DailyDose

వ‌న్నె త‌గ్గ‌ని తాజ్ ఆదాయం

వ‌న్నె త‌గ్గ‌ని తాజ్ ఆదాయం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఉన్న పాల‌రాతి క‌ట్ట‌డం తాజ్‌మ‌హ‌ల్‌ను విజిట్ చేస్తున్న విదేశీ టూరిస్టు సంఖ్య గ‌తంతో పోలిస్తే త‌గ్గింది. కానీ దేశంలోని అద్భుత క‌ట్ట‌డాల్లో అత్య‌ధిక టూరిస్టుల‌ను ఆక‌ర్షిస్తున్న‌ది తాజ్‌మ‌హ‌లే. ఈ ఏడాది ఇప్ప‌టికే టూరిస్టుల ద్వారా తాజ్‌కు రూ.25 కోట్ల ఆదాయం వ‌చ్చింది. వాస్త‌వానికి 2020తో పోలిస్తే ఆదాయం 73 శాతం ప‌డిపోయింది. కోవిడ్ ఆంక్ష‌ల వ‌ల్ల ఆ ఆదాయం త‌గ్గింది. ఢిల్లీలోని ఎర్ర‌కోట‌తో పోలిస్తే అయిదు రేట్లు అధికంగా తాజ్ ఆదాయం ఉంది. త‌మిళ‌నాడులోని మామ‌ల్ల‌పురం, భువ‌నేశ్వ‌ర్‌లోని సూర్య‌దేవాల‌యంతో పోలిస్తే తాజ్ ఆదాయం ప‌ది రేట్లు ఎక్కువ‌గా ఉంది.