NRI-NRT

2022లో ఈ దేశం పాస్‌పోర్ట్ పవర్‌ఫుల్.. మరి భారత్ ర్యాంకు ఎంతో తెలుసా..

2022లో ఈ దేశం పాస్‌పోర్ట్ పవర్‌ఫుల్.. మరి భారత్ ర్యాంకు ఎంతో తెలుసా..

కరోనా మహామ్మారి దుష్ప్రభావం, ప్రతికూల పరిస్థితుల కారణంగా శక్తివంతమైన పాస్‌పోర్టుల ర్యాంకింగ్స్‌‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలో యూరోపియన్ దేశాలే ఎప్పుడూ అగ్రభాగాన నిలిచేవి. అయితే ఈసారి ఆసియా దేశాలు టాప్‌ స్థానాల్లోకి దూసుకొచ్చాయి. ప్రపంచ శక్తివంత పాస్‌పోర్ట్- 2022 జాబితాలో జపాన్ పాస్‌పోర్ట్‌ కు నంబర్ 1 స్థానం దక్కింది. ఆ దేశ పౌరులు ఎలాంటి అవరోధాలు లేకుండా ఏకంగా 193 దేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. అంటే వీసా లేకుండానే దాదాపు ప్రపంచమంతా చుట్టేయొచ్చన్నమాట. ఇక సింగపూర్ , దక్షిణకొరియా ఉమ్మడిగా రెండవ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 192 దేశాలకు పోవచ్చు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్టనర్స్ఒ క రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌ లో మార్పులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్..186 దేశాల్లోకి ప్రవేశంతో అమెరికా(US) పాస్‌పోర్ట్ 7వ స్థానంలో, యూకే 6వ స్థానంలో(187 దేశాలు) ఉన్నాయి. ఇక రష్యా పాస్‌పోర్ట్ 50వ ర్యాంకులో నిలిచింది. రష్యా పాస్‌పోర్టుకు 119 దేశాల్లోకి ఎంట్రీ ఉంది. 80 దేశాల ప్రవేశంతో చైనా 69వ ర్యాంకు, 87 దేశాల్లోకి ఆటంకాలు లేని ప్రవేశంతో భారత్‌ 87వ స్థానంలో నిలిచాయి. కాగా పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల ర్యాంకింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. కేవలం 27 దేశాల్లోకి మాత్రమే ఈ పాస్‌పోర్టుతో ప్రవేశం ఉంది.కరోనా ముందు లాగా స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఇంకా సమయం పడుతుందని హెన్లే అండ్ పార్టనర్స్ చైర్మన్ క్రిస్టియాన్ కెలిన్ చెప్పారు. ప్రపంచ దేశాలు ఇంకా కోలుకోవాల్సి ఉందన్నారు. రికవరీ తర్వాతే ప్రయాణాలు సాధారణ స్థాయికి చేరతాయన్నారు. కరోనా పరిస్థితులను ఉదహరిస్తూ.. పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్-2017 జాబితా టాప్-10లో ఆసియా దేశాలు అరుదుగా కనిపించాయని, అయితే యూరోపియన్ దేశాల ఆధిపత్యం తగ్గిందని క్రిస్టియాన్ అన్నారు. దక్షిణకొరియా కంటే జర్మనీ వెనుకబడిందని చెప్పారు. అయితే కొవిడ్ ఆంక్షల కారణంగా ప్రపంచ ప్రయాణాలు ఇంకా సంపూర్ణంగా రికవరీ అవ్వలేదన్నారు. గత 17 ఏళ్ల డేటాని విశ్లేషించి ఈ తాజా ర్యాంకింగ్స్‌ని నిర్ణయించామని చెప్పారు. కాగా వీసా లేకుండా ఎన్ని దేశాల్లోకి ప్రవేశం లభిస్తోందనేదాన్నిట్టి సంపన్న వర్గాలు, ప్రభుత్వాలు పౌరసత్వం విలువని అంచనా వేసుకుంటాయి.