Movies

మూడేళ్ల‌లో మా ఇల్లు అడ‌విలా మారిపోతుందేమో

Auto Draft

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నకు జంతువులంటే ఎంత ఇష్టమన్నది ఆమెను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యేవారికి తెలిసిన విషయమే. ఇప్పటికే రష్మిక దగ్గర.. ఒత్తయిన బొచ్చుతో, పొడవాటి చెవులతో ముద్దొచ్చే ఆరా అనే పప్పీ ఉంది. ఎయిర్‌పోర్ట్‌, రెస్టారెంట్‌, జిమ్‌.. రష్మిక ఎక్కడికెళ్లినా ఫాలో అవుతూ ఉంటుంది. రష్మిక కూడా ఎంతో మురిపెంగా ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.ఇటీవలే రష్మిక ఒక పిల్లిని ఇంటికి తెచ్చుకుంది. దానికి స్నో అని పేరు పెట్టుకున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ‘అందరూ వినండి. ఇది నా కొత్త ఫ్యామిలీ మెంబర్‌. పేరు స్నో. తెలుగులో.. మంచు. ఇంకో మూడేళ్లలో నా ఇల్లు చిన్న అడవిని తలపిస్తుందేమో!’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది.