DailyDose

లారీ బీభత్సం.. బస్సు, కారును ఢీకొట్టి.. కాలువలోకి.. – TNI నేర వార్తలు

లారీ బీభత్సం.. బస్సు, కారును ఢీకొట్టి.. కాలువలోకి..  – TNI  నేర వార్తలు

*జగిత్యాల పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు, కారును ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న చిన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా బస్సులో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*మచిలీపట్నం సమీపంలో ఉన్న గూడూరు మండలం లో ఘోర రోడ్డప్రమాదం..హై వే రోడ్డు పక్కన చేపలు అమ్ముకుంటున్న వారి పై,AP16DN3093 నంబర్ గల కారు దూసుకెళ్లింది.మహిళను,వృద్ధుడిని ఢీ కొనటం తో అక్కడికి అక్కడే మృతి చెందారు.ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఇంఛార్జి ACP రమేష్ బాబు గారు,SI వెంకటేష్ వారి బృందం తో హుటహుటీన సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.కార్ యొక్క యజమాని గురించి ఆరాతిస్తున్నారు.మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*కృష్ణా: జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం జేమ్స్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు జేమ్స్‌పేటలోని పౌల్‌రాజ్ కెనాల్‌లో పడి బాలిక మృతి చెందింది. మేకల ప్రియవర్షిని(4) అనే బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటూ కెనాల్‌లో పడిపోయింది. పడిన వెంటనే ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కాపాడలేకపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

*ఓ యువతిని ప్రేమించిన యువకుడు పిచ్చి ప్రవర్తనతో అందరినీ హడలెత్తించిన ఘటన శనివారం శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన కాటయ్య, భార్యలక్ష్మి దంపతుల కుమారుడు ధనంజయులు(30) 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండేవాడు. ఈ క్రమంలో మరాఠీపాళేనికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు ఇటీవల ధనంజయులను మందలించినట్లు సమాచారం. పదేపదే తమ బిడ్డను వేధించవద్దంటూ వారం రోజుల క్రితం పంచాయితీ ద్వారా హెచ్చరించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ధనంజయులు పిచ్చిపిచ్చిగా ఇంట్లో వాళ్లలో ప్రవర్తించడం ప్రారంభించాడు. శనివారం బాత్‌ రూమ్‌లోకి వెళ్లి ఎడమ చెయ్యి, గొంతు వద్ద కత్తితో కోసుకుని ఆత్యహత్యాయత్నానికి ప్రయత్నించడంతో గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించే క్రమంలో డాక్టర్‌తో పాటు నర్సులు, సిబ్బందికి సహకరించకుండా యువకుడు వీరంగం చేశాడు. తనను వేరే వ్యక్తి సెవెన్త్‌సెన్స్‌ తరహాలో దృష్టి వశీకరణ చేశారని, ముందుగా తన తల్లిదండ్రులను ఇలాగే వశపరచుకున్నారని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. కాసేపటి తరువాత ఇస్మాట్‌ శంకర్‌ సినిమా తరహాలో తనను వేరే వ్యక్తి హర్ట్‌ చేశాడని చెప్పుకున్నాడు. హర్ట్‌ చేసిన వ్యక్తి ఆదేశిస్తే ఇక్కడ ఉన్నవారిని ఎవరినైనా చంపేస్తాంటూ బెంబేలెత్తించాడు. అయితే కుటుంబసభ్యులు మాత్రం కొద్దిరోజులుగా మానసిక స్థితి తప్పడంతో ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు.

*గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొవిడ్‌-19 బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అమీర్‌పేట్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం ఆమె బూస్టర్‌డోస్‌ తీసుకున్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ కోరారు. వర్షాల వల్ల వచ్చే జ్వరం, ఇతర వ్యాధులకు కూడా బూస్టర్‌ డోస్‌ రక్షణగా ఉంటుందని చెప్పారు

*జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్‌ సుహాస్‌ ప్రీతమ్‌ నేషనల్‌ రికార్డు నెలకొల్పాడు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌ 1 నిమిషం 1 సెకన్‌లో రేసును ముగించి స్వర్ణం సాధించడంతో పాటు జాతీయ రికార్డు సృష్టించాడు. బాలికల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో నిత్య పసిడితో మెరవగా, బాలికల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో వ్రితి అగర్వాల్‌ కాంస్య పతకం సాధించింది. బాలుర టీమ్‌ 4 గీ 400 ఫ్రీస్టయిల్‌ రిలేలో తెలంగాణ జట్టు కాంస్యం దక్కించుకుంది. ఇదే పోటీల్లో విజయవాడ స్విమ్మర్‌ తీర్ధు సామదేవ్‌ బాలుర 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో స్వర్ణం సాధించాడు.

*రాష్ట్రంలో 2030 నాటికి ప్రతి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక కేన్సర్‌ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో కేన్సర్‌ చికిత్సలో నూతన విధానంపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో కేన్సర్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలో చిన్న పిల్లల కేన్సర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఏపీలో 3.21 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ నంబర్లు ఇవ్వగలిగామని చెప్పారు.

* పందెం కోళ్లకు భలే గిరాకీ లభించింది. మార్కెట్‌లో కోడి ధర మామూలుగా రూ.250 – 350 మధ్య ఉంటుంది. పందెం కోడి ధర మాత్రం రూ.30 వేలు పలికింది. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం పందెం కోళ్లకు వేలం పాట నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన రాత్రి పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని ఓ మామిడి తోటలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేసి కొందరిని అరెస్టు చేశారు. 31 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోళ్లను కూడా పోలీసులు కోర్టులో సమర్పించారు. ఆ కోళ్లకు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జిల్లా ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి హన్మంతరావు సమక్షంలో అధికారులు వేలం పాట నిర్వహించారు. 46 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలం పాటలో 31 పందెం కోళ్లను విక్రయించగా రూ.4,46,000 ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ఒక కోడికి రూ.30 వేల ధర పలికింది.

*అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకోగా.. తల్లి బాకీ కింద బ్యాంకువాళ్లు డబ్బు తొక్కిపెట్టడంతో మ రో రైతన్న ప్రాణాలు తీసుకోబోయారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మం డ లం జనగామలో గౌడ సుజాత(36) వ్యవసాయంలో నష్టపోయారు. దీంతో పెట్టుబడికి చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక శనివారం పురుగుల మందు తాగింది. కాగా.. మెదక్‌ జిల్లా చేగుంటలోని ఓ బ్యాంకులో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇబ్రహీంపూర్‌కు చెందిన రైతు నీల రాములు యాసంగి ధాన్యాన్ని అమ్మగా రూ.98 వేలు ఖాతాలో జమ అయ్యాయి. డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లగా తల్లి పెంటమ్మ పేరు మీదున్న రుణం తీర్చేవరకూ ఈ డబ్బు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పూర్తి డబ్బులు ఇప్పుడు కట్టలేనని, రూ.20వేల మిత్తి కడతానని, మిగతా మొత్తానికి కాస్త సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అయినా బ్యాంక్‌ సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రాములు బ్యాంకు ముందే పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఆస్పత్రికి తరలించారు.

* బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కుంచాలవారిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి నిజాంపట్నం కాలువలోకి కారు దూసుకెళ్లింది. బాధితులు పిట్టలవానిపాలెం మండలం అల్కాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకి తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

* శంషాబాద్ తుక్కుగూడలో కాల్పుల కలకలం ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ పైకి గన్ తో కాల్పులు
గురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ లో వెళ్తున్న వ్యక్తి ఐరన్ లోడ్ లారీ దొంగతనం చేయడానికి ప్రయత్నించారా?? దారి దోపిడీ దొంగల పనే లేదా
గతంలో ఏదైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణలారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ వ్యక్తి పరారీ.

* పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు యువతి గొంతు కోసిన ఘటన నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలో వెలుగు చూసింది. బాధితురాలు పది గంటలపాటు గాయాలతో నరకయాతన అనుభవించింది. మోపాల్‌ ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19), మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌ గ్రామానికి చెందిన సంజయ్‌(21) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది రోజులుగా ఆమెపై అనుమానం పెంచుకున్న సంజయ్‌.. తరచూ కొడుతుండటంతో అతన్ని దూరం పెట్టింది. అయితే, ఈ నెల 14న తన పుట్టినరోజు ఉందని.. కనీసం ఈ వేడుకలకైనా రావాలని సంజయ్‌ యువతిని ఒప్పించి బయటకు తీసుకెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై కులాస్‌పూర్‌ మీదుగా చిన్నాపూర్‌ శివారుకు చేరుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో కోపంతో గొంతు నులిమాడు. ఆ యువతి స్పృహ కోల్పోయిన అనంతరం గాజు సీసాతో గొంతు కోసి పరారయ్యాడు.

* శంషాబాద్ తుక్కుగూడలో కాల్పుల కలకలంఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ పైకి గన్ తో కాల్పులుగురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ లో వెళ్తున్న వ్యక్తి ఐరన్ లోడ్ లారీ దొంగతనం చేయడానికి ప్రయత్నించారా?? దారి దోపిడీ దొంగల పనే లేదా
గతంలో ఏదైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ వ్యక్తి పరారీ.