DailyDose

కలవరపెడుతోన్న మంకీపాక్స్… వ్యాక్సిన్ కోసం న్యూయార్క్‌లో బారులు తీరుతోన్న జనం

కలవరపెడుతోన్న మంకీపాక్స్… వ్యాక్సిన్ కోసం న్యూయార్క్‌లో బారులు తీరుతోన్న జనం

వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన రెండేళ్లుగా దీని పంజాకు చిక్కి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా. ఆర్ధిక వ్యవస్థలు పతనమై, కోట్లాది మంది రోడ్డునపడ్డారు.ఇప్పటికీ రకరకాల వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని భయపెడుతోంది కోవిడ్.
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు దీనితో చస్తుంటే.ఇప్పుడు కొత్తగా ‘‘మంకీపాక్స్’’ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంకీపాక్స్ విజృంభిస్తోంది. నిన్నగాక మొన్న భారత్‌లోనూ ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనపించడంతో టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది.దీంతో ఇండియా ఉలిక్కిపడింది.

మరోవైపు అమెరికాలోనూ మంకీపాక్స్ చాప కింద నీరులాగా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.దీంతో వ్యాక్సిన్ కోసం అక్కడి ప్రజలు టీకా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.తాజాగా ఆదివారం భారీ ఉష్ణోగ్రతను సైతం లెక్క చేయకుండా న్యూయార్క్ వాసులు వ్యాక్సిన్ తీసుకోవడానికి పోటెత్తారు.20 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులు తమను తాము రక్షించుకోవడంతో పాటు కుటుంబం కోసం వ్యాక్సిన్ తీసుకోవడానికి క్యూలైన్‌లలో బారులు తీరారు.బ్రూక్లిన్‌‌లోని బుష్విక్‌లో వున్న హైస్కూల్‌లో మంకీపాక్స్ వ్యాక్సిన్ తీసుకునేందుకు క్యూలో వేచివున్న వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

న్యూయార్క్‌లో తగినన్ని డోస్‌లు అందుబాటులో లేకపోవడంతో అపాయింట్‌మెంట్ దొరకడం కష్టంగా మారిందని ప్రజలు మీడియాతో చెబుతున్నారు.ఆన్‌లైన్‌లో స్లాటులు బుక్ చేసుకునేందుకు ప్రజలు ఎగబడటంతో మూడు రోజుల క్రితం వెబ్ పేజీ క్రాష్ అయ్యింది.ఇకపోతే.దాదాపు ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా వున్న న్యూయార్క్ నగరంలో గత వారం మంకీపాక్స్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి.మేలో తొలి కేసు వెలుగు చూసిననాటి నుంచి గత శుక్రవారం వరకు ఇక్కడ 461 మంది మంకీపాక్స్ బారినపడ్డట్లు గణాంకాలు చెబుతున్నాయి.