Politics

రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది – TNI రాజకీయ వార్తలు

రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది – TNI  రాజకీయ వార్తలు

*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…. ప‌డ‌వ ప్ర‌మాదం పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగానే భావిస్తున్నామన్నారు. వ‌ర‌ద‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుర‌ద రాజ‌కీయం చేస్తున్నారని విమర్శించారు. వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్య‌మంత్రి క‌నీస బాధ్య‌త మ‌ర‌చి వచ్చే ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసి గెలవాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కేవ‌లం నాలుగు ట‌మోటాలు, ఎర‌గ‌డ్డ‌లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఈ జగన్‌కు ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని కొల్లురవీంద్ర పేర్కొన్నారు

*గాంధీల పేరుతో తరాలు తిన్నా తరగనంత సంపాదించాం: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనము 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు.

* సొంపెల్లి ప్రమాద ఘటనపై జవహర్ సంచలన వ్యాఖ్యలు
సొంపెల్లి ప్రమాద ఘటనలో పెద్ద కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రమాదానికి ముందే విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టడం అనుమానం కలిగిస్తోందని అన్నారు. సంఘటన జరగబోతుందని.. ఆ సంఘటనకు తమరు బలవుతారని ఏ విధంగా అన్నారని ప్రశ్నించారు. ”ఆ ఘోరం జరుగుతుందని ముందే ఊహించారా.. లేక ఉద్దేశ్య పూర్వకంగా మీరే చేయించారా” అని అన్నారు. కర్మపాపం ఏదైనా ఉందంటే పాపులకు లేదా జగన్‌కు కర్మపాపం ఉంటుందన్నారు. అలిపిరి తరువాత చంద్రబాబుకు రెండో ఘటన జరిగిందని.. దేవుడు ఆయన పక్షాన ఉన్నారని ఆయన తెలిపారు. విజయసాయి లాంటి కుక్కలు మొరిగితే చంద్రబాబుకి ఏమి కాదని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి మొరగడం మానేసి వరద బాధితులకు ఏవిధంగా సహాయం చేయాలో ఆలోచిస్తే మంచిదని హితవుపలికారు. ఆఖరిగా చంద్రబాబును, టీడీపీ నేతలను అంతమొందించే కుట్ర అస్త్రాలు సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రజల అండ ఉన్నంతవరకు చంద్రబాబుని ఏమి చేయలేరని జవహర్ స్పష్టం చేశారు

*కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం ఉందా: షర్మిల
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ…. కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం ఉందా అంటూ వ్యాఖ్యలు చేశారు. వర్షాల వల్ల ఇంత నష్టం జరిగితే.. పెద్ద నష్టం జరగలేదని అంటారా అని మండిపడ్డారు. కాళేశ్వరంలో మునిగిన పంప్ హౌస్‌లను ఎందుకు చూడనివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టును డిజైన్ చేసిన కేసీఆర్ అనే ఇంజనీర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మీడియాను, ప్రతిపక్ష నేతలని అడ్డుకోవడమేనా తమచిత్త శుద్ధి అని అన్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎందుకు పర్యటించడం లేదని అన్నారు. వరద నష్టం పరిహారాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అకౌంట్ నుంచే ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు

*సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌కు తెలుసా..?: యనమల
సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్‌ కు తెలుసా..? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. శుక్రవారం తునిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిత్యావసర రేట్లు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలు తగ్గించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైందన్నారు. ఏపీకి త్వరలో శ్రీలంక పరిస్థితి వస్తాదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎనిమిది లక్షల కోట్లకు అప్పులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం నిలిచిపోయిందని, రాష్ట్రంలో మరింత పేదరికం పెరిగిందన్నారు. బీహార్, ఒడిస్సాల కన్నా ఏపీ వెనుకబడిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని వదిలించుకోవాలని చూస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు

*ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందే: పియూష్ గోయల్
ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ… ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనన్నారు. రాష్ట్రాలు ఉచిత బియ్యం పంపిణీని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉచిత బియ్యాన్ని తెలంగాణ సరిగ్గా పంపిణీ చేయడం లేదని.. అందుకే తెలంగాణపై ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు. ఏపీ(AP)తో కూడా ఉచిత బియ్యం పంపిణీపై మాట్లాడుతున్నామని, త్వరలో అక్కడ కూడా ఉచిత బియ్యం పంపిణీ సవ్యంగా చేస్తారని అనుకుంటున్నానని పియూష్ గోయల్ అన్నారు

*ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటన : సజ్జల
చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. గడిచిన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అబద్దాలే ఆయనకు ప్రాధాన్యమని అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కరువుకాటకాల్లో తక్షణ సహాయంగా ఏమి అందించలేదని దుయ్యబట్టారు.చంద్రబాబు ఉంటే వర్షాలు కూడా సక్రమంగా పడవని విమర్శించారు. విపత్తులు సంబవించినప్పుడు ఆయన అధికారులను నిద్రించేవాడు కాదని, వారిని పనిని చేయించేవాడు కూడా కాదని దీంతో అధికారులు తలపట్టుకునే వారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుతో కిందిస్థాయి నుంచి వ్యవస్థ బలోపేతంగా ఉందని అన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు

*ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమే: మధుయాష్కీ
కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐఏఎస్‌ రజత్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.మేఘాలు బద్ధలు కాలేదు.. మేఘా అవినీతి బద్ధలైందన్నారు.మేఘా ఇంజనీరింగ్ అధినేతను అరెస్ట్ చేయాలన్నారు. కేసీఆరే(KCR) ఇంజనీర్, డాక్టర్, మేధావి అని సెటైర్లు వేశారు. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందన్నారు.అవినీతి చేయకున్నా కేంద్రం కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఎందుకు ఈడీ నోటీసులు ఇవ్వడం లేదు? అని మధుయాష్కీ ప్రశ్నించారు.

*జగన్ రెడ్డి.. “ఏరు దాటాక తెప్ప తగలేసే రకం”: దేవతోటి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరియల్ సర్వే పేరుతో గాలిలో చెక్కర్లు కొట్టి వరద బాధితులను పరామర్శించకుండా..ఏ సహాయం ప్రకటించకుండా చేతులు దులిపేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతయుతగల నేత, వరద బాధితులను స్వయంగా కలిసి వారి బాధలను తెలుసుకొని పరిష్కార మార్గాలు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. జగన్ రెడ్డి “ఏరు దాటాక తెప్ప తగలేసే రకం”. ఆయన ప్రవర్తనను ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి’’ అని దేవతోటి నాగారాజు పేర్కొన్నారు.

*Chandrababu రక్షణను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది: కొల్లు రవీంద్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రక్షణను జగన్ప్ర భుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…. ప‌డ‌వ ప్ర‌మాదం పూర్తిగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగానే భావిస్తున్నామన్నారు. వ‌ర‌ద‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుర‌ద రాజ‌కీయం చేస్తున్నారని విమర్శించారు. వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్య‌మంత్రి క‌నీస బాధ్య‌త మ‌ర‌చి వచ్చే ఎన్నికలలో ఎన్ని కుట్రలు చేసి గెలవాలని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. కేవ‌లం నాలుగు ట‌మోటాలు, ఎర‌గ‌డ్డ‌లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఈ జగన్‌కు ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదని కొల్లురవీంద్ర పేర్కొన్నారు.

*ఇది దొంగ ప్రభుత్వం.. దుర్మార్గపు ప్రభుత్వం: చంద్రబాబు
జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పాలకొల్లులో పర్యటించిన టీడీపీ అధినేత… జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది దొంగ ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వమని మండిపడ్డారు. డబ్బులు కట్టించుకుని ఇళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వమన్నారు. పోలవరాన్ని ముంచేశారని… పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే ఇంత ముంపు వుండేది కాదని తెలిపారు. పోలవరం పూర్తయ్యి నదులు అనుసంధానం అయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ లో వరద బాధితులకు ఇంటికి రూ.10వేలు ఇస్తే, ఇక్కడ రూ.2వేలు ఇస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక లో పాలకులు ఏ విధంగా పారిపోవాల్సి వచ్చిందో.. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే ఇక్కడ నాయకులు పారిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత కూడా వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

*మంత్రి పువ్వాడ కామెంట్లు అర్ధరహితం: నారాయణ
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు అర్ధరహితమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వరద వస్తే విలీన మండలాల్లోకి నీళ్లు రాకుండా ఆపగలరా..? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు విలీన మండలాలను తమకు ఇచ్చేయమంటే.. భద్రచలాన్ని ఏపీకి ఇచ్చేయాలని ఇక్కడి వాళ్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ఇంకా ఎందుకివ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ (YS) ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్యాకేజీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు ఇచ్చే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కటాఫ్ డేట్ పెట్టొద్దన్నారు. 2012లో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్లు.. ఇప్పుడు పెద్ద వాళ్లయ్యారు.. పెళ్లిళ్లయ్యాయి. 2012లో పిల్లలుగా ఉన్నారు కాబట్టి.. వారికి పునరావాస ప్యాకేజీ ఇవ్వమంటే ఎలా?.. కానీ నాడు వైఎస్ ఇచ్చినంత కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వరద బాధితులకు తెలంగాణలో రూ. 10 వేలు ఇస్తుంటే.. ఏపీలో రూ. 2 వేలు మాత్రమే ఇస్తున్నారని నారాయణ అన్నారు.

*అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ: ఎంపీ ఉత్తమ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కాళేశ్వరంఅవినీతిలో దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. తుమ్మడి హట్టి దగ్గర డ్యాం నిర్మిస్తాం, గ్రావిటీతో నీళ్లు పారేలా చేస్తామన్నారు.కాళేశ్వరం ఇరిగేషన్‌ కాదు, టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు పూర్తయితే సాగర్ ఎండిపోతుందన్నారు.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నష్టం జరుగుతుందన్నారు.ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిలిపేలా సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువస్తామని తెలిపారు.టీఆర్ఎస్, బీజేపీవి రాజకీయ డ్రామాలని ఎద్దేవా చేశారు.తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపునని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు

*బీజేపీపై మండిపడిన మంత్రి హరీష్‌రావు
బీజేపీ పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది, తెలంగాణ లో ఉన్న పథకాలు కర్నాటకలో ఎందుకులేవు? అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ… జూటా మాటలని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని, కర్నాటకలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ ఉందా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని కమలం నేతలు చెబుతున్నారు. ఇదే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ను ఢీ కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు.

*కాంగ్రెస్ వస్తేనే అన్నివర్గాలకు న్యాయం: ప్రవీణ్‌రెడ్డి
కాంగ్రెస్అ ధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి ఈ పార్టీలో చేరానని చెప్పారు. టీఆర్ఎస్‌కి రెండుసార్లు అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా వరంగల్ సభలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని చెప్పారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అందరితో కలిసి పని చేస్తానని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

*అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం: మంత్రి తలసాని
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, GO 58 క్రింద అంబేడ్కర్‌నగర్‌లోని స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీవో వసంత కుమారి, తహసీల్దార్, కార్పొరేటర్లతో అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన సంఘటనపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 46లోని అంబేడ్కర్‌నగర్‌లో చోటుచేసుకున్న సంఘటన బాధాకరమని చెప్పారు. ఒక అధికారి చేసిన తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కేసీఆర్(KCR) నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌లో పర్యటిస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారితో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు.

* సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ నెం.1గా నిలవాలి: సీఎం జగన్
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు ఇప్పుడు జరుగుతున్నంత ప్రయత్నం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఎస్‌డీజీ సాధన దిశగా కృషి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలియజెప్పడం అంతే అవసరమని పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రామాణిక నిర్వహణ విధానాల్ని (ఎస్‌ఓపీ) రూపొందించుకుని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అమ్మ ఒడి, పాఠశాలల నిర్వహణ నిధి (ఎస్‌ఎంఎఫ్‌), మరుగుదొడ్ల నిర్వహణ నిధితో (టీఎంఎఫ్‌) పాటు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల గురించి సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనకు ఇప్పుడు జరుగుతున్నంత ప్రయత్నం గతంలో ఎప్పుడూ లేదని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఎస్‌డీజీ సాధన దిశగా కృషి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలియజెప్పడం అంతే అవసరమని పేర్కొన్నారు. అమ్మ ఒడి, పాఠశాలల నిర్వహణ నిధి (ఎస్‌ఎంఎఫ్‌), మరుగుదొడ్ల నిర్వహణ నిధితో (టీఎంఎఫ్‌) పాటు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల గురించి సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదని తెలిపారు.

*కేంద్ర బృందం అధ్యయనం చేయాలి: పువ్వాడ
వరద ముంపును పరిశీలించేందుకు శుక్రవారం భద్రాచలం రానున్న కేంద్ర బృందం పోలవరం నీటి సామర్థ్యంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కోరారు. ఖమ్మంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం పూర్తి కాకముందే వరద ముప్పు భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాల ప్రజలను అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం పూర్తయితే తెలంగాణాలో లక్ష ఎకరాలతో పాటు భద్రాచలం, కిన్నెరసాని డ్యామ్‌, ఇతర ప్రాంతాలు మునిగిపోతాయన్నారు. పోలవరం ప్రాజెక్టును 45.7 అడుగుల ఎత్తులో నిర్మించడంపై తమకు అభ్యంతరం లేదని, నీటి నిల్వ సామర్ధ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని మంత్రి చెప్పారు. నిర్ణయించిన నీటి నిల్వ సామర్థ్యం లేని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర బృందం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శాస్త్రీయంగా లేదని, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలసంఘానికి సీఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర బృందం ముంపు పరిశీలనతో పాటు పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం చేయాలని, ముంపునకు గురైన ఆంధ్రాలోని ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి కలపాలని పువ్వాడ డిమాండ్‌ చేశారు.

*రాష్ట్రంలో త్వరలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు: రాజాసింగ్‌
రాష్ట్రంలో అతి త్వరలోనే మహారాష్ట్ర తరహా రాజకీయాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ జోస్యం చెప్పారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం నర్సాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజల గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి వారి పదవులపై నమ్మకం లేదన్నారు. వారికి పదవులు ఎప్పుడు ఊడుతాయో తెలియని భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వరద సహాయం కోసం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ (TRS) కార్యకర్తల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వరద సహాయం అడుగుతోందని విమర్శించారు. గతంలో జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో వరద బాధితులకు రూ. 10వేలు ఇస్తామని చెప్పి.. చివరకు టీఆర్‌ఎస్‌ వాళ్లే పంచుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ భయం పట్టుకుందన్నారు. జీఎస్టీ అంశాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పెడితే వచ్చేది బీజేపీ (BJP) ప్రభుత్వమేనన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తాను బైక్‌ యాత్రను చేపట్టినట్లు రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

*బీజేపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే..జగ్గారెడ్డి
బీజేపీ (BJP) సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే సోనియా కుటుంబాన్ని విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. ఈడీ విచారణ‌కు సోనియాను పిలువడాన్ని నిరసిస్తూ.. జిల్లా కేంద్రం‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా కుటుంబం అవినీతికి పాల్పడిందని ఈడీ విచారించడం సిగ్గుచేటని, మీడియా రంగం నష్టాల బాటలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నేషనల్ హెరాల్డ్‌ పత్రికలో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల నుంచి సోనియా కుటుంబాన్ని దూరం చేసే కుట్రలో భాగమే ఈడీ విచారణ అని తెలిపారు.

*కేంద్రం ఈడీని పావుగా వాడుకుంటోంది: కేవీపీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ని కేంద్రం పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈడీ విచారణలో కథా, స్క్రీన్‌ప్లే, నిర్మాత ప్రధాని మోదీ అని, ఎన్ఫోర్సర్ అమిత్‌షా అని, ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని అన్నారు. భారత్ జోడో యాత్రను ఓవర్‌ షాడో చేయడమే బీజేపీ లక్ష్యమని, గాంధీ , నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనే ఒక వ్యర్థ ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళు సాధించేది ఏమీ లేదని అన్నారు. దీనివల్ల గాంధీ, నెహ్రూ ఫ్యామిలీకి ఇమేజ్ పెరుగుతుందే తప్ప డ్యామేజ్ఉం డదన్నారు. కాంగ్రెస్నే తల్లో మరింత యూనిటీ వస్తుందన్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అగ్ర నేతలు ఈడీ విచారణ నుంచి బయటపడతారని కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

*సీఎం కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు.. బీజేపీ ఫీవర్ పట్టుకుంది: బండి సంజయ్ము
ఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఎలక్షన్ ఫీవర్ కాదని, బీజేపీ ఫీవర్ పట్టుకుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అ న్నారు. గురువారం సిద్ధిపేటలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం వర్షంలో తడిసి మొలకెత్తడానికి, నష్టం జరగడానికి పూర్తి భాద్యత రాష్ట్రానిది, ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కాపాడలేని సీఎం.. రాష్ట్ర ప్రజలను ఎం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించడమే తమ ప్రజా సంగ్రామ యాత్రని బండి సంజయ్ అన్నారు.

* జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు: షర్మిల
జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. పట్టాలు ఇస్తామని 8 ఏళ్లవుతున్నా ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో షర్మిల ముఖాముఖి మాట్లాడారు. ఇటీవల పోడు భూముల్లోని గ్రామస్థుల గుడిసెలను పోలీసులు తొలగించారని రైతులు తెలిపారు. 2500 ఎకరాల పోడు భూములపై తమకు హక్కు ఉందని అన్నారు. బట్టలు ఊడదీసి కొట్టారని షర్మిలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నుంచి సాగు చేసుకుంటున్నవారికి పట్టాలివ్వకపోవడం దారుణమని, భూముల కోసం పోరాడుతున్న 52 కుటుంబాలను హింసిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

* చంద్రబాబుకు భద్రతలో ప్రభుత్వ వైఫలం
ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు ది క్యాబినెట్ మంత్రి హోదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మూడు రోజుల క్రితమే వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారని ప్రభుత్వానికి సమాచారo ఇవ్వడo జరిగిందని చెప్పారు. చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అని.. అయినా పర్యటనకు ఏర్పాట్లు చేయడములో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్ది పాదయాత్రకు ఏ రకంగా బందోబస్తు ఇచ్చింది ఒకసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఈనాటి ఈ ప్రమాదంలో నిర్లక్ష్యo వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

*వైసీపీ పాలనలో విచ్ఛలవిడిగా గ్రానైట్ మాఫియా: పనబాక లక్ష్మీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రానైట్ మాఫియా పెరిగిపోయిందని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ ఆరోపించారు. వైసీపీ నాయకులు కొండలను పిండి చేసేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. అన్నదాతలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధుృతరాష్టుడి పాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల పశువులు చనిపోతే వాటి యజమానులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదన్నారు. గిట్టు బాటు ధర దక్కడం లేదని ఆరోపించారు.

*వరద బాధితుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదు: నారాయణ
వరద బాధితుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదని సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని బండ్లబోరు, భూదేవిపేట, శివకాశీపురం గ్రామాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం కుటుంబానికి రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని, రేషన్‌ కార్డు లేని వారికి పరిహారం ఇవ్వడం లేదని బాధితులు నారాయణకు తెలిపారు. గోదావరి వరద తీవ్రతకు ఆస్తులు పోయి ఇళ్లు కూలిపోయి నిలువు నీడ లేకుండా పోయిన వరద బాధితులకు రూ.2వేలు ఇవ్వడాన్ని ఖండించారు. కుటుంబానికి రూ.10వేలు చెల్లించాలని నారాయణ డిమాండ్ చేశారు.

*ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : Ramakrishna
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని అడిగే పరిస్థితుల్లో చంద్రబాబు లేడని పేర్కొన్నారు. సీఎం జగన్ అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్థులను ప్రైవేకరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు.

*అక్రమ కేసులకు కాంగ్రెస్‌ భయపడదు: శైలజానాథ్‌
‘‘కేంద్ర ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ గాంధీని ఈడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. మోదీ అక్రమ కేసులకు కాంగ్రెస్‌ పార్టీ భయపడదు’’ అని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్‌ తెలిపారు. సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ అక్రమ కేసులను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో శాంతియుత నిరసన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీది డబుల్‌ ఇంజన్‌ కాదని, ట్రబుల్‌ సర్కార్‌ అని మండిపడ్డారు. ఆంధప్రదేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి డబ్బుపై ఆశ ఉంటే ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల జాబితాలో ఉండేవారన్నారు.

*కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలి: సీపీఎం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే మీకేంటి నష్టం? అంటూ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కార్మిక సంఘాల ప్రతినిధులను అపహాస్యం చేస్తూ మాట్లాడటం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆంధ్రప్రజలకు క్షమాపణ చెప్పాలని గురువారం డిమా ండ్‌ చేశారు. కేంద్రప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తిని కావాలనే తగ్గిస్తూ రోజుకో డిపార్ట్‌మెంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుట్ర లు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.

*రాష్ట్రంలో త్వరలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు: రాజాసింగ్‌
రాష్ట్రంలో అతి త్వరలోనే మహారాష్ట్ర తరహా రాజకీయాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ జోస్యం చెప్పారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం నర్సాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజల గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి వారి పదవులపై నమ్మకం లేదన్నారు. వారికి పదవులు ఎప్పుడు ఊడుతాయో తెలియని భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వరద సహాయం కోసం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వరద సహాయం అడుగుతోందని విమర్శించారు. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద బాధితులకు రూ. 10వేలు ఇస్తామని చెప్పి.. చివరకు టీఆర్‌ఎస్‌ వాళ్లే పంచుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ భయం పట్టుకుందన్నారు. జీఎస్టీ అంశాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పెడితే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తాను బైక్‌ యాత్రను చేపట్టినట్లు రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

*శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువ.. అందుకే : చంద్రబాబు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని పెనుగొండ మండలం నడిపూడి ఎన్టీఆర్ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ… విపత్తు వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే జగన్ పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. దేశంలో అధిక ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉభయగోదావరి జిల్లాల్లో చేస్తే స్థానిక నాయకులు వడ్డీతో సహా చెల్లించాలని టీడీపీ అధినేత తెలిపారు.

*నేను ఆ పార్టీ ఎంపీనే: Ravindranath
పార్టీకి తాను రాజీనామా చేయనందువల్ల తనను అన్నాడీఎంకే ఎంపీగానే పరిగణించాలని ఒ.పి.రవీంద్రనాధ్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. తేని లోక్‌సభసభ్యుడు రవీంద్రనాథ్‌ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినందున ఆయనను ఆ పార్టీ సభ్యుడిగా పరిగణించకూడదంటూ ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన రవీంద్రనాథ్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, రాజ్యాంగ శాసనం ప్రకారం ప్రజలు ఓటేసి తనను ఎంపీగా గెలిపించారన్నారు. అన్నాడీఎంకేకు సంబంధించిన కేసు ఇంకా న్యాయస్థానంలో విచారణ స్థాయిలోనే ఉందని, తీర్పు వచ్చేవరకూ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.