DailyDose

లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిని అమెరికా సీఐఏ కుట్ర ప‌న్ని హ‌త్య చేసిందా!!

Auto Draft

లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణించి ఐదు ద‌శాబ్దాలు దాటినా ఇప్ప‌టికీ ఎన్నో సందేహాలు !! ఎన్నెన్నో అనుమానాలు !! పాక్‌తో సంధి చేసుకునేందుకు సోవియ‌ట్ యూనియ‌న్ వెళ్లిన శాస్త్రి.. ఉన్న‌ట్టుండి గుండెపోటుతో కుప్ప‌కూల‌డం ఏంట‌ని అప్ప‌ట్లో చాలామంది అనుమానం వ్య‌క్తం చేశారు. కావాల‌నే ఎవ‌రో ఆయ‌న్ను హ‌త్య చేసి ఉంటారంటే.. అమెరికా గూఢ‌చారి సంస్థ సీఐఏనే ప‌థ‌కం ప్ర‌కారం చంపించింద‌న్న ఆరోప‌ణ‌లూ వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ట‌మైన స‌మాధానం మాత్రం దొర‌క‌లేదు. దీంతో ఐదు ద‌శాబ్దాలు అయినా కూడా శాస్త్రి మ‌ర‌ణం ఇంకా మిస్ట‌రీగానే మిగిలిపోయింది. అయితే శాస్త్రిని సీఐఏనే హ‌త్య చేయించింద‌ని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. శాస్త్రి మ‌ర‌ణం వెనుక క‌థ‌ను అప్ప‌ట్లో సీఐఏ డైరెక్ట‌రేట్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించిన‌ రాబ‌ర్ట్ క్రౌలీ త‌న పుస్త‌కంలో వివ‌రించ‌డంతో ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

అస‌లేం జ‌రిగిందంటే..
1965లో భార‌త్ – పాకిస్థాన్ యుద్ధం త‌ర్వాత 1966 జ‌న‌వ‌రి 10న అప్ప‌టి భార‌త ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఉజ్బెకిస్థాన్ రాజ‌ధాని తాష్కెంట్‌కు వెళ్లారు. పాక్‌తో సంధి కోసం వెళ్లిన శాస్త్రి.. అక్క‌డ స‌మావేశం జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే అనుమాన‌స్ప‌దంగా మ‌ర‌ణించారు. అయితే శాస్త్రి గుండెపోటుతో క‌న్నుమూశార‌ని సోవియ‌ట్ యూనియ‌న్ అధికారులు చెప్పారు. కానీ విదేశాల నుంచి తీసుకొచ్చిన శాస్త్రి మృత‌దేహం నీలం రంగులోకి మారి ఉంది. అలాగే ఆయ‌న పొత్తి క‌డుపు, మెడ వెనుక భాగంలో క‌త్తిరించిన గుర్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో ఆయ‌న మ‌ర‌ణంపై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తాయి. ఎవ‌రో విషం పెట్టి ఆయ‌న్ను హ‌త్య చేసి ఉంటార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అయితే లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణం వెనుక అమెరికా గూఢ‌చారి సంస్థ సీఐఏ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్నుంచే అనుమానాలు ఉన్నాయి.

అయితే అదంతా నిజ‌మేన‌ని శాస్త్రిని హ‌త్యకు కుట్ర చేసింది సీఐఏనే అని ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. సీఐఏ మాజీ అధికారి రాబ‌ర్ట్ క్రౌలీ త‌న పుస్త‌కంలో రాసుకొచ్చిన ప‌లు విష‌యాలు దీన్ని ధ్రువీక‌రిస్తున్నాయి. ఈ హ‌త్య‌లు జ‌రిగిన‌ స‌మ‌యంలో సీఐఏ డైరెక్ట‌రేట్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ బాధ్య‌త‌ను రాబ‌ర్ట్ క్రౌలీనే నిర్వ‌హించారు. అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత గ్రెగొరీ డ‌గ్ల‌స్ కూడా త‌న క‌న్జ‌ర్వేష‌న్ విత్ ది క్రౌ పుస‌క్తంలో రాబ‌ర్ట్ క్రౌలీ సంభాష‌ణ‌ల రికార్డుల‌ను ప్ర‌స్తావించారు. శాస్త్రితో పాటు భార‌త అణుశాస్త్ర పితామ‌హుడు హోమి జ‌హంగీర్ భాభా ఇద్ద‌రినీ సీఐఏనే హ‌త్య చేసింద‌ని వివ‌రించారు. ఈ విష‌యాన్ని క్వోట్ చేస్తూ శాస్త్రి మ‌ర‌ణంపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న మ‌నుమ‌డు ట్వీట్ చేయ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

రాబ‌ర్ట్ క్రౌలీ సంభాష‌ణ‌ రికార్డుల్లో ప్ర‌కారం.. భార‌త అణ్వాయుధ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా ముందుకు తీసుకెళ్ల‌డంలో శాస్త్రి, హోమి భాభా అప్ప‌ట్లో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ర‌ష్యాతో కూడా భార‌త్‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇది ఎప్ప‌టికైనా ముప్పేనని భావించిన అమెరికా సీఐఏ.. శాస్త్రి, భాభా హ‌త్య‌కు కుట్ర ప‌న్నింద‌ని వివ‌రించారు. భార‌తీయులు అణుబాంబులు త‌యారు చేస్తే తొలుత దాన్ని శ‌త్రుదేశ‌మైన పాకిస్థాన్‌పైనే వేస్తార‌ని భావించామని తెలిపారు.. భార‌త్‌ను అణ్వాయుధ దేశంగా మార్చే శక్తి హోమి భాభాకు ఉంది.. దాన్ని ఎప్ప‌టికైనా ఆయ‌న సాధిస్తాడు. అందుకే భాభాను చంపేయాల‌ని సీఐఏ నిర్ణ‌యించింది అని రాబ‌ర్ట్ క్రౌలీ త‌న పుస్త‌కంలో రాసుకొచ్చారు.

హోమీ భాభా ఎయిరిండియా విమానంలో వెళ్తుండ‌గా హ‌త‌మార్చాం. భాభా వెళ్తున్న విమానాన్ని వియ‌న్నాలోనే పేల్చేయాల‌ని ముందుగా అనుకున్నాం. కానీ విమానం ముక్క‌లై న‌గ‌రంలో ప‌డితే జ‌న‌న‌ష్టం ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌ని భావించాం. అందుకే ఎత్తైన ప‌ర్వ‌త ప్రాంతాన్ని ఎంచుకుని విమానం అక్క‌డ కూలిపోయేలా ప్లాన్ చేశాం. ఆ స‌మ‌యంలో విమానంలో ఉన్న ప్ర‌యాణికుల గురించి మేం ఏమాత్రం చింతించ‌లేదు. అని వివ‌రించారు. అయితే అణ్వాయుధ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు సీఐఏ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. 1974 మే 18న భార‌త్‌ మొద‌టి అణ్వాస్త్ర ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది.