NRI-NRT

గల్ఫ్ తెదేపా కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ.

గల్ఫ్ తెదేపా కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ.

తెదేపా ఎన్నారై విభాగం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కోనసీమ జిల్లా మల్కిపురానికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త, సౌదీ అరేబియా నివాసి రావి రాధాకృష్ణను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 25 ఏళ్లుగా ఆయన తెదేపా పటిష్ఠతకు పని చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో తెదేపా కమిటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. గత తెదేపా ప్రభుత్వంలో ప్రవాసీయుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీని గల్ఫ్ దేశాల్లో విస్తరించడంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహరించారు. శృంగవరపుపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్వచ్ఛ నీటి కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు, దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేశారు.