Movies

మీటూ నిందితులు వేధిస్తున్నారు

మీటూ నిందితులు వేధిస్తున్నారు

లైంగిక వేధింపులపై మాట్లాడినందుకు తనను ఇప్పటికీ వేధిస్తున్నారని చెబుతోంది బాలీవుడ్‌ తార తనుశ్రీ దత్తా. 2018 సెప్టెంబర్‌లో మీటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిందీ నాయిక. నటుడు నానా పటేకర్‌ శారీరకంగా వేధించాడని ఆమె చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమాన్ని రగిల్చాయి.పలువురు నాయికలు బయటకొచ్చి తమకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని చెప్పుకున్నారు. తాజాగా తనుశ్రీ దత్తా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ…‘మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్‌ ధ్వంసం చేయాలని చూస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోను. మళ్లీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తా.’ అని పేర్కొంది.