Politics

వరద రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటన – TNI రాజకీయ వార్తలు

వరద రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటన – TNI  రాజకీయ వార్తలు

* టీడీపీ నాయకులకు ప్రతీది రాజకీయం చేయడం అలవాటుగా మారిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. గోదావరి వరద ప్రభావాన్ని కూడా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని ఆరోపించారు . ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.గోదావరికి 36 సంవత్సరాల తరువాత జులై నెలలో వరదలు రావడం ఇదే ప్రథమమని అన్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణ నష్టం జరుగలేదని తెలిపారు. వరద బాధితులను పునరావస కేంద్రాలకు పంపించిన ప్రభుత్వం సహాయ కార్యక్రమాలను అందిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పై మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.

*సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు
కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు. కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్నారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు.తప్పులు చేయటమే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైకాపా కొత్త తప్పులు చేస్తోందని మండిపడ్డారు. కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని నిలదీశారు. విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమేనని విమర్శించారు.కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలు చెయ్యాలన్నారు. కరోనా కారణంగా చిన్నాభిన్నమైన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

*ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటది: మంత్రి Puvvada
రాష్ట్రంలో భారీ వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియా తో చిట్ చాట్‌ గా మాట్లాడుతూ ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటదని అన్నారు. అసలైన పని ఇప్పుడే… మొదలైందన్నారు. నీళ్లు, కరెంట్, దొంగల భయం ఎన్ని సమస్యలు ఉన్నాయోనని అన్నారు. బురద, పాములు, తేళ్లు సమస్యలు ఎక్కువగా ఉంటాయని, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా వరద బాధితులకు రేషన్ బియ్యం, రూ. 10 వేలు ఇస్తానని చెప్పారన్నారు. రూ. 10 వేల పంపకం జీహెచ్ఎంసీ తరహాలో కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉంటామని.. ప్రజలతోనే ఉంటామని… మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

*చంద్రబాబు, పవన్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన జగన్ప్ర
తిపక్ష నేత చంద్రబాబు , జనసేనాని పవన్ కల్యాణ్‌ పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. వరద సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలు, మీడియా అభూత కల్పనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరె నిర్వహించారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రూ.2వేలు అందాలని ఆదేశించారు. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని సూచించారు. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు వెంటనే వరద సహాయం వివరాలు మీడియాకు వెల్లడించాలని జగన్ సూచించారు.
*ప్రతిపక్షంలో Jagan reddy చేసిన ప్రకటనలు ఏమయ్యాయి: గాదె Venkateswararao
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని లావాదేవిలు డిజిటల్‌ కు అవకాశం ఉందని, ప్రభుత్వ వైన్ షాపు లలో మాత్రం కేవలం నగదు చెల్లింపులు జరుగుతున్నాయని, మద్యంపై రాష్ట్రంలో నియంత్రణ లేదని ఆరోపించారు. ప్రతిపక్షంలో జగన్ రెడ్డి చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేపల్లె లో మద్యం తాగి చనిపోయిన వారిని పరామర్శించకుండా అడ్డుకున్నారని, మమ్మల్ని అడ్డుకునే పోలీసులు మద్యం మరణాలను ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ప్రతి వీధిలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వ్యక్తిగతంగా కించపరుస్తున్నారని అన్నారు. విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారని, స్కూల్స్‌కు చాక్ పీస్‌లు, డస్టర్‌లు ఇవ్వలేని దుస్దితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సంక్షేమ పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని గాదె వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు.

*AP రాజధాని Hyderabadగానే YCP నేతలు వ్యవహరిస్తున్నారు: Narayana
ఏపీ రాజధాని హైదరాబాద్గా నే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఏమి చేసిందని వైసీపీ, టీడీపీ లు..రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపారని ప్రశ్నించారు. బ్లాక్ మెయి చేసి పార్టీలను బీజేపీ లొంగదీసుకుంటోందని, తృణమూల్ కాంగ్రెస్ ను తిప్పలు పెట్టిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిని చేస్తున్నారని విమర్శించారు. గంగమ్మను అలంకరించి ఊరి బయట వదిలేస్తారు.. వెంకయ్య పరిస్థితి అదేనని అన్నారు. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వెంకయ్య నోరు నొక్కే పని చేశారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ అని.. ఎక్కడ దేనికి పెలుతుందో తెలియని పరిస్థితి అని అన్నారు. వరద వెనుక విదేశీ కుట్ర అనటం ద్వారా సీఎం కేసీఆర్ కేంద్రం విషయంలో వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోందన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైకి అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను, కాకుండా చిరంజీవిని ఎక్కించటం సరికాదని నారాయణ వ్యాఖ్యానించారు.

*MLA హక్కుల్ని సైతం పోలీసులు కాలరాస్తున్నారు: Anagani Satyaprasad
ఎమ్మెల్యే (MLA) హక్కుల్ని సైతం పోలీసులు కాలరాస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలపై స్పందించాల్సిన బాధ్యత, అందుకు సర్వహక్కులు తన కున్నాయన్నారు. తనను అడ్డుకున్న పోలీసులపై చట్టపరంగా ముందుకెళ్తున్నామని, వారిపై ప్రయివేటు కేసులు వేస్తామన్నారు. వైకాపా నేతలు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ ఓటమి గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలకు.. జగన్ రెడ్డి తల్లి విజయలక్ష్మిని గెలిపించుకోలేకపోయారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కన్న తల్లినే పార్టీ నుంచి తరిమేశారని విమర్శించారు. రేపల్లె మద్యం మరణాల కుటుంబసభ్యులకు రూ.50 లక్షలు ఇచ్చి తీరాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.

* మోటార్లు పని చేయకపోతే ఏం చేస్తున్నారు?: కేసీఆర్‌
‘‘మోటార్లు పని చేయకపోతే ఏం చేస్తున్నారు? సింగరేణి నుంచి తెప్పించుకోవద్దా? ఇంత పెద్ద వరదకు చిన్న మోటార్లు ఎలా పని చేస్తాయి? ఎప్పుడు ఈ వరదను తోడుతాయి?’ అంటూ సీఎం కేసీఆర్‌ భద్రాద్రి జిల్లా అధికారులను ప్రశ్నించారు. ఆదివారం రామాలయం సమీపంలోని గోదావరి కరకట్ట వద్ద ర్యాంపుపై నుంచి నది ఉధృతిని ఆయన పరిశీలించారు. కరకట్ట స్లూయిస్‌ నుంచి లీకేజీ నీటిని మోటార్ల ద్వారా తోడుతున్నామని అధికారులు తెలపగా.. అందుకు ఎన్ని మోటార్లు వినియోగిస్తున్నారని సీఎం అడిగారు. ఐదు మోటార్లకు మూడు పని చేయడంలేదని వారు చెప్పడంతో.. సింగరేణి నుంచి పెద్ద మోటార్లను పెట్టుకోవద్దా? ఉన్న మోటార్లలో మూడు పనిచేయకపోతే ఎలా? అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని తోడే మోటార్లను, ఆలయ సమీపంలో వరదలో మునిగి ఉన్న ఇళ్లను పరిశీలించారు.

*కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలి: రేవంత్‌రెడ్డి
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పడి.. జాతీయ విపత్తును వదిలేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదల్లో మునిగిపోతున్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ గడప దాటారని అన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో లోపం జరిగిందని ఆయన ఆరోపించారు. క్లౌడ్ బరెస్ట్ పేరుతో తన అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ కుట్రపై సమాచారం ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు.

*కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర స్టేట్‌మెంట్‌పై జనం నవ్వుకుంటున్నారు: విజయశాంతి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కమిషన్ల వర్షం కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బాహుబలి మోటార్లు, పంప్ హౌస్‌లు భారీ వర్షాలకు వరదనీటిలో మునిగిపోయాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. లండన్, ఇస్తాంబుల్ ఇంకా ఏవేవో చేస్తానని తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలకి ఆయనిచ్చిన వాగ్దానాల్లోని డొల్లతనాన్ని ఈ వానలు బట్టబయలు చేశాయన్నారు. తాజా పరిణామాలతో కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయినట్టు క్లౌడ్ బరస్డ్ కుట్ర స్టేట్‌మెంట్ ద్వారా అర్థమైందని రాములమ్మ అన్నారు. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల హస్తం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని విజయశాంతి చెప్పారు.

*అంచనా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు: భట్టి
వరదలపై తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టం అంచనా వేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదన్నారు. గూడు కోల్పోయినవారికి ఇల్లు కట్టివ్వాలని సూచించారు. వెంటనే రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. ప్రాజెక్టుల్లో అవకతవకలు, అవినీతిపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.

*పేదలను నిందించడం మోదీ విధానం: అసదుద్దీన్‌
పేదలను నిందించడమే ప్రధాని మోదీ విధానమంటూ మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ పేద ప్రజలకు ‘‘ఉచితాలు’’ మంచిది కాదని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. ధనంతులకు రాయితీలు, మినహాయింపులు కల్పించి పేదలను నిందిస్తున్నారని విమర్శించారు. ఇది క్రీమి క్లాస్‌కు పంపిణీ చేసే నిజమైన రేవడి మిఠాయ్‌గా ట్విటర్‌లో ఒవైసీ అభివర్ణించారు.

*Ycp ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయింది: Ramakrishna
రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రాఫ్ప డిపోయిందని రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర, దేశ సమస్యలు గానీ చర్చకి తేవకపోవడం వైసీపీకే చెల్లిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఒక్క గుంత కూడా పూడ్చలేని పరిస్థితికి జగన్ ప్రభుత్వం వచ్చేసిందన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన సీఎం.. రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేశాడా? అని.. ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా? అని ప్రశ్నించారు. రెండు లక్షల మంది ప్రజలు నీటిలో మునిగిపోతే, వారి గురించి పట్టించుకునే నాధుడు లేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు.

*వరద బాధితులకు చేయూత ఏది: Sailajanath
వరద బాధితులకు చేయూత ఏదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్అ న్నారు. లంక గ్రామాల్లో ఇంత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసినా ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. చుట్టపు చూపుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి తాడేపల్లి ప్యాలస్లో కూర్చుంటే బాధితుల ఆర్తనాదాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. లంక గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలని సాకే శైలజానాథ్ సూచించారు.

*సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారు: పవన్
ఏపీలో బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. వాటికి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఇంకా బ్రిటీష్‌కాలంలో కట్టిన వంతెనలే మనకు ఆధారమని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. అన్ని వర్గాలకు చెందినవారు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

*శ్రీనిధి కుటుంబాన్ని ఆదుకోవాలి: Alapati Raja
తెనాలి మండలం కొలకలూరు దళితవాడలో మాజీ మంత్రి ఆలపాటి రాజా పర్యటించారు. ఇటీవల నీటి కాలుష్యం తో మృతి చెందిన శ్రీనిధి కుటుంబాన్ని ఆయన పరామర్శించించారు. శ్రీనిధి కుటుంబానికి టీడీపీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ శ్రీనిధి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం అందించలేదన్నారు. శ్రీనిధి గత నెల 30న చనిపోయిన కారణమేంటో ఇంతవరకు తెలిలేయదని వ్యాఖ్యానించారు. ప్రజలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని విమర్శించారు. 16 రోజుల్లో 70 మంది ఆసుపత్రి పాలైతే ఇంత వరకు కారణమేంటో తేల్చలేకపోయారని మండిపడ్డారు.

*ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరాం: విజయసాయి
అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విజయసాయి మాట్లాడారు. జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో వరద పరిస్థితులపై పార్లమెంట్‌లో చర్చించి ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరపాలని కోరామన్నారు.