Politics

మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ – TNI రాజకీయ వార్తలు

మోదీ చేతిలో జగన్ కీలుబొమ్మ – TNI  రాజకీయ వార్తలు

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ముఖ్యమంత్రి జగన్‌ కీలుబొమ్మగా మారారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ విమర్శించారు. జగన్‌ తన పదవి గురించి ఆందోళన చెందుతున్నారే గానీ రాష్ట్ర ప్రజల గురించి మాత్రం కాదన్నారు. శైలజానాథ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్‌ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. వరద బాధితులను ప్రభుత్వం విస్మరించిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ఆదేశాలు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికీ వెళ్లలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని దుయ్యబట్టారు.సీఎం జగన్‌ ప్రధాని మోదీ పూజలు చేయడం మాని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించాలని శైలజానాథ్ సూచించారు. వరద బాధితులు టెంట్‌లలో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు రూ.25 వేలు వెంటనే అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.

*మండ‌లానికో స‌ర్వ వ‌ర్గ సామూహిక భ‌వ‌నం : మంత్రి నిరంజ‌న్ రెడ్డి
వ‌న‌ప‌ర్తి జిల్లా ప‌రిధిలోని అన్ని మండ‌లాల్లో స‌ర్వ వ‌ర్గ సామూహిక భ‌వ‌నాలు(ఫంక్ష‌న్ హాల్స్) నిర్మిస్తామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఏడు మండ‌లాల్లో రూ. 75 ల‌క్ష‌ల చొప్పున వ్య‌యంతో నిర్మిస్తామ‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌ఖ్య‌త ఉండాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న అని నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. పెద్దమందడిలో రూ.75 లక్షలతో నిర్మించే సర్వవర్గ సామూహిక భవనానికి మంత్రి నిరంజ‌న్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు.

*అప్పుడు అంబేద్కర్.. ఇప్పుడు సీఎం కేసీఆర్ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్.. మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ చౌరస్తా వద్ద దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు.యాదయ్య అనే లబ్ధిదారునికి పాడి పరిశ్రమ యూనిట్, మన్యం, చంద్రయ్య అనే లబ్ధిదారులకు సెంట్రింగ్ యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా పేద దళితులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి తెలిపారు. దేశంలో ఎవరూ చేయని ఆలోచన కేసీఆర్ చేశారని ఆయన పేర్కొన్నారు.

*కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరు: మల్లు రవి
గాంధీ , నెహ్రు కుటుంబాలను మోదీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేత, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడో పాత కేసులను కొట్టి వేసిన ఈడీ .. కేసులను తిరగదోడి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. గాంధీ, నెహ్రు కుటుంబాలు త్యాగానికి ప్రతిరూపమని, డబ్బులకు, పదవులకు ఆశ పడకుండా దేశం కోసం పని చేశారని కొనియాడారు. పదవులను త్యాగం చేసిన కుటుంబాలను, ప్రజల కోసం పని చేసిన కుటుంబాలను మోదీ ప్రభుత్వం ఈడీ పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఈ చవకబారు ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరని అన్నారు.*ఏపీ ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాలి: పయ్యావుల కేశవ్‌
ఏపీ (AP) ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం చేయాలని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం కోసమే అప్పు అనేది ఒక బూటకమని అన్నారు. సంక్షేమం అనే ముసుగులో ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకం చాలా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీలంక దిశగా సాగుతోందని 4 నెలల నుంచి టీడీపీ (TDP) చెప్తోందన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం మరోసారి చెప్పిందని ఈ సందర్భంగా పయ్యావుల గుర్తు చేశారు.

*వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పరువు తీసింది: బోండా ఉమా
వైసీపీ(YCP) ప్రభుత్వం పార్లమెంటు లో ఏపీ(AP) పరువు తీసిందని టీడీపీ(TDP) నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణం అగమ్యగోచరమైందన్నారు. పోలవరం పూర్తి కాకపోవడంపై ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి సమాధానం ఏపీ పరువు తీసేలా ఉందని తెలిపారు. జగన్ నిర్లక్ష్యంతోనే పోలవరం ఆగిందంటున్న వారికి ఏం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం పునరావాసులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 70 శాతం పూర్తి చేశామని అన్నారు. పోలవరానికి రూ.11 వేల కోట్లు ఖర్చుతో 70 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. మూడేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని నిలదీశారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు ఎంతశాతం పూర్తయ్యాయన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చింది, పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.

*ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు: దేవినేని
ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… జూన్, జులైలో వరదలు వస్తాయని తెలియని మంత్రి అంబటి రాంబాబు , సీఎం జగన్అ ని అన్నారు. 280 డ్రెడ్జింగ్ కాంట్రాక్టు సీఎం బంధువుకి ఇవ్వాలని సీఎంవో నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పట్ల వ్యూహాత్మక, చారిత్రాత్మక తప్పిదం చేసారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1, 2 అడుగులకు తగ్గించడానికి జగన్ ఒప్పుకున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) వాళ్ల అసెంబ్లీలో మాట్లాడారని… ఆయన మాట్లాడి 37 నెలలు అవుతున్నా జగన్ గానీ, ఆయన మంత్రులు గానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

*కేంద్రమంత్రి అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గం: రామకృష్ణ
విభజన హామీలు ఇప్పటికే అమలు చేశామని, కేంద్రం ప్రకటించడాన్ని తప్పు బడుతున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రైల్వేజోన్ లేదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు లేవన్నారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయకుండా వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ప క్కా మోసగాడిగా నేడు చరిత్రలో నిలిచిపోయారని రామకృష్ణ పేర్కొన్నారు.

*త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు : సంజయ్‌
తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తణక్షమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్‌ కేంద్ర మంత్రిని కలిశారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, జరిగిన నష్టాన్ని అమిత్‌ షాకు వివరించామని, దాంతో ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని అధికారులను ఆదేశించారని సంజయ్‌ నేడొక ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఉన్నత స్థాయి బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందజేస్తాయని పేర్కొన్నారు.

*ఎన్నికలు ఏవైనా అదే అరాచకం…అవే అక్రమాలు: అచ్చెన్నాయుడు
ఎన్నికలు ఏవైనా వైసీపీ అదే అరాచకం, అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ములేకనే వైసీపీ(YCP) అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలెందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి కొమ్ముకాయడానికా ? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారని… వైసీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేయలేదని అడిగారు. జగన్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా దోచుకున్న డబ్బును అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారం బలంతో, ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

*చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: నారాయణ
మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెనక్కి తీసుకున్నారు. బాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ… చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయటం సహజమని నారాయణ పేర్కొన్నారు.ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. నారాయణ వ్యాఖ్యలపై చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

*దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా?: లోకేష్రా
జారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి(Jagan reddy) దొంగ బ్రతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని టీడీపీ నాయకులు పట్టుకుంటే వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరన్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకుల(YCP leaders)పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

* కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది: తులసిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవినీ, ప్రాణ వాయువని అన్నారు. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 2014లో గానీ, 2019లో గానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వుంటే ఈ పాటికి ప్రత్యేక హోదా అమలై ఉండేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేదన్నారు.ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ స్పష్టంగా చెప్పిందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీ (AP)కి ప్రత్యేక హోదా రాదని తులసిరెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలైనా టీడీపీ (TDP), వైసీపీ (YCP), జనసేన పార్టీలకు ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదని విమర్శించారు. కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

*త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందాలు : సంజయ్‌
తెలంగాణలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి తణక్షమే ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని సంబంధిత అధికారులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదేశించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్‌ కేంద్ర మంత్రిని కలిశారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, జరిగిన నష్టాన్ని అమిత్‌ షాకు వివరించామని, దాంతో ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపించాలని అధికారులను ఆదేశించారని సంజయ్‌ నేడొక ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో ఉన్నత స్థాయి బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందజేస్తాయని పేర్కొన్నారు.

*నెహ్రూ-గాంధీ కుటుంబంపై బీజేపీ నిరాధార ఆరోపణలు: ఉత్తమ్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. బీజేపీ సర్కారు ధోరణిని వ్యతిరేకిస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను.. ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను(ఈడీ) కేంద్రం వాడుకుంటోందని ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ చేసిన మనీలాండరింగ్‌ ఆరోపణలు అవాస్తవమన్నారు. సోనియాకు సంఘీభావం తెలుపుతూ 21, 22 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉత్తమ్‌ కోరారు.

*రైతు ఖాతాలో పడే డబ్బులు.. అప్పుకింద జమ కాకుండా చూడండి:టీపీసీసీ
వివిధ పథకాల కింద రైతు ఖాతాల్లో పడే డబ్బులను బకాయిల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా చూడాలని ఆర్‌బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె. నిఖలను టీపీసీసీ ప్రతినిధి బృందం కోరింది. అన్ని గ్రామీణ శాఖల్లో అధిక సంఖ్యలో సిబ్బందిని నియమించి పంట రుణాల మంజూరును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్‌బీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిఖిలను కలిసిన కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది.

*బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం: బస్వ లక్ష్మీనర్సయ్య
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యమని, కార్యకర్తలు సైనికులుగా పనిచేస్తూ పోలింగ్‌ బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీనర్స య్య అన్నారు. మంగళవారం అర్గుల్‌ గ్రామంలోని మైత్రిగార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ లో పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యా ప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు బైక్‌ ర్యాలీ లు తీయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బోధన్‌ నియోజకవ ర్గంలో పల్లెగోస-బీజేపీ భరోసాలో భాగంగా ఈనెల 21 నుంచి 31వ తేదీ వ రకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ శాసనపక్ష నాయకుడు రాజాసింగ్‌ హాజరవుతారన్నారు. నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలో పాల్గొనాలని, కే సీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. స్వాతంత్య్ర అమృత్‌ మహో త్సవాల సందర్భంగా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో బైక్‌ ర్యా లీలు తీయాలని పిలుపునిచ్చారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని నరేం ద్రమోదీ నిర్వహించే మన్‌కీబత్‌ కార్యక్రమాన్ని వీక్షించాలన్నారు. స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవం భాగంగా ఆగస్టు 9 నుంచి ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని తెలిపారు. రైతులు, పేదప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన వారిని అందిస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డి, అల్జాపూర్‌ శ్రీనివాస్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రూరల్‌ ఇన్‌చార్జి దినేష్‌, ఎంపీపీ గద్దె భూమన్న పాల్గొన్నారు.

*ఆనాడే ఆ మాట చెప్పాం కానీ వినలేదు: భట్టి
పోలవరం కడితే 2లక్షల ఎకరాల భూమి గిరిజన గ్రామాలు మునుగుతాయని తాము ఆనాడే చెప్పామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు నుంచి ఏడు మండలాలు తొలగించి కాంగ్రెస్ బిల్లు పాస్ చేసిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారని చెప్పారు. ఏడు మండలాలు ఏపీలో కలుపొద్దని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని అసలు కేంద్రానికి పంపించారా లేదా?, ఇన్నేళ్లు ఎందుకు ఏడు మడలాల కోసం పోరాటం చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అఖిల పక్షానికి ఎందుకు ఢిల్లీ తీసుకువెల్లలేదని కూడా ప్రశ్నించారు. కాపర్ డ్యాములు కడుతుంటే మీరెందుకు ఆపలేదన్నారు. ఏడు మండలాలు ఎలా వెనక్కి తెస్తారో చెప్పాలని, అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 3వేల ఎకరాలు మునిగితే అంగీకరించ లేదన్నారు. మీరు 2లక్షలు ఎకరాలు మింగుతుంటే ఎలా అంగీ కరించారు? అని ప్రశ్నించారు. ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ మీకు తెలంగాణ మీద లేదా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేలా బాధ్యతారహితంగా మాట్లాడొద్దన్నారు.

*సోమువి అవగాహన లేని మాటలు: కొట్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏ మాత్రం అవగాహన లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీర్రాజు ఆరోపించినట్లుగా హిందూ దేవాలయాల నిధుల మళ్లింపు వాస్తవం కాదన్నారు. కాగా, దుర్గగుడి ఘాట్‌రోడ్డులో ప్రమాదాల దృష్ట్యా, ఘాట్‌ రోడ్డు మూసివేసి ప్రతి ఒక్కరికీ రాజగోపురం ద్వారానే ఆలయప్రవేశం కల్పించే ఆలోచన కూడా ఉందని తెలిపారు. కాగా, పవన్‌ ఎంవోయూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. వైసీపీ రహిత ప్రభుత్వం ఏర్పాటుకు పవన్‌ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.

*బాలకోటిరెడ్డిపై దాడిని ఖండించిన అచ్చెన్న
పల్నాడు: జిల్లాలోని రొంపిచెర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై వైసీపీ మూకలు చేసిన దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌రెడ్డి ప్యాక్షన్ భావాలను నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ గుండాలకు ప్రత్యేకంగా ‘‘కంటికి కన్ను, పంటికి పన్ను’’ అనే పథకం అమలు చేస్తే మీ పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.ఫిజిక్స్‌లో చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ఇప్పుడు వైసీపీ మూకలు చేసే ప్రతి అరాచకానికి కర్మఫలం ఉంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

*అవే జగన్ రెడ్డి ప‌త‌నానికి దారులు: లోకేష్టీ
డీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘హ‌త్య‌లు, దాడుల‌తో టీడీపీ కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుంటున్న జ‌గ‌న్ రెడ్డి గారూ! శిశుపాలుడిలా మీ పాపాలు పండిపోయాయి. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం మీరు చేయిస్తున్న హ‌త్య‌లు, దాడులే మీ ప‌త‌నానికి దారులు. రొంపిచ‌ర్ల మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ మీ వైసీపీ (YCP) గూండాల ప‌నే. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే వైసీపీ స‌ర్కారుదే బాధ్య‌త‌. దాడిలో ఏకంగా వైసీపీ ఎంపీపీ భ‌ర్త పాల్గొన్నాడంటే..మీ రౌడీమూక‌లు ఎంత‌గా బ‌రితెగించాయో అర్థం అవుతోంది. ఫ్యాక్ష‌న్‌ మ‌న‌స్త‌త్వం బ్ల‌డ్‌లోనే ఉన్న మీ పాల‌న‌లో ప‌ల్నాడు ప్రాంతం ర‌క్త‌సిక్త‌మ‌వుతోంది. ఇక‌నైనా హ‌త్యారాజ‌కీయాలు, దాడులు ఆపండి. లేదంటే ఇంత‌కి నాలుగింత‌లు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా వుండండి. జ‌గ‌న్‌రెడ్డి అధికారం, పోలీసులు అండ‌గా వున్నార‌ని రెచ్చిపోతున్న వైసీపీ నేత‌లకు ఇదే చివ‌రి హెచ్చ‌రిక‌. మేము తిర‌గ‌బ‌డితే, మీ వెంట వ‌చ్చేది ఎవ‌రు? వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మ‌ల్ని కాపాడేదెవ‌రు?’’ అని నారా లోకేష్ అన్నారు

*ప్రశ్నించే గొంతుని నొక్కొద్దు: ఆర్కే శిరీష
NIA అధికారులు తన ఇంటిపై దాడి చేయడం సమంజసం కాదని మావోయిస్ట్‌ దివంగత అగ్ర నేత భార్య ఆర్కే శిరీష( అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్య పరీక్షల కోసం విజయవాడ వెళ్లానని అన్నారు. ఉదయం తాను ఇంట్లో లేని సమయంలో NIA అధికారులు తనిఖీలు చేశారని.. తన ఇంట్లో నలుగురు తలదాచుకున్నారని సమాచారం వచ్చిందని అధికారులు చెప్పడం విస్మయాన్ని కలిగించిదన్నారు. అంతేకాకుండా మావోయిస్ట్‌ల దగ్గర డంప్‌ స్వాధీనంలో కొంతమంది విరసం నేతల పేర్లు ఉన్నాయని చెప్పడంలో అధికారుల అంతర్యమోమిటో తెలియదన్నారు. మావోయిస్ట్‌లకు డబ్బులు పంపిస్తున్నారంటూ NIA అధికారులు చేస్తున్న ఆరోపణలు ఆవాస్తవమని చెప్పారు. ఎప్పటికైనా కుళ్లిపోయిన సమాజంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించిన గొంతుని నొక్కే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని ఆర్కే శిరీష ధ్వజమెత్తారు.

*ఇలాగైతే గెలవడం కష్టమే: రఘరామకృష్ణరాజు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘరామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేశారని, ఫలితంగా పాఠశాలలను మూసేస్తున్నారని పేర్కొన్నారు. 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ ఔట్ అయ్యారని తెలిపారు. ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే 175 సీట్లు కాదు కదా..అసలు గెలిచే స్థాన్లాల్లో గెలవడం కూడా కష్టమని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ప్రజలు చెప్పులతో నిలదీయాలని గతలో జగన్ పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
*ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు: నిమ్మల
గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చింది?, పోలవరం ఎత్తుపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారు? అని టీడీపీ శాసనసభాపక్ష నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

*నాలుగంటే నాలుగే.. లెక్కచూసుకో జగన్‌రెడ్డీ!
గోదావరి వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమూలకు సరిపోతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘నాలుగంటే నాలుగే! వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఇదీ!!’’ అని ఎద్దేవా చేశారు. ‘నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు. ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం. లెక్క చూసుకో జగన్‌ రెడ్డీ.. నాలుగంటే నాలుగే’ అని వ్యాఖ్యానించారు. అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో వరద బాధితులకు ప్రభుత్వం నుంచి అందిన సాయంపై మీడియాలో వచ్చిన వార్తా కఽథనాలను ఉటంకించారు.

*వరద బాధితుల కోసం బటన్‌ నొక్కొచ్చుగా?: కళా
వరదలతో ప్రజలు పడుతున్న బాధలు టీవీల్లో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వేకి వెళ్లొచ్చాక వరద ప్రాంతాల్లో ఏం జరుగుతుందో యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదన్నారు. ప్రతి దానికి బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌రెడ్డి వరద బాధితుల కోసం కూడా ఓ బటన్‌ నొక్కొచ్చు కదా? అని వ్యాఖ్యానించారు.

*ఎమ్మెస్పీపై కమిటీ వేయడం సంతోషం: సోమిరెడ్డి
కనీస మద్దతు ధరపై కమిటీ నియామకం పట్ల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పని ఎప్పుడో చేసుండాల్సిందన్నారు.. లేదా స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేసుండాల్సిందని పేర్కొన్నారు. వరిసాగుకు ఎకరానికి రూ.12వేలపైగా ఖర్చుపెరిగిందని, కానీ ధాన్యం క్వింటాకు రూ.100పెంచి సరిపెట్టుకోవడం తగదని పేర్కొన్నారు.

*జగన్‌ బటన్‌ నొక్కినప్పుడల్లా ‘సాక్షి’కి కోట్లు – టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఎద్దేవా
ప్రభుత్వ పథకాల పేరిట ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బటన్‌ నొక్కినప్పుడల్లా ఆయన కుటుంబానికి చెందిన ‘సాక్షి’ పత్రిక, టీవీలకు రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి. ప్రజలకు పథకాల వివరాలు తెలియజేసే సాకుతో జగన్‌ ప్రభుత్వం ప్రకటనల రూపంలో ప్రభుత్వ ధనాన్ని మూడేళ్లుగా యథేచ్ఛగా తన సొంత పత్రికకు దోచిపెడుతున్నారు’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ‘బటన్‌ నొక్కుడు వల్ల రాష్ట్రంలో పేదల కుటుంబాలకు వచ్చిన డబ్బుతో పోలిస్తే జగన్‌ కుటుంబానికి కనీసం వెయ్యిరెట్లు అధికంగా ఆదాయం వెళ్తోంది. బటన్‌ నొక్కుడుపై ఇచ్చిన ప్రకటనల వల్ల ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి ఖజానాకు ఇప్పటికి కనీసం రూ.300 కోట్లు వెళ్లాయి’ అని ఆరోపించారు. మంగళవారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు తన భర్తకు హారతులు పట్టిన భారతి రెడ్డి.. ఇప్పుడు సూట్‌ కేసులు లెక్కపెట్టుకొంటున్నారని, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న తన భర్తను వారించాల్సింది పోయి ఆయన అద్భుతంగా పరిపాలిస్తున్నారని దగ్గర కూర్చొని ఆమె తన పత్రికలో రాయిస్తున్నారని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉండగా అవినీతి సంపాదనను ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి… ఈ కంపెనీ నుంచి మరో కంపెనీకి అటూ ఇటూ తరలించడంలో ఎక్కడ లేని అనుభవం సంపాదించిన జగన్‌ రెడ్డి.. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే పని చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికలో గిరిజన అభ్యర్థికి ఓటు వేయడానికి చంద్రబాబు అసెంబ్లీ ప్రాంగణానికి వస్తే.. అదేదో మహాపరాధం అయినట్లు వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని, కోడి కత్తి పేరుతో దొంగ పోట్లు పొడిపించుకొని సానుభూతి కోసం ఆస్పత్రిలో పడుకొన్న జగన్‌ మాదిరి మోసాలు చంద్రబాబుకు తెలియవని అనిత వ్యాఖ్యానించారు.

*కేంద్రం గుప్పిట్లో జగన్ సర్కార్ : పట్టాభి
కేంద్రం గుప్పిట్లో జగన్ సర్కార్ ఉందని టీడీపీ నేత పట్టాభి రాం అన్నారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే..వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ కేసులకు భయపడి ఏపీని సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై జగన్ ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని, ఇటీవల ప్రధాని ఏపీకి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు తేలేదని పట్టాభి ప్రశ్నించారు.

*ఆనాడే ఆ మాట చెప్పాం కానీ వినలేదు: భట్టి
పోలవరం కడితే 2లక్షల ఎకరాల భూమి గిరిజన గ్రామాలు మునుగుతాయని తాము ఆనాడే చెప్పామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు నుంచి ఏడు మండలాలు తొలగించి కాంగ్రెస్ బిల్లు పాస్ చేసిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఏడు మండలాలు ఆంధ్రలో కలిపారని చెప్పారు. ఏడు మండలాలు ఏపీలో కలుపొద్దని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. ఆ తీర్మానాన్ని అసలు కేంద్రానికి పంపించారా లేదా?, ఇన్నేళ్లు ఎందుకు ఏడు మడలాల కోసం పోరాటం చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అఖిల పక్షానికి ఎందుకు ఢిల్లీ తీసుకువెల్లలేదని కూడా ప్రశ్నించారు. కాపర్ డ్యాములు కడుతుంటే మీరెందుకు ఆపలేదన్నారు. ఏడు మండలాలు ఎలా వెనక్కి తెస్తారో చెప్పాలని, అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ 3వేల ఎకరాలు మునిగితే అంగీకరించ లేదన్నారు. మీరు 2లక్షలు ఎకరాలు మింగుతుంటే ఎలా అంగీ కరించారు? అని ప్రశ్నించారు. ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ మీకు తెలంగాణ మీద లేదా? అని ప్రశ్నించారు. పాలకులు ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేసేలా బాధ్యతారహితంగా మాట్లాడొద్దన్నారు.

*నామమాత్రంగా పునరావాస కేంద్రాలు: పవన్
వరద ముంపు బాధితుల కోసం వైసీపీ సర్కార్ పునరావాస కేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ విమర్శించారు. వరద బాధితుల గోడు పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే.. రాజకీయం చేస్తున్నామని వైసీపీ సర్కార్ ఎదురుదాడికి దిగుతోందని పేర్కొన్నారు. కోనసీమలో ఆహార పొట్లాల కోసం జనం పెనుగులాడుకునే దుస్థితిని కల్పించారని పవన్ మండిపడ్డారు.