NRI-NRT

అనాథ అయితేనేం..అమెరికాయే అడ్మిషనిచ్చింది

అనాథ అయితేనేం..అమెరికాయే అడ్మిషనిచ్చింది

అమెరికాలోని కిర్క్‌వుడ్‌ కమ్యూనిటీ కళాశాలలో ఉన్నత చదువులు అభ్యసించేందుకు యండవ రేష్మ ఎంపికైంది. ప్రస్తుతం, రేష్మ జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ (జీఎంఆర్‌వీఎఫ్‌)లో బీ ఎస్సీ చదువుతున్నది. అమెరికా విదేశాంగ శాఖ స్పాన్సర్‌ చేసే ‘కమ్యూనిటీ కాలేజ్‌ ఇనిషియేటివ్‌ ప్రోగ్రాం’ (సీసీఐపీ) కింద జీఎంఆర్‌వీఎఫ్‌ నిర్వహిస్తున్న విద్యా సంస్థలో చదువుతున్న ‘గిఫ్టెడ్‌ చైల్డ్‌’ (అనాథ విద్యార్థిని) అమెరికాలో తన కు నచ్చిన కోర్సును అభ్యసించే అవకాశాన్ని పొందింది. రేష్మది శ్రీకాకుళం జిల్లా రాజాంలోని మెంతిపేట. ఆమె చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తన అమ్మమ్మ వద్ద పెరిగింది. తర్వాత ‘గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌’ పథకంలో భాగంగా జీఎంఆర్‌వీఎఫ్‌ చదివిస్తున్నది. ఈ ఏడాది సీసీఐపీలో పాల్గొనడానికి హైదరాబాద్‌ అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ఇటీవలే రేష్మను ఎంపిక చేసిన ట్లు తెలిపారు. చదువుకయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వమే భరించనున్నది. కాగా, సెడార్‌ ర్యాపిడ్స్‌లోని కిర్‌ వుడ్‌ కళాశాలలో అగ్రికల్చరల్‌ జియో స్పే షియల్‌ టెక్నాలజీని అభ్యసించనున్నది.జీఎంఆర్‌వీఎఫ్‌ సీ ఈఓ డాక్టర్‌ అశ్విని లోహని మాట్లాడు తూ, ఉన్నత విద్య ను అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు చదువుకునే అ వకాశం కల్పించి, సాధికారతకు తోడ్పడేందుకు జీఎంఆర్‌వీఎఫ్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లో ని వెనుకబడిన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో చదివే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పే ర్కొన్నారు. ఇప్పటివరకు జీఎంఆర్‌వీఎఫ్‌ నుంచి 11 మంది ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారని వెల్లడించారు.