Movies

చెన్నై అపోలో ఆసుపత్రిలో మణిరత్నం.. ఆందోళనలో ఫ్యాన్స్

Auto Draft

తమిళ లెజెండరీ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. మణిరత్నం తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ఆయన కరోనా బారిన పడడం చిత్ర బృందానికి ఆందోళన కలిగించే అంశమే. చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, కార్తి, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ ఇటీవల విడుదల కాగా.. దానికి అద్భుతమైన స్పందన లభించింది. మరోవైపు విమర్శలు కూడా చిత్రాన్ని చుట్టు ముట్టాయి. చిత్రంలో చోళరాజవంశాన్ని తప్పుగా చూపిస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఒకరు కోర్ట్ లో కేసు వేశారు. దాంతో హీరో విక్రమ్‌కు, దర్శకుడు మణిరత్నంకు నోటీసులు జారీ అయ్యాయి.