DailyDose

ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి – TNI తాజా వార్తలు

ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి  – TNI  తాజా వార్తలు

* శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్లు ఉంటే వారిని వెంటనే తప్పించాలని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం బైరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో మన ప్రభుత్వానికి ఎసరు పెట్టే వారిని వెంటనే తప్పించండి. అటువంటి వాలంటీర్ల జాబితా తయారు చేసి తన దగ్గరికి పంపాలని.. కార్యకర్తలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌-2016ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్‌ 10ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ సి.రాజేంద్రప్రసాద్, కో-కన్వీనర్లు రామ్మోహన్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌, ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి సీఎంను కలిశారు.

*కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్‌ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీంలోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు.

*రాష్ట్రవ్యాప్తంగా 224 ఆలయాలకు సంబంధించి రూ.3 వేల కోట్ల ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. స్థానిక నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉత్తర్వులతో ఆక్రమణలకు గురైన ఆలయ స్థలాలు స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు చేపట్టామన్నారు. 2021 మే 7 నుంచి ఈ ఏడాది జూలై 15వ తేది వరకు 224 ఆలయాలకు సొంతమైన 1906.39 ఎకరాల భూములు, 497 గ్రౌండ్ల 1064 చ.అ స్థలాలు, 53 గ్రౌండ్ల 1867 చఅ భవనాలు మొత్తం రూ.3000.21 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకొని సంబంధిత ఆలయాలకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు

*కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టనున్న రాహుల్‌గాంధీ రాష్ట్రంలో అక్టోబరు 2,3,4 తేదీల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్‏ను బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కన్నియాకుమారి నుంచి 3,500 కి.మీ మేర 148 రోజులు పాదయాత్ర చేపట్టనున్నారు. అక్టోబరు 2వ తేది గాంధీ జయంతి రోజున కన్నియాకుమారి గాంధీ స్మారక మందిరంలో నివాళులర్పించనున్నారు. రెండు రోజులు ఆ జిల్లాలో పర్యటించి మూడోరోజు కళియకావిలై నుంచి తిరువనంతపురం వెళ్లనున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆయన నియోజకవర్గం వయనాడులో ఆయన పర్యటించనున్నారు.

* కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా నగరంలోని ఈడీ ఆఫీస్ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. మోడీ హటావో , దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఏల్పీ నేత భట్టి మధుయాష్కీ అంజన్ కుమార్ యాదవ్( పొన్నాల లక్ష్మయ్య షబ్బీర్ అలీ( నిరసన దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నిరసనతో బషీర్ బాగ్ రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది

*తెలంగాణ బీజేపీ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మార్పు జరిగింది. తెలంగాణ ప్రస్తుత ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాసులను బీజేపీ జాతీయ నాయకత్వం పంజాబ్‌కు బదిలీ చేసింది. అలాగే నాలుగు రాష్ట్రాలకు ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీలను మారుస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీగా అజయ్‌ జంబ్వాల్‌ ), కర్ణాటక ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీగా రాజీవ్‌ దివి పశ్చిమ బెంగాల్ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీగా సతీశ్ దొంద ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా… తెలంగాణకు ఆర్గనైజింగ్‌ సెక్రటరీని నియామకాన్ని జేపీ నడ్డా ఇంకా పూర్తి చేయలేదు. పార్టీ సంస్థాగతపరంగా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ పదవి కీలకం కానుంది. ఈ క్రమంలో సంస్థాగతమైన మార్పుల్లో భాగంగా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేసింది.

*గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభైంది. బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ బైక్ యాత్రను మొదలు పెట్టారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించేందుకు ప్రజా గోస బీజేపీ భరోసా పేరుతో కమలం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది.

* భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరదలకు దెబ్బతిన్న రోడ్లు, ఇళ్లు, పొలాల పరిశీలించారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరద నష్టంపై కలెక్టర్‌ భవిష్‌ మిశ్రాతో కేంద్ర బృందం చర్చించింది. రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఆరుగురు సభ్యులతో కూడిన బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. వరదల వేళ తీవ్రంగా నష్టపోయిన భద్రాచలంతోపాటు కడెం ప్రాజెక్టు ను ఆ బృందం సందర్శించనుంది.

*తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్ట్ లోకి చేరుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 1,32,277 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 93,423 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా ఉంది.

*అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26 నుంచి 29 తేదీల్లో ఢిల్లీలో జరిగే మహా పడావ్‌(బైఠాయింపు)ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలకు కనీసవేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని, పెన్షన్‌, ఈఎ్‌సఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని ఐసీడీఎ్‌సలను బలోపేతం చేయాలని, నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహాపడావ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

*తిరుపతి: నగరంలోని ఎంఆర్ పల్లెలో గల ప్రైవేట్ కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ లెక్చరర్ వద్ద ఏటీఎం కార్డుతో రూ.50వేల నగదును జూనియర్ లెక్చరర్ మాయం చేశాడు. అంతేకాకుండా ఇద్దరు విద్యార్థినులు నుంచి మరో 25 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. లెక్చరర్ వ్యవహారంపై ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకుండాపోయింది. కాగా.. పారిపోయిన జూనియర్ లెక్చరర్‌పై ఉత్తరాంధ్రలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.

*కృష్ణా జిల్లా తెంపల్లికి వస్తున్న టీడీపీ నేతల ను పెద్ద ఆవుటుపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి ప్రవేశం లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు మాత్రం వందల సంఖ్యలో తిరగవచ్చు కానీ…తాము మాత్రం వెళ్ళకూడదు అని ఆకాంక్షలు ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను మాత్రమే తెంపల్లి గ్రామంలోనికి పంపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

*కడప: జిల్లాలోని పులివెందులలో దారుణం జరిగింది. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళేరోడ్డులో ట్రాన్స్ జెండర్‌(Transgender)పై 15 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి చేసి మరీ అత్యాచారం జరిపి కంప చెట్లలో పడేసి వెళ్లారని బాధితురాలి తరపున ట్రాన్స్ జెండర్లు వెల్లడించారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరంలేక దిశయాప్‌(Dishaap)కు కాల్ చేసిన తర్వాత స్పందించారని తెలిపారు. అత్యాచారం ఘటనలో తమకు న్యాయం చేయకపోతే పులివెందుల ట్రాన్స్ జెండర్స్ అందరం కలసి ఆత్మహత్య చేసుకుంటామని ట్రాన్స్‌ జెండర్లు మీడియాకు తెలియజేశారు.

*వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వరద ఉధృతి తగ్గినప్పటినప్పటికీ అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అటు చదువులు కూడా బురదల్లోనే జరుగుతున్నాయి. జనం వరద కష్టాల్లో ఉంటే విద్యార్థులు పాఠశాలలకు రావాలాని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అన్ని పాఠశాలలు ఎక్కడికక్కడ బురద మెటల మయంగా ఉన్నాయి. ఎక్కడా బురదను తొలగించకుండా అధికారులు పాఠశాలలను తెరిచారు. పాఠశాలకు వెళ్లే క్రమంలో పిల్లలు బురదలో జారి పడిపోతున్నారు. ఓ పక్క విషసర్పాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నా పాఠశాలలు తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

*కర్నూలు: జిల్లాలో పాన్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాన్యం మండలం పిన్నాపురంలో ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. పిన్నాపురంను ఓర్వకల్లులో విలీనం, గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేసిన జలాశయం కరకట్ట పనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యే నిర్వహించిన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామ సమస్యలపై పిన్నాపురంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులు ఈరోజు భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

*కర్నూలు: జిల్లాలో పాన్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పాన్యం మండలం పిన్నాపురంలో ఆందోళన కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. పిన్నాపురంను ఓర్వకల్లులో విలీనం, గ్రీన్ కో కంపెనీ ఏర్పాటు చేసిన జలాశయం కరకట్ట పనుల బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యే నిర్వహించిన గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామ సమస్యలపై పిన్నాపురంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులు ఈరోజు భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.

*కాలంలోపాటు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బోంబే హైకోర్టు ఆదేశించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి సాంఘిక సంస్కర్తల రచనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పింది. అనేక మంది సాంఘిక సంస్కర్తల చేతిరాత ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిందని, కానీ దురదృష్టవశాత్తూ వాటి గురించి చాలా మందికి తెలియదని పేర్కొంది.

*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై పలువురికి డాక్టరేట్‌లు, స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, 73 మందికి డాక్టరేట్‌ పట్టాలను, 21 మందికి ఎంఫిల్‌ పట్టాలను, వివిధ విభాగాల్లో 112 మందికి గోల్డ్‌ మెడల్స్‌ను అందజేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మంత్రుల పీఆర్‌ఓలు మహేశ్‌, లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు డాక్టరేట్‌లను అందుకున్నారు. కాగా, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎన్‌. మృదుల డాక్టరేట్‌తో పాటు గోల్డ్‌ మెడల్‌నూ పొందారు. ‘తిక్కన సీస పద్యాలు, పరిశీలన’ అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. మహా భారతంలో తిక్కన రాసిన 15 పర్వాలను, నిర్వచనోత్తర రామాయణాన్ని అనేక సార్లు చదివానని ఆమె వెల్లడించారు.

*రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (డెహ్రాడున్‌)లో ఎనిమిదో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశం కోరే అభ్యర్థులు డిసెంబర్‌ 3వ తేదీన జరిగే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే విద్యార్థులు అక్టోబర్‌ 15వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలి.

*ప్రముఖ తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక సాహితీ అవార్డుకు ఈయేడు ప్రముఖ కవి డాక్టర్‌ వేణు సంకోజు ఎంపికయ్యారు. దాశరధి జన్మదినం సందర్భంగా ఈనెల 22న ప్రభుత్వం డాక్టర్‌ వేణు సంకోజుకు ఈ అవార్డు కింద రూ. 1,01,116నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికను ప్రదానం చేస్తుంది.

*ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వార్షిక పరీక్షలు ఈ నెల 22 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ కే.రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ పరీక్షలతో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలకు సంబంధించిన పరీక్షలుంటాయని, హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం నుంచి 5,855మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను ఇగ్నో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

*వానాకాలం పంటల సాగు విస్తీర్ణం భారీగానే నమోదువుతోంది. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇప్పటివరకు 63.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సాగైన విస్తీర్ణంలో అత్యధికంగా పత్తి పంట ఉంది. మొత్తం సాగు విస్తీర్ణంలో పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.61 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది ప్రతిపాదిత సాగు లక్ష్యం 15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.95 లక్షల ఎకరాల్లో సాగైంది. సోయాబీన్‌ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.39 లక్షల ఎకరాల్లో వేశారు. వరి ప్రతిపాదిత లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 6.48 లక్షల ఎకరాల్లో వేశారు.

*ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) కుడికాలువ నిర్మాణ పనులు చేపడుతోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేసినా బృందాన్ని పంపించి తనిఖీ చేయించడంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) విఫలమయిందని ఆక్షేపించింది. ఈ మేరకు కే ఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ బుధవారం ఒక లేఖ రాశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి వచ్చేదాకా కుడి కాలువ పనులు చేపట్టడానికి వీల్లేదని గుర్తు చేసింది. తక్షణమే పనులను అడ్డుకోవడానికి వీలుగా చర్యలు తీసుకొని, ఆర్డీఎస్‌ కుడికాలువ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించడానికి బృందాన్ని పంపించాలని కోరింది.

*గుంతకల్లు నుంచి బళ్లారి, రాయదుర్గం, చిక్కజాజూర్‌ వరకు 25వ తేదీ నుంచి ప్యాసింజర్‌ రైలు పునరుద్ధరించనున్నట్లు రైల్వే ఏటీఎం సురేష్‌ రెడ్డి తెలిపారు. కొవిడ్‌ -19 నేపథ్యంలో రైలును నిలిపిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల 25వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన బుధవారం విడుదల చేశారు. గుంతకల్లు నుంచి చిక్కజాజూర్‌ వెళ్లే 07586 నెంబర్‌ గల ప్రత్యేక ప్యాసింజరు 25వ తేదీ నుంచి ఉదయం 7.45 గంటలకు గుంతకల్లులో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు చిక్కజాజూర్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా చిక్కజాజూరు నుంచి గుంతకల్లుకు 07585 నెంబర్‌గల ప్యాసింజర్‌ రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు చిక్కజాజూర్‌లో బయలుదేరి రాత్రి 9.05 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఈ రైళ్లు బంటనహాళ్‌, బేవినహాళ్‌, శంకరగుమ్మనూరు, సాకిబండ, వీరా పుర, హగరి, హద్దినగుండు, బళ్లారి, ఓబుళాపురం, సోమలా పురం, రాయదుర్గం, మొలకాల్మూరు, బొమ్మనగుండనకెరె, గరణి, చెళ్లకెర, బేతనహళ్లి, చిత్రదుర్గ, హలీమూర్‌, అమృతదివ, చిక్కనదవాడి రైల్వే స్టేషనలో నిలపనున్నట్లు తెలిపారు.

*ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేనిపక్షంలో కేంద్రం ఏంచేస్తుందో దాన్ని సాధించాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ఆవేశం ఇప్పుడు ఏమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల ముందు, హోదా గురించి చేతులు కట్టుకోనైన అడగవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కేసులకు భయపడి చేతులు కట్టుకొని, నాడు హోదాను తాకట్టు పెట్టారని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. అసలు కేసులే లేని చంద్రబాబు వాటికి భయపడి హోదాను తాకట్టు పెడితే, 32 ఆర్థిక నేరాల కేసుల అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి వాటికి భయపడి నోరు విప్పడం లేదని ప్రజలు అనుకునే అవకాశం లేదా? అని ప్రశ్నించారు. ‘‘హోదా తీసుకువస్తాడని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను జగన్‌ నడి సముద్రంలో ముంచారు. పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారు.

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై పలువురికి డాక్టరేట్‌లు, స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, 73 మందికి డాక్టరేట్‌ పట్టాలను, 21 మందికి ఎంఫిల్‌ పట్టాలను, వివిధ విభాగాల్లో 112 మందికి గోల్డ్‌ మెడల్స్‌ను అందజేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మంత్రుల పీఆర్‌ఓలు మహేశ్‌, లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు డాక్టరేట్‌లను అందుకున్నారు. కాగా, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎన్‌. మృదుల డాక్టరేట్‌తో పాటు గోల్డ్‌ మెడల్‌నూ పొందారు. ‘తిక్కన సీస పద్యాలు, పరిశీలన’ అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. మహా భారతంలో తిక్కన రాసిన 15 పర్వాలను, నిర్వచనోత్తర రామాయణాన్ని అనేక సార్లు చదివానని ఆమె వెల్లడించారు.

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై పలువురికి డాక్టరేట్‌లు, స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా, 73 మందికి డాక్టరేట్‌ పట్టాలను, 21 మందికి ఎంఫిల్‌ పట్టాలను, వివిధ విభాగాల్లో 112 మందికి గోల్డ్‌ మెడల్స్‌ను అందజేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మంత్రుల పీఆర్‌ఓలు మహేశ్‌, లక్ష్మీనారాయణ, పలువురు ప్రముఖులు డాక్టరేట్‌లను అందుకున్నారు. కాగా, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఎన్‌. మృదుల డాక్టరేట్‌తో పాటు గోల్డ్‌ మెడల్‌నూ పొందారు. ‘తిక్కన సీస పద్యాలు, పరిశీలన’ అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించింది. మహా భారతంలో తిక్కన రాసిన 15 పర్వాలను, నిర్వచనోత్తర రామాయణాన్ని అనేక సార్లు చదివానని ఆమె వెల్లడించారు.

*దూర విద్యలో పది, ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ సార్వత్రిక పీఠం డైరెక్టర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో సాధారణ కోర్సులతో పాటు వృత్తివిద్యా కోర్సులకూ ఈ పరీక్షలు జరుగుతాయని వివరించారు.

*నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు తప్పకుండా ఈ ఏడాది సెప్టెంబరు 30లోగా నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (ఎన్‌ఎ్‌సపీ)లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. లేనిపక్షంలో వారికి ఎప్పటికీ స్కాలర్‌షిప్‌ రాదని స్పష్టంచేశారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గత చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టులో నిధులు దుర్వినియోగం అయ్యాయనే కారణంతో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చార్టెడ్‌ అకౌంటెంట్‌(ఏ25) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. కోర్టు తనకు రక్షణ కల్పించిందని ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భావిస్తే ఫలవంతమైన వి చారణకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడింది. పిటిషనర్‌ కొనుగోలు చేసిన మూడు షెల్‌ కంపెనీల్లో రెండిటిలో అతని భార్య డైరెక్టర్‌గా ఉన్నట్లు దర్యాప్తు సందర్భంగా అధికారులు గుర్తించారని పేర్కొంది. రూ.371 కోట్లు మేర ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్న ఇది తీవ్రమైన సామాజిక- ఆర్థిక నేరంగా అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు.

*సీఐడీ చీఫ్‌, అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ యూనిఫాం తీసి వైసీపీ కండువా వేసుకోవాలని మహాసేన రాజేశ్‌ విమర్శించారు. సునీల్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబేడ్కర్‌ మిషన్‌కు చెందిన రాజేశ్‌పై శ్రీకాకుళంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు జారీ చేసిన నోటీసులకు బదులిచ్చేందుకు బుధవారం ఆయన శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రావులపాలెం ఘటనలో దళితులను అక్రమంగా అరెస్టు చేశారు. అంబేడ్కర్‌ విదేశీ విద్యను పేరు మార్చి జగన్‌ పేరు పెట్టుకున్నారు. అంబేడ్కర్‌ మిషన్‌ పేరుతో అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు. మహాసేనకు చెందిన మహిళలను ఎయిమ్స్‌కు చెందినవారు విమర్శించారు. దీనిపై తెలంగాణకు చెందిన వ్యక్తి అక్కడి నుంచి మాట్లాడారు. ఇందులో నేనే మాట్లాడించానని ఏ2గా నాపై కేసు నమోదు చేశారు. సునీల్‌కుమార్‌కు చిన్న సూచన చేస్తున్నాం. అంబేడ్కర్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహిస్తున్నారుగా… ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో దళితులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించరు? దళితుల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలి’ అని రాజేశ్‌ సూచించారు.

* భూములకు పరిహారం చెల్లింపుపై వివాదంతో నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగమణి ఇతర అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో తహశీల్దార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జల విద్యుత్‌, పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల్లో భాగంగా పిన్నాపురంవాసులు భూములు కోల్పోయారు. అంతేగాకుండా అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్‌ పనుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
*కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధిత తల్లిండ్రులు మదనపల్లె ఏడీజే కోర్టును ఆశ్రయించి న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం విజయ్‌నగర్‌కాలనీకి చెందిన షేక్‌ మౌలా నీరుగట్టువారిపల్లెలో కలర్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. ఇతడికి ముగ్గురు కుమారులున్నారు. పెద్దకుమారుడు ఎస్‌.మునీర్‌ (23) కార్పెంటర్‌. రెండేళ్ల కిందట అనారోగ్యం బారినపడడంతో తిరుపతి రుయా వైద్యులు పరీక్షించి రెండు కిడ్నీలు పాడయ్యాయని చెప్పారు.

* విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవెటీకరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల యూనియన్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

* కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని జలాశయాలకు ఎగువ నుంచి వరద స్థిరంగా కొనసాగుతోంది. గత వారం రోజులుగా వస్తోన్న వరదతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో క్రమంగా జలకళ సంతరించుకుంటోంది. శ్రీశైల జలాశయానికి బుధవారం 2,32,927 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను, ఇప్పటికి 176.33 టీఎంసీల నీరు చేరింది. నాగార్జునసాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 174.86 టీఎంసీల నిల్వ నమోదైంది. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోనికి 4,588 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠ(3.07 టీఎంసీలు) స్థాయికి చేరింది. జూరాల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 8.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తుంగభద్ర డ్యామ్‌ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 100.52 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి 1,49,931 క్యూసెక్కుల వరద వస్తుంటే, దిగువకు 1,26,409 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి ద్వారా 19,070 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తోంది. అలాగే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యూలేటర్‌ ద్వారా 10 వేల క్యూసెక్కుల వరదను సీమ కాలువలకు మళ్లిస్తోంది. తుంగభద్ర జలాశయం గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులకుగాను ప్రస్తుతం 1631.68 అడుగులకు చేరింది. 31 గేట్లు ఎత్తి దిగవకు నీరు విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లా సుంకేశుల జలాశయంలో నీటిమట్టం 949.15 అడుగులు ఉంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్లు(ప్రస్తుతం 1,47,482 క్యూసెక్కులు) దిగువ శ్రీశైలానికి, 2,012 క్యూసెక్కులు కేసీ కాలువకు విడుదల చేస్తున్నారు.

*బెజవాడ బ్యూటీ.. బిల్లుపాటి దుర్గా శివనాగ మల్లిక విశ్వవేదికపై మెరిశారు. బల్గేరియాలోని బర్గస్‌ పట్టణంలో జరిగిన మిసెస్‌ ప్లానెట్‌ అందాల పోటీల్లో విజేతగా సత్తాచాటారు. ఆరు రోజులపాటు సాగిన ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 20 మంది మహిళలు ఫైనల్‌కు చేరుకోగా.. టాలెంట్‌ విభాగంలో మల్లిక మిసెస్‌ ప్లానెట్‌ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మల్లిక 2019లో మిసెస్‌ అమరావతి, 2020లో మిసెస్‌ ఆంధ్రా, 2021లో మిసెస్‌ ఇండియాగా గెలుపొందారు.

*ఎన్నికలు ఏవైనా సరే.. వైసీపీ మాత్రం అదే అరాచకం, అవే అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయు డు ధ్వజమెత్తారు. తిరుపతి టౌన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో గెలిచే దమ్ములేక వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసి, ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారని ఆరోపించా రు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఏ కారణంతో టీడీపీ నేతల్ని హౌస్‌ అరెస్టులు చేశారని నిలదీశారు. తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికల నిర్వహణలో పోలీసుల తీరును ఖండించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించి, నియంతల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఆ నిధులతో 3500 ఆలయాల్లో బోనాల నిర్వహణ ఏర్పాట్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆలయ నిర్వహకులకు చెక్కులు అంజేశారు.

*పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఆపోలో హాస్పిట‌ల్ నుంచి ఇవాళ ఉద‌యం డిశ్చార్జ్ అయ్యారు. క‌డుపునొప్పి రావ‌డంతో ఆయ‌న్ను బుధ‌వారం హాస్పిట‌ల్‌లో చేర్పించారు. సీఎం భ‌గ‌వంత్ మాన్‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన స‌మ‌యంలో ఆయ‌న భార్య‌, సోద‌రి ప‌క్క‌నే ఉన్నారు. ఉద‌ర సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డిన నేప‌థ్యంలో డాక్ట‌ర్ల బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీఎం భ‌గ‌వంత్‌కు చికిత్స జ‌రిగింది. ఇక బుధవారం అమృత్‌స‌ర్ జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో సింగ‌ర్ సిద్ధూ హ‌త్య కేసులో నిందితుడైన ఇద్ద‌రు గ్యాంగ్‌స్ట‌ర్ల‌ను పోలీసులు చంపేశారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్ పోలీసుల‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. ఈనెల 21న డాక్ట‌ర్ గురుప్రీత్ కౌర్‌ను మాన్ పెళ్లాడిన విష‌యం తెలిసిందే

*తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం మరింత తగ్గుముఖం పట్టింది. ఈ బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 14.5 అడుగుల వరకు నీరు ఉంది. ఇక్కడి నుంచి 5,400 క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు, సముద్రంలోకి 13.94 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహం తగ్గుతుండడంతో రెండోస్థాయి హెచ్చరికను కొనసాగిస్తున్నారు.కాగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి 2,22,935 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్ధ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 21,729 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

*నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో రాష్ట్ర విపత్తుల నివారణ బృందానికి చెందిన 170 మంది సభ్యులు ఊటీలో విధుల్లో అప్రమత్తంగా ఉన్నారు.