DailyDose

పాకిస్తాన్‌లో అమెరికా యువ‌తిపై సామూహిక లైంగిక‌దాడి – TNI నేర వార్తలు

పాకిస్తాన్‌లో అమెరికా యువ‌తిపై సామూహిక లైంగిక‌దాడి  – TNI  నేర వార్తలు

* పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువ‌తిపై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేష‌న్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో జులై 17న యువ‌తిని నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు.బాధిత యువ‌తి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెల‌ల క్రితం పాకిస్తాన్‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే ఆదివారం రోజు ఫోర్ట్ మాన్‌రోయ్ సంద‌ర్శిద్దాం.. అక్క‌డికి రావాల‌ని అమెరికా యువ‌తిని వారిద్ద‌రూ కోరారు. దీంతో ఆమె అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఓ హోట‌ల్‌లో నిర్బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీక‌రించి, ఆమెను బెదిరింపుల‌కు గురి చేశారు.త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రొక‌రు పరారీలో ఉన్నారు.

*దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి నుంచి సుమారు 20 ల‌క్ష‌ల ఖ‌రీదైన ఎయిర్‌గ‌న్స్‌, టెలిస్కోప్, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్ ఎయిర్‌పోర్ట్‌లో క‌స్ట‌మ్స్ అధికారులు అత‌న్ని ప‌ట్టుకున్నారు. ఎటువంటి డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌కుండా గ్రీన్ ఛాన‌ల్ నుంచి వెళ్తున్న ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అడ్డుకున్నారు. అత‌ని ల‌గేజీలో ప‌ది ఎయిర్ గ‌న్స్‌, గ‌న్స్‌కు వాడే టెలిస్కోప్ సైట్స్, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అత‌ని వ‌ద్ద స‌క్ర‌మమైన డాక్యుమెంట్లు లేవ‌ని విచార‌ణ‌లో తేల్చారు.

*పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద నార్కట్ పల్లి – అద్దంకి హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంచి నూనె ట్యాంకర్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. ట్యాంకర్లో ఉన్న మంచి నూనె రోడ్డు పక్కనున్న గుంతలో పడి నిల్వ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. నూనె తీసుకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో క్యాన్లు తీసుకుని వచ్చారు. నకరికల్లు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజలు వినకపోవడంతో చేసేది లేక వదిలేశారు. దీనితో రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

*దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ ను మలిక గార్గ్‌ సస్పెండ్ చేశారు. ఈ నెల 13న వైసీపీ (YCP) నేతలతో కలిసి చంద్రశేఖర్‌ బ్యాంకాక్‌ వెళ్లారు. అనుమతి తీసుకోకుండా బ్యాంకాక్‌ వెళ్లడంపై ఎస్పీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై, బ్యాంకాక్‌ వ్యవహారంపై విచారణ జరిపి ఎస్పీ సస్సెండ్ చేశారు. అధికారపార్టీ నేతలతో కలిసి చంద్రశేఖర్, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకాక్‌ వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతనిపై వేటుపడింది. పోలీసు అధికారులు కట్టుతప్పి వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. చంద్రశేఖర్‌ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నిమార్లు విదేశాలకు వెళ్లారు.. ఉన్నతాధికారుల అనుమతులు పొందారా? అనే అంశా న్ని లోతుగా పరిశీలిస్తున్నారు. పాస్‌పోర్టు ఆధారంగా అతని పర్యటన వివరాలను తెప్పించారు. ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో చంద్రశేఖర్‌ నడవడికను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా బ్యాంకాక్‌ నుంచి తన స్నేహితులతో ఉన్నతాధికారుల గురించి మాట్లాడిన వీడియోపైనా విచారణ చేస్తున్నారు.

*అనంతపురం జిల్లా శింగనమలలోని చెరువులో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీశారు. మృతి చెందిన వారు తల్లి, ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

*హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మూడంతస్తుల భవనం పైనుంచి దూకి విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధి చంద్రపురికాలనీలో జరిగింది. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు దర్యాప్తులో ఆత్మహత్యగా తేల్చారు. విద్యార్థినికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి.

*ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్న అన్నదమ్ములను చూసి విధికి కన్ను కుట్టినట్లుంది.. విద్యుత్తు రూపంలో ఇద్దరినీ ఒకే రోజు బలి తీసుకుంది. అనంతపురం కణేకల్లు మండలం 43ఉడేగోళం గ్రామంలో ఆదివారం నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన సోదరులు రమేష్‌ (34), దేవేంద్ర (28) విద్యుదాఘాతంతో మృతి చెందారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి యల్లప్ప పెద్ద భార్య కుమారుడు దేవేంద్ర, చిన్న భార్య కుమారులు రమేష్‌, వన్నూరుస్వామి ముగ్గురు కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి పంపుసెట్టు ద్వారా నారుమడికి నీరు పెట్టేందుకు చూశారు. రమేష్‌ మోటారుకు అమర్చిన వదులుగా ఉన్న పైపును గట్టిగా అదిమి పట్టుకోగా.. దేవేంద్ర మోటారును స్టార్ట్‌ చేశారు. దీంతో రమేష్‌ విద్యుదాఘాతానికి గురయ్యారు. పక్కనే ఉన్న దేవేంద్ర అతడిని పట్టుకోవడంతో ఇద్దరూ మోటారుపై పడిపోయారు. అన్నదమ్ములను కాపాడేందుకు ప్రయత్నించగా వన్నూరుస్వామికీ షాక్‌ కొట్టి సొమ్మసిల్లి పడిపోయారు. కాసేపటికి తేరుకుని విషయాన్ని ఫోన్‌లో కుటుంబ సభ్యులకు తెలిపారు. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వన్నూరుస్వామికి ప్రథమచికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం బళ్లారికి తరలించారు.

*ఆస్తి తగాదాలు వావి వరుసలు కూడా దరి చేయనీయవని నిరూపించారు ఆ సోదరులు. సొంత అక్కను ఆస్తి కోసం దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. ముగ్గురు సోదరులు అక్క, బావపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ గొడవలో అక్క పూర్ణిమ(45) మృతి చెందగా, బావతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజులుగా అక్క, తమ్ముళ్ల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.

*జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌పై ఓ ట్ర‌క్కు దూసుకువెళ్లింది. గ‌త రాత్రి వెహికిల్ చెకింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. రాంచీలోని తుపుదానా ఔట్‌పోస్టు వ‌ద్ద విధులు నిర్వ‌హిస్తున్న ఇన్‌ఛార్జ్ ఎస్సై సంధ్యా తోప్నోపై నుంచి వాహ‌నం దూసుకువెళ్లింది. వాహ‌నంలో అక్ర‌మంగా ఆవుల‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో ఎస్సై సంధ్యా చెకింగ్ కోసం వెళ్లింది. ట్ర‌క్కును ఆపే స‌మ‌యంలో దాని డ్రైవ‌ర్ ఆ ఎస్సై పైనుంచి తీసుకువెళ్లిన‌ట్లు ఎస్పీ కౌశ‌ల్ కిశోర్ తెలిపారు. హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లే లోపు ఆమె మ‌ర‌ణించింద‌ని, నిందితుడిని అరెస్టు చేసి వాహ‌నాన్ని సీజ్ చేశారు. సోమ‌వారం హ‌ర్యానాలో డీఎస్పీ ర్యాంక్ అధికారిని కూడా ట్ర‌క్కుతో ఢీకొట్టి చంపిన విష‌యం తెలిసిందే. మైనింగ్ మాఫియా ఆ హ‌త్య చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

*మచిలీపట్నం రూరల్ లో ధాన్యం వ్యాపారిపై కత్తులతో దాడి కృష్ణాజిల్లా పెదయదర కు చెందిన కంచర్లపల్లి రాంబాబు అలియాస్ రాము ధాన్యం వ్యాపారిపై దుండగులు కత్తులతో దాడి.కత్తులతో పొడిచి అతనివద్ద ఉన్న డబ్బుల బ్యాగు లాక్కెళ్లినట్లు సమాచారం.చినయాదర నెలకురు మధ్య దారి కాచి దాడి.నేరుగా విజయవాడ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.రాంబాబు పరిస్థితి విషమం. రాము స్వస్థలం పెదయదర గ్రామంలో అల్లర్లు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.

*అనంతపురం: పట్టణంలోని రాజేంద్ర నగర్‌లో మంగళవారం కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు… కోల్‌కతా నుంచి బిక్కి, నసీమా(25) దంపతులు ఐదేళ్లక్రితం ధర్మ వరం వలస వచ్చి రాజేంద్రనగర్‌లో నివాసముం టున్నారు. వారు ఇక్కడ చీరలపై పాలిష్‌ వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం చీరలపై పాలిష్‌ సరిగా వేయలేదని భర్త మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నసీమా ఇంట్లో మగ్గానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తరువాత ఇంటికి వచ్చిన భర్త బిక్కి భార్య నసీమా ఉరికివేలాడుతున్న దృశ్యాన్ని చూసి బోరున విలపించాడు. ఈ విషయం స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఆలియా(3)ఉన్నాడు.

*కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ కేసీ క్యాంపు దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌-లారీ ఢీకొన్న ప్రమాదంలో చిన్న పాపయ్య పల్లె గ్రామానికి చెందిన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు గూడూరి రాజిరెడ్డి మృతి చెందాడు. హుజురాబాద్ నుంచి ప్రభుత్వ హైస్కూల్లో విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం కుమ్మరితండాలో సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 3 బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*సైబరాబాద్‌లో భారీ స్థాయిలో గంజాయి, కొకైన్‌ను పట్టుకున్నారు. పోలీసులు 1,982 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఏపీ, ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. 18 కేసుల్లో 61 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

* ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం కుమ్మరితండాలో సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 3 బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*శంషాబాద్ మండలం పెద్ద గోల్కోండ ఔటర్‌ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను బెంజ్ కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*అనంతపురం: పట్టణంలోని రాజేంద్ర నగర్‌లో మంగళవారం కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు… కోల్‌కతా నుంచి బిక్కి, నసీమా(25) దంపతులు ఐదేళ్లక్రితం ధర్మ వరం వలస వచ్చి రాజేంద్రనగర్‌లో నివాసముం టున్నారు. వారు ఇక్కడ చీరలపై పాలిష్‌ వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం చీరలపై పాలిష్‌ సరిగా వేయలేదని భర్త మందలించి బయటకు వెళ్లాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నసీమా ఇంట్లో మగ్గానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తరువాత ఇంటికి వచ్చిన భర్త బిక్కి భార్య నసీమా ఉరికివేలాడుతున్న దృశ్యాన్ని చూసి బోరున విలపించాడు. ఈ విషయం స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఆలియా(3)ఉన్నాడు.

*కేతేపల్లి మండల కేంద్రం కేతేపల్లిలో వరి కోత యంత్రాల మెకానిక్‌ షెడ్డులో చోరీకి యత్నించిన నలుగురిని కేతేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులూ మైనర్లే అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు కేతేపల్లిలోని ఎస్సీకాలనీ సమీపంలో 65వ నెంబర్‌ జాతీయ రహదారి వెంట బీహార్‌ నుంచి వచ్చిన ఇరువురు వ్యక్తులు వరికోత యంత్రాల మెకానిక్‌ షెడ్డు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరికోత యంత్రాలకు పని లేకపోవడంతో వారు తమ స్వస్థలాలకు వెళ్లారు. షెడ్డు వద్ద ఎవరూలేరని నిర్ధారించుకున్న నకిరేకల్‌కు చెందిన నలుగురు మైనర్‌ బాలురు కొద్దిరోజులుగా షెడ్డులోకి వెళ్ళి అక్కడ ఉన్న వరికోత యంత్రాల భాగాలను అపహరిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున వరికోత యంత్రాల చైన్లు విడదీస్తున్న క్రమంలో వచ్చిన శబ్దాలకు పరిసర నివాస గృహాల వారు చోరీ జరుగుతున్నట్లు గుర్తించి షెడ్డు వద్దకు వచ్చారు. వీరిని గమనించిన బాలురు తమ వెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై పరారయ్యేందుకు యత్నించగా పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల మండలంలో జరుగుతున్న వరుస చోరీ సంఘటల నేపథ్యంలో పోలీసులు తమ అదుపులో ఉన్న నలుగురు బాలురను సమగ్రంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై కేతేపల్లి ఎస్‌ఐ ఎం.అనిల్‌రెడ్డిని వివరణ అడగగా స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలంలో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్న విషయం వాస్తవమేనన్నారు. పట్టుబడిన వారిని అన్ని కోణాల్లో పూర్తిగా విచారించిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

*కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 సంవత్సరాల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడ గ్రామానికి చెందిన ఓ బాలికను తండ్రి వసతిగృహం నుంచి బయటకు తీసుకువచ్చి, బెదిరించి లైంగిక దాడికి పాల్పడేవాడు. 2019 సెప్టెంబరులో బాలిక తల్లి గమనించడంతో చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

*అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భీమా-కోరేగాం కేసు నిందితుడు వరవరరావు(83) దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే కారణంతో ప్రస్తుతం ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 10న చేపట్టనున్నట్టు ఽపేర్కొంది.

*హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌లో దూకి శైలజ(38) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. చున్నీతో మెడకు బిగించుకుని మరీ యువతి ట్యాంక్ బండ్ వాటర్‌లో దూకేసింది. శైలజ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శైలజ… ట్యాంక్ బండ్‌లో శవమై తేలింది. భర్త చనిపోవడం, అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌లో సూసైడ్ చేసుకుంది. శైలజ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకగా… ట్యాంక్ బండ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

*హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌లో దూకి శైలజ(38) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. చున్నీతో మెడకు బిగించుకుని మరీ యువతి ట్యాంక్ బండ్ వాటర్‌లో దూకేసింది. శైలజ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 5 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన శైలజ… ట్యాంక్ బండ్‌లో శవమై తేలింది. భర్త చనిపోవడం, అనారోగ్య సమస్యలతో డిప్రెషన్‌లో సూసైడ్ చేసుకుంది. శైలజ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకగా… ట్యాంక్ బండ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

*అనంతపురం జిల్లా సింగనమల మండలం మరుగుకొమ్మ క్రాసింగ్‌ వద్ద ఉన్న రంగరాయల చెరువులో మూడు మృతదేహాలు లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. తల్లి , ఇద్దరు పిల్లల మృతదేహాలను గమనించిన గ్రామస్థులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. తల్లి వయస్సు (35 ) , బాలుడు(7 ), బాలిక (4) వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు.

*అప్పులపాలైన ఒక వ్యాపారి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి కారులో నిప్పటించుకున్నాడు. కారుతో సహా మంటల్లో కాలి అతడు మరణించగా భార్య, కుమారుడు తప్పించుకున్నారు. అయితే వారికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 58 ఏళ్ల రామరాజ్ భట్ తన భార్య, కుమారుడ్ని మంగళవారం ఒక హోటల్‌కు లంచ్‌కు తీసుకెళ్లాడు. అనంతరం లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. ఆ తర్వాత కారును రోడ్డు పక్కగా ఆపాడు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న రామరాజ్‌ భట్‌ ఉన్నట్టుండి తనపై పెట్రోల్‌ పోసుకున్నాడు. కారులో ఉన్న 57 ఏళ్ల భార్య సంగీత భట్, 25 ఏళ్ల కుమారుడు నందన్‌పై కూడా పెట్రోల్‌ పోశాడు. అనంతరం తాను నిప్పటించుకుని వారికి కూడా నిప్పు అంటించాడు. రామరాజ్‌ భట్‌ సజీవ దహనం కాగా, ఆ కారు మంటల్లో కాలిపోయింది.

* ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెలుగోడుకు చెందిన ఓ బాలిక, బాలుడు కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు. వీరు ఉన్న ప్రదేశంలోకి ముగ్గురు యువకులు వెళ్లి వారిపై దాడి చేశారు. బాలికపై అత్యాచారానికి యత్నించారు. బాలిక, బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. బాలిక వెలుగోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

*పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలోని చిచాభక్నా గ్రామంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుల ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకోగా.. నిందితులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో అధికారులు జరిపిన ఎదురుకాల్పులు ఇద్దరు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. మృతులను జగ్రూప్ సింగ్ రూపా, మన్ప్రీత్ సింగ్ అలియాస్ మన్నుకుస్సాగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి ఏకే 47, పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.