Politics

పేదలను జగన్‌ సర్కార్‌ మోసం చేస్తున్నది – TNI రాజకీయ వార్తలు

పేదలను జగన్‌ సర్కార్‌ మోసం చేస్తున్నది  – TNI  రాజకీయ వార్తలు

* జగన్‌ సర్కార్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. బియ్యం కుంభకోణానికి సర్కార్‌లోని పెద్దలకు సంబంధమున్నదని ఆరోపించారు. మరోవైపు పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతున్నదని చెప్పారు.

*బీజేపీ నేతలకు మమత వార్నింగ్‌..
2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆకాక్షించారు . అందుకోసం వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు ‘బీజేపీ తిరస్కరణ ఎన్నికలు’ కావాలని పిలుపునిచ్చారుబీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై ధ్వజమెత్తారు మమత. బీజేపీకి బుర్ర పనిచేయడం లేదని, మరమరాలు, స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాదితే ప్రజలు ఏం తినాలని ప్రశ్నించారు. అనారోగ్యంతో ప్రజలు ఆస్పత్రిలో చేరినా దానికి కూడా డీఎస్టీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.కరోనా కారణంగా రెండేళ్ల పాటు అమరవీరుల దినోత్సవాన్ని టీఎంసీ నిర్వహించలేదు. మమత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరుగుతున్నందు వల్ల భారీగా ఏర్పాట్లు చేశారు. సభపైకి ఎల్‌పీజీ సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మమత. బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ తమ క్యాడర్‌కు శిక్షణ ఇప్పించేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

*టీడీపీ ప్రభుత్వం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది : ఏపీ మంత్రి
టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఏపీ ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్పిల్‌వే ఆపేసి డయాఫ్రం వాల్‌ నిర్మించారని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా కాఫర్‌డ్యామ్‌ పూర్తికాకుండా డయాఫ్రమ్‌వాల్‌ కట్టి తప్పు చేశారని మండిపడ్డారు.జగన్‌ సర్కార్‌ తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము సాధ్యమైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం వద్ద పునాధులతో ఉన్న స్పిల్‌వేను, అప్రోచ్‌వేను పూర్తి చేశామని వివరించారు. ఇటీవల వచ్చిన 26 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడం జరిగిందన్నారు.

*దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు: Gutta
దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్( గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బాగున్నాయని పార్లమెంట్‌లో కితాబు ఇచ్చినా రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. కొర్రీలను పెడుతూ తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్నీ రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు బతకడం కష్టంగా మారిందన్నారు. స్మశానవాటికలకు కూడా జీఎస్టీ పెడుతున్నారని… జీఎస్టీ(GST)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే ఎక్కువగా 100 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదని విమర్శించారు. సీబీఐ ఈడీలతో బెదిరింపులకు గురి చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గుత్తాసుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

*ఏపీపై చంద్రబాబు దుష్ప్రచారం : సజ్జల
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులకు వస్తున్న ప్రజాధారణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు.
గురువారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌ లో టీడీపీ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాదానం ఇస్తూ టీడీపీ హయాంలో లక్షా 10 వేల కోట్లకు లెక్కలు లేవని స్పష్టం చేశారని వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు విధానాలతో చరిత్రహీనులుగా మిగిలిపోయారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

*ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదు: ఎంపీ Komati reddy
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం పెట్టిన నేషనల్ ఇరాల్డ్ కేసులో అనారోగ్యంతో ఉన్న సోనియాగాంధీని ఈరోజు విచారణకు పిలిచారన్నారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సోనియాగాంధీ ఈడీ విచారణతో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా బాధపడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఆందోళన నేపథ్యంలోనే క్యాడర్‌ను దెబ్బతీసేందుకు ఈడీ అధికారులు అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు

*కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుంది: Sanjay
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ(BJP) ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ నుంచి చేపట్టిన ‘‘ప్రజాగోస – బీజేపీ భరోసా’’ బైక్ ర్యాలీలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కారణం సీఎం కేసీఆరే అని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం..ప్రజలనేం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ‘‘ప్రజాగోస – బీజేపీ భరోసా’’ అని స్పష్టం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేయడం లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్‌ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈడీ విచారణపై కాంగ్రెస్‌ నేతలవి అనవసరపు ఆరోపణలన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఆగస్ట్‌ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్‌ ప్రకటించారు.

*శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ: చంద్రబాబు
శ్రీలంక ప్రజల కంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే ఇంకా వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదని వ్యాఖ్యానించారు.వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు. ఆచంట నియోజకవర్గం ఇలపర్రు వద్ద స్థానికులు చంద్రబాబు కాన్వాయ్‌ను ఆపడంతో అక్కడ ఆయన మాట్లాడారు.దేశంలో అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని.. అత్యధిక అప్పులు చేసింది కూడా ఏపీయే అని చంద్రబాబు విమర్శించారు. బాదుడే బాదుడుతో ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. పోలవరాన్ని రివర్స్‌ గేర్‌లో వెనక్కి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అంతకుముందు పెనుగొండ మండలం నశిపూడిలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ వరద బాధితుల సమస్యలు తెలుసుకున్నారు

*ఏపీ రుణాల సేకరణపై లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ రఘురామ
ఏపీ (AP)లో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై గురువారం లోక్ సభ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. దీంతో ఆయనను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు, రఘురామల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్పే రుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు మార్గాని భరత్ , వంగ గీత మాట్లాడుతూ రఘురామ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రఘురామ అన్నారు. ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. ఈ క్రమంలో రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో సహనాన్ని కోల్పోయిన రఘురామ… సిట్ డౌన్ అంటూ వైసీపీ ఎంపీలపై అరిచారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు.

*బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే..జగ్గారెడ్డి
బీజేపీ (BJP) సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే సోనియా కుటుంబాన్ని విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఈడీ విచారణ‌కు సోనియాను పిలువడాన్ని నిరసిస్తూ.. జిల్లా కేంద్రం‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా కుటుంబం అవినీతికి పాల్పడిందని ఈడీ విచారించడం సిగ్గుచేటని, మీడియా రంగం నష్టాల బాటలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నేషనల్ హెరాల్డ్‌ పత్రికలో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల నుంచి సోనియా కుటుంబాన్ని దూరం చేసే కుట్రలో భాగమే ఈడీ విచారణ అని తెలిపారు.

*కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోంది: కేవీపీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని కేంద్రం పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈడీ విచారణలో కథా, స్క్రీన్‌ప్లే, నిర్మాత ప్రధాని మోదీ అని, ఎన్ఫోర్సర్ అమిత్‌షా అని, ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని అన్నారు. భారత్ జోడో యాత్రను ఓవర్‌ షాడో చేయడమే బీజేపీ లక్ష్యమని, గాంధీ , నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక వ్యర్థ ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళు సాధించేది ఏమీ లేదని అన్నారు. దీనివల్ల గాంధీ, నెహ్రూ ఫ్యామిలీకి ఇమేజ్ పెరుగుతుందే తప్ప డ్యామేజ్ఉం డదన్నారు. కాంగ్రెస్ నేతల్లో మరింత యూనిటీ వస్తుందన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అగ్ర నేతలు ఈడీ విచారణ నుంచి బయటపడతారని కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

*జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు: షర్మిల
జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పట్టాలు ఇస్తామని 8 ఏళ్లవుతున్నా ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో షర్మిల ముఖాముఖి మాట్లాడారు. ఇటీవల పోడు భూముల్లోని గ్రామస్థుల గుడిసెలను పోలీసులు తొలగించారని రైతులు తెలిపారు. 2500 ఎకరాల పోడు భూములపై తమకు హక్కు ఉందని అన్నారు. బట్టలు ఊడదీసి కొట్టారని షర్మిలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నుంచి సాగు చేసుకుంటున్నవారికి పట్టాలివ్వకపోవడం దారుణమని, భూముల కోసం పోరాడుతున్న 52 కుటుంబాలను హింసిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

*కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుంది: Sanjay
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ నుంచి చేపట్టిన ‘‘ప్రజాగోస – బీజేపీ భరోసా’’ బైక్ ర్యాలీలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కారణం సీఎం కేసీఆరే అని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం..ప్రజలనేం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ‘‘ప్రజాగోస – బీజేపీ భరోసా’’ అని స్పష్టం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేయడం లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్‌ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈడీ విచారణపై కాంగ్రెస్‌ నేతలవి అనవసరపు ఆరోపణలన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఆగస్ట్‌ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్‌ ప్రకటించారు.

*ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదు: ఎంపీ Komati reddy
కాంగ్రెస్అ ధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఈడీ విచారణకు పిలవడం ఇంతకన్నా దారుణ విషయం ఇంకేమీ లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… స్వాతంత్ర్యం కోసం పెట్టిన నేషనల్ ఇరాల్డ్ కేసులో అనారోగ్యంతో ఉన్న సోనియాగాంధీని ఈరోజు విచారణకు పిలిచారన్నారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సోనియాగాంధీ ఈడీ విచారణతో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా బాధపడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఆందోళన నేపథ్యంలోనే క్యాడర్‌ను దెబ్బతీసేందుకు ఈడీ అధికారులు అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు.

*సీఎం కేసీఆర్‌కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా..: రాజాసింగ్
‘‘మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణ లో రాబోతున్నాయి… సీఎం కేసీఆర్‌ కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా’’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం బోధన్ మండలం నర్సాపూర్‌‌లో ప్రజల గోస- బీజేపీ భరోసా బైక్ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మంత్రులు, ఎమ్మెల్యేలలో తమ పదవులపై నమ్మకం లేదని, ఎప్పుడు ఊడుతుందో తెలియని భయంతో ఉన్నారని తెలిపారు. రెండేళ్లలో వరద సాయం కోసం ఇచ్చిన ఐదు వందల కోట్లను ఎక్కడ ఖర్చు చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్(TRS) కార్యకర్తల కోసమే వరద సాయం అడుగుతున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ(GHMC)లో రూ.10 వేలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళే పంచుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ(Modi)ని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. జీఎస్టీ అంశాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు.

*దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు: Gutta
దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం విధానాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు బాగున్నాయని పార్లమెంట్‌లో కితాబు ఇచ్చినా రాష్ట్రంలో 16 బృందాలతో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. కొర్రీలను పెడుతూ తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్నీ రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు బతకడం కష్టంగా మారిందన్నారు. స్మశానవాటికలకు కూడా జీఎస్టీ పెడుతున్నారని… జీఎస్టీ(GST)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కంటే ఎక్కువగా 100 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసినా రాష్ట్రంలో ఒక్క జాతీయ ప్రాజెక్టును ఇవ్వలేదని విమర్శించారు. సీబీఐ , ఈడీ లతో బెదిరింపులకు గురి చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని గుత్తాసుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు: సోము వీర్రాజు
రేషన్ బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్మో సం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదన్నారు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని అన్నారు. కేంద్రం గైడ్ లైన్స్‌ను పరిగణలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదని తెలిపారు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాకినాడ కేంద్రం గా బియ్యం అక్రమ రవాణా సాగుతుందని, ఇతర దేశానికి ఇక్కడ నుంచే భారీగా వెళుతుందని చెప్పడం విశేషమన్నారు. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు‌ వివరిస్తామని చెప్పారు. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా అంటూ వ్యాఖ్యలు చేశారు. వీటి వెనుక ఉన్న అందరి‌ బాగోతాలు బయట పెడతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జగన్ ప్రభుత్వం స్పందించదా అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు

* పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోంది: సోము వీర్రాజు
పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఏపీ (AP) బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, పోలవరంను ప్రశ్నిస్తే… తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించి నట్లేనని, రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారన్నారు. విభజన తరువాత భద్రాచలం ఆలయాన్ని , ‌మరో రెండు మండలాలు‌ తెలంగాణకు కేటాయించారన్నారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్‌కు‌ నీరు ఇవ్వాలని‌ ఆనాడు వైయస్ పనులు చేపట్టారని, దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు.పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని, అప్పుడో మాట.. ఇప్పుడో మాట అనేది సరికాదని సోమువీర్రాజు అన్నారు. పోలవరం విషయంలో సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15రోజులకొక సారి రివ్యూ చేస్తున్నారని చెప్పారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు. ఏపీలో పరిణామాలను బీజేపీ‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తామని సోమువీర్రాజు అన్నారు.

* కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోంది: కేవీపీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ని కేంద్రం పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈడీ విచారణలో కథా, స్క్రీన్‌ప్లే, నిర్మాత ప్రధాని మోదీ అని, ఎన్ఫోర్సర్ అమిత్‌షా అని, ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని అన్నారు. భారత్ జోడో యాత్రను ఓవర్‌ షాడో చేయడమే బీజేపీ లక్ష్యమని, గాంధీ , నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక వ్యర్థ ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళు సాధించేది ఏమీ లేదని అన్నారు. దీనివల్ల గాంధీ, నెహ్రూ ఫ్యామిలీకి ఇమేజ్పె రుగుతుందే తప్ప డ్యామేజ్ఉం డదన్నారు. కాంగ్రెస్ నేతల్లో మరింత యూనిటీ వస్తుందన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అగ్ర నేతలు ఈడీ విచారణ నుంచి బయటపడతారని కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆమె వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.

*మహాసేన రాజేష్‌ను అణచివేయాలని ‌చూడటం దుర్మార్గం: పోతిన మహేష్ప్ర
శ్నించే గొంతుక మహాసేన రాజేష్‌ ను అణచివేయాలని ‌చూడటం దుర్మార్గమని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘ మంత్రి తానేటి వనిత .. పోలీస్ కేసులతో ఇబ్బంది పెట్టడం అప్రజాస్వామిక చర్య. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. ఉద్యమ స్వరాన్ని అణచి వేయలనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఉండదు. సమస్యలపై రాజేష్ చేసే ప్రతి పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అంటూ పోతిన వెంకట మహేష్ ట్వీట్ చేశారు.

*శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ.. అందుకే : చంద్రబాబు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని పెనుగొండ మండలం నడిపూడి ఎన్టీఆర్ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ… విపత్తు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే జగన్ పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. దేశంలో అధిక ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని టీడీపీ అధినేత తెలిపారు.శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ, అందుకే ఇంకా తిరుగుబాటు చేయలేదన్నారు. బాదుడే బాదుడు అంటూ జగన్ రెడ్డి సామాన్యుల నడ్డి విరిచారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ గేర్లో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. 72శాతం పూర్తి అయిన పోలవరాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ముంపు మండలాల ప్రజలను ఈ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి: Varla
రాష్ట్రంలో వైసీపీ(YCP) నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… దొంగలంతా కలిసి ఊళ్లు పంచుకున్నట్లు వైసీపీ నేతలు క్వారీలను లాక్కుని వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటకకు చెందిన జనార్ధన్‌నాయుడి క్వారీ, క్రషర్‌ను వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ 2020లో దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. ఎమ్మెల్యే అయింది ప్రజాసమస్యలు పరిష్కరించడానికా?, దోచుకోవడానికా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఎమ్మెల్యే వెంకటగౌడపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

*ఏపీ రుణాల సేకరణపై లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ రఘురామ
ఏపీ లో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై గురువారం లోక్ సభ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు. దీంతో ఆయనను వైసీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు, రఘురామల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తున్నారని రఘురామ ఆరోపించారు. బేవరేజెస్ కార్పొరేషన్పే రుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు మార్గాని భరత్ , వంగ గీత మాట్లాడుతూ రఘురామ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రఘురామ అన్నారు. ఏపీ ప్రభుత్వం కార్పోరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని అన్నారు. ఈ క్రమంలో రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో సహనాన్ని కోల్పోయిన రఘురామ… సిట్ డౌన్ అంటూ వైసీపీ ఎంపీలపై అరిచారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ వైసీపీ ఎంపీలు వివాదానికి దిగారు.

*బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే..జగ్గారెడ్డి
బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే సోనియా కుటుంబాన్ని విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఈడీ విచారణ‌కు సోనియాను పిలువడాన్ని నిరసిస్తూ.. జిల్లా కేంద్రం‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా కుటుంబం అవినీతికి పాల్పడిందని ఈడీ విచారించడం సిగ్గుచేటని, మీడియా రంగం నష్టాల బాటలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నేషనల్ హెరాల్డ్‌ పత్రికలో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల నుంచి సోనియా కుటుంబాన్ని దూరం చేసే కుట్రలో భాగమే ఈడీ విచారణ అని తెలిపారు.

*ఎస్సీ గురుకులాల్లో బోధనా సంస్కరణలు: మంత్రి మేరుగ
రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌ గురుకులాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యా విధానాలను పటిష్ఠం చేస్తున్నామని, దీనికోసం బోధనలో పలు సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బోధనా సంస్కరణల కోసం విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. విద్యార్థులకు ఎక్కువగా శిక్షణ అవసరమైన బోధనాంశాలకు ప్రాధాన్యతనిచ్చేలా గురుకులాల్లో టైంటేబుల్‌ మార్చాలన్నారు. ఐఐటీ, నీట్‌ పరీక్షలకు సంబంధించిన శిక్షణ ఇస్తామని, ఇంగ్లీషు మీడియం బోధించడానికి టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు.

*హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించరా?: వామపక్షాలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తాజాగా పార్లమెంటులో ప్రకటన చేయడాన్ని వామపక్షాలు ఖండిరచాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు పల్లెత్తు మాట మాట్లాడటం లేదని మండిపడ్డాయి. పైగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించడం సిగ్గుచేటని పేర్కొన్నాయి. ఈ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు నిరసించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

*గోదావరి వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: నారాయణ
గోదావరి వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా లో వదర ప్రభావిత ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వరద సమాచారం రెండు రాష్ట్రాలకు 15 రోజుల ముందే అందిందని, అయినా పట్టించుకోకుండా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. పోలవరం కోసం కీచులాడుకోవడానికి ఇదా సమయం? అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే తెరపైకి పోలవరం రాజకీయం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.

* శ్రీలంక దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయి: చంద్రబాబు
దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ (GPF) కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. పదవీ విరమణ ప్రయోజననాలు కూడా ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎక్కడా లేదన్నారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని తెలిపారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందని గుర్తుచేశారు. పోలవరంలో వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే తమపై ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

*ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: అమర్నాథ్‌రెడ్డి
ప్రజాస్వామ్యాన్ని వైసీపీఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరిగిన టౌన్ బ్యాంక్ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రద్దు కోసం ఖాతాదారులతో కలిసి టీడీపీపోరాటం చేస్తుందని ప్రకటించారు. 87శాతం పోలింగ్‌కు వైసీపీ అక్రమ పద్ధతులే కారణమని తెలిపారు. టౌన్‌బ్యాంక్ డిపాజిట్లపై సీఎం జగన్ కన్ను పడిందని అమర్నాథ్‌రెడ్డి దుయ్యబట్టారు.

*ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: జీవీఎల్‌
ప్రత్యేక హోదాముగిసిన అధ్యాయమని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావుమరోసారి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో కేంద్రంపై తప్పుడు ప్రచారాల కోసం ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రత్యేక హోదాపై గతంనే స్పష్టత ఇచ్చామని తెలిపారు. ప్రత్యేక హోదా పై మాట మార్చింది టీడీపీ (TDP), వైసీపేనని విమర్శించారు. రాష్ట్రాల అప్పులకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఓబీసీలను కేంద్ర జాబితాలోకి చేర్చే ప్రతిపాదన రాష్ట్రం నుంచి రాలేదని జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు.

*కేంద్రమంత్రి అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గం: రామకృష్ణ
విభజన హామీలు ఇప్పటికే అమలు చేశామని, కేంద్రం ప్రకటించడాన్ని తప్పు బడుతున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ అవాస్తవాలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రైల్వేజోన్లేదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి నిధులు లేవన్నారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేయకుండా వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పక్కా మోసగాడిగా నేడు చరిత్రలో నిలిచిపోయారని రామకృష్ణ పేర్కొన్నారు.

*ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: అమర్నాథ్‌రెడ్డి
ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరిగిన టౌన్ బ్యాంక్ఎ న్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రద్దు కోసం ఖాతాదారులతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. 87శాతం పోలింగ్‌కు వైసీపీ అక్రమ పద్ధతులే కారణమని తెలిపారు. టౌన్‌బ్యాంక్ డిపాజిట్లపై సీఎం జగన్క న్ను పడిందని అమర్నాథ్‌రెడ్డి దుయ్యబట్టారు.

*ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు: దేవినేని
ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమవిమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… జూన్, జులైలో వరదలు వస్తాయని తెలియని మంత్రి అంబటి రాంబాబు , సీఎం జగన్అ ని అన్నారు. 280 డ్రెడ్జింగ్ కాంట్రాక్టు సీఎం బంధువుకి ఇవ్వాలని సీఎంవో నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పట్ల వ్యూహాత్మక, చారిత్రాత్మక తప్పిదం చేసారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1, 2 అడుగులకు తగ్గించడానికి జగన్ ఒప్పుకున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) వాళ్ల అసెంబ్లీలో మాట్లాడారని… ఆయన మాట్లాడి 37 నెలలు అవుతున్నా జగన్ గానీ, ఆయన మంత్రులు గానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

*చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: నారాయణ
మెగాస్టార్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ వెనక్కి తీసుకున్నారు. భాషా దోషంగా భావించి తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ… చిరంజీవి కుటుంబంతో తనకు ఆత్మీయ సంబంధం ఉందన్నారు. రాజకీయంగా విమర్శలు చేయటం సహజమని నారాయణ పేర్కొన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరైన విషయాన్ని తప్పుపట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. అలాగే పవన్ ఒక ల్యాండ్ మైన్ లాంటివాడని అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు. నారాయణ వ్యాఖ్యలపై చిరు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

*దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా?: లోకేష్రా
జారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డిదొంగ బ్రతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారిని టీడీపీ నాయకులు పట్టుకుంటే వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చెయ్యడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరన్నారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకుల(YCP leaders)పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

*కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీని దాచిపెట్టేందుకు కేసీఆర్ సర్కారు యత్నం: విజయశాంతి
గోదావరి వరదలు ముంచెత్తిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీని దాచిపెట్టేందుకు కేసీఆర్ సర్కారు ప‌డ‌రాని పాట్లు ప‌డుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న రూ.లక్ష కోట్ల ఈ భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలో చిక్కుకున్నాయని విమర్శించారు. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఇంత పెద్ద ఫెయిల్యూర్‌ను దాచి పెట్టేందుకు టీఆర్ఎస్ సర్కారు పొలిటికల్ డైవర్షన్ ఎజెండాను ఎంచుకుందని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రోజుకో కట్టుకథ అల్లుతోందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*కేంద్రంపై టీఆర్ఎస్ వ్యాఖ్యలు సరికాదన్న కిషన్‌రెడ్డి
కేంద్రంపై టీఆర్ఎస్ వ్యాఖ్యలు సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు, రైస్ మిల్లర్ల పరిస్థితిని కేంద్రానికి వివరించామన్నారు. డైరెక్టుగా FCI ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాని సమస్యలు తెలంగాణ లోనే ఎందుకోస్తోందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం 3నెలల నుంచి పంపిణీ చేయడం లేదని తప్పుబట్టారు. రానున్న రోజుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రోక్యూర్మెంట్ చేయాలని, రాష్ట్రాలతో, రైస్ మిల్లర్లతో మాట్లాడామని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

*ఏపీ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడమేంటి?: వైకాపా ఎంపీలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంక పోల్చడమేమిటని పలువురు వైకాపా ఎంపీలు ప్రశ్నించారు. దిల్లీ ఏపీ భవన్‌లో ఎంపీలు తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఒక దేశ పరిస్థితిని మరో దేశంలోని ఒక రాష్ట్రంతో పోల్చలేం. రాష్ట్రాల అప్పులపై మాట్లాడే కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో తగ్గుముఖం పడుతుంటే… అందుకు భిన్నంగా రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు పెరిగాయి. రాష్ట్ర జీఎస్‌డీపీ శ్రీలంక జీడీపీతో పోల్చితే మెరుగ్గా ఉంది. వాస్తవానికి ఏపీ చేసిన అప్పుల కంటే కేంద్రం చేసిన అప్పుల శాతమే ఎక్కువే. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది? ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దు. రాష్ట్రం చేసిన అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలోనే రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి…’ అని వారు వివరించారు. ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమ కార్యక్రమలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను శ్రీలంకతో పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతను గత తెదేపా ప్రభుత్వం తీసుకున్నందున ఇప్పుడు కూడా పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్‌ ప్రణాళిక, ఆకృతి బాధ్యతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివేనని ఎంపీలు తలారి రంగయ్య, ఎన్‌.రెడ్డప్ప, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు.

* తెలంగాణ ఒప్పుకోకున్నా పోలవరం పూర్తి: ఎంపీ జీవీఎల్‌
‘పోలవరం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుంది. నిజం చెప్పాలంటే వాళ్లు ఒప్పుకోవడంతో పని లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా కేంద్ర చట్టంలో ఉంది…’ అని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలానికి ముంపు వస్తుందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని చెప్పారు. ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం నిర్మాణం తథ్యమని స్పష్టం చేశారు. వరద నష్టాల అంశాన్ని పార్లమెంటులోని జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం దృష్టికి తీసుకెళతామని, కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి వివరిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్‌, తెరాస వంటి పార్టీలు ఏదో కారణంతో పార్లమెంటు జరగకుండా నిలువరించి రాజకీయ లబ్ధి పొందాలని తప్పుడు ఆలోచనలు చేస్తున్నాయని ఆరోపించారు.