌ ధర రూ.97.28 నుంచి రూ.94.28కి తగ్గింది. దరిమిలా మన రాష్ట్రం పెట్రో ధరలు అధికంగా ఉన్న నంబర్‌ వన్‌ రాష్ట్రమైంది.

*గోదావరి ఉగ్రరూపంతో ఏపీలో విలీనమైన పోలవరం ముంపు మండలాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పూర్తి జల దిగ్బంధంతో ఎటునుంచి వరద వచ్చిపడుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కుక్కునూరు-భద్రాచలం మధ్య రహదారి 12 చోట్ల మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుక్కునూరు-అశ్వారావుపేట రహదారి గురువారం రాత్రి నీట మునగడంతో తెలంగాణ వైపు సంబంఽధాలు తెగిపోయాయి. కుక్కునూరు గ్రామానికి మూడు వైపులా నీరు వచ్చి చేరుతుండటంతో దిగ్బంధంలో ఉంది. ఈ మండలంలో 20 గ్రామాలను వరద ముంచెత్తింది. 30 గ్రామాలకు ఒకదానితో మరోదానికి సంబంధాలు తెగిపోయాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రం సహా 30 గ్రామాలను వరద చుట్టుముట్టింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగుల మేరకు చేరుకుంటే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి కానున్నాయని భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండుచోట్ల నుంచి 6వేల మందిని గురువారం రాత్రి పొద్దుపోయాక సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కూనవరం మండలంలో వరద బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఎటపాక మండలంలోని పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. ఎటపాక పోలీస్‌ స్టేషన్‌ను నీరు ముంచెత్తింది. విలీన మండలాలకు కూడా ఒకదాని నుంచి మరోదానిని నడుమ రాకపోకలు నిలిచిపోయాయి.

*దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌, వెయ్యి జూనియర్‌ లైన్‌ మెన్‌ పోస్టుల భర్తీకి మే 9 న నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూలై 17న గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం 12.30 గంటల వరకు జూనియర్‌ లైన్‌మెన్‌లకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ www.tssouthernpower.cgg.gov.in నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ తెలిపింది.

*బ్రిటీష్‌ పాలనలో ఎదురైన కొన్ని సమస్యలను ఏవిధంగా అధిగమించారో వివరిస్తూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రచించిన ‘మహా సంగ్రామర్‌ మహానాయక్‌’ అనే ఒడియా నాటకాన్ని ఈనెల 17న సాయంత్రం 6గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ప్రదర్శించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శా ఖ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ భార్గవ గురువారం మీడియా తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నాటకాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నాటక ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.

*డిజిటలైజేషన్‌ ఆధారంగానే పాలనా వ్యవహారాలు సాగుతున్న నేపథ్యంలో మ్యాన్యువల్‌ టైప్‌రైటర్‌కు ప్రత్యామ్నాయంగా ఇక నుంచి కంప్యూటర్లపై తెలుగు టైప్‌రైటింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది ఈ మేరకు స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎస్‌బీటీఈటీ) ప్రతిపాదనలు సమర్పించింది.

*హిందూ దేవతలపై అజ్మేర్‌ దర్గాలో మరో మ త ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్‌, హనుమాన్‌ కూడా దేవుళ్లా?’’ అని అజ్మేర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గా అంజుమన్‌ కమిటీ కార్యదర్శి సయ్యద్‌ సర్వర్‌ చిస్తీ కుమారుడు అదిల్‌ చిస్తీ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియో జూన్‌ 23న సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆదిల్‌పై కఠినచర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్‌ చేశాయి. అయితే, హిందూ సోదరసోదరీమణుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తాను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మకు మాత్రమే ప్రశ్నలు వేశానని అదిల్‌ చిస్తీ మరో వీడియో విడుదల చేశారు. తన వీడియోలో కొంత భాగాన్నే చూపారని తెలిపారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించారు. ఇక, జూన్‌ 17న అజ్మేర్‌ దర్గా గేటు వద్ద విద్వేష ప్రసంగం చేసి పరారీలో ఉన్న గౌహర్‌ చిస్తీని రాజస్థాన్‌ పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కాగా, నూపుర్‌ శర్మ తల నరికి తెస్తే బహు మతి ఇస్తానన్న అదే దర్గాకు చెందిన సయ్యద్‌ సల్మాన్‌ చిస్తీ జైల్లో ఉన్నాడు.

**పాకిస్థాన్‌లో 16 ఏళ్ల హిందూ యువతిని కిడ్నా్‌పకు గురయింది. అనంతరం ఆ యువతిని బలవంతంగా ముస్లిం యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. డాన్‌ పత్రిక కథనం మేరకు… వారం క్రితం సింద్‌ రాష్ట్రంలోని ఖాజీ అహ్మద్‌ నగరంలో ఓ హిందూ యువతి కిడ్నా్‌పకు గురయింది. ఆ తరువాత ఆమెను ఇస్లాంలోకి మార్చారు. మత మార్పిడి తంతును పూర్తి చేసిన తరువాత బలవంతంగా ఆ యువతిని ఓ ముస్లింకు ఇచ్చి వివాహం చేశారు. దీనిపై స్థానిక హిందూ వర్గీయులు మాజీ ప్రధాని అసిఫ్‌ అలి జర్దారీ నివాసం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమకు మద్దతుగా నిలవాలని వారు జర్దారీని డిమాండ్‌ చేశారు.