Politics

ప్ర‌పంచంలోని ఐటీ సంస్థ‌ల‌కు గ‌మ్య‌స్థానం హైద‌రాబాద్

Auto Draft

సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రపంచంలోని ఐటీ సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింద‌న్నారు. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు తమ విస్తరణ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశాయ‌ని తెలిపారు.

గ‌చ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ ప్ర‌యివేట్ లిమిటెడ్ సేవ‌ల‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫ్లోరిడా, యూఎస్ఏ ఆధారిత సాంకేతిక సేవ‌ల సంస్థ అయిన ఫోనిక్స్ టెక్నాల‌జీస్ ఇక్క‌డ ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ను ఏర్పాటు చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. తెలుగు విద్యార్థుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ఇచ్చేందుకు, అందుకు అనుగుణంగా ఉచిత శిక్ష‌ణ ఇచ్చేందుకు ముందుకు రావ‌డం శుభ ప‌రిణామం అని పేర్కొన్నారు.

మూడేండ్ల‌లో 3 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల‌ను క‌లిగి ఉండేలా విస్త‌రించాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని మంత్రి తెలిపారు. ఆవిష్క‌ర‌ణ‌ల విష‌యంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు మొన్న విడుదలైన నీతి ఆయోగ్ సూచి వెల్లడించింద‌ని గుర్తు చేశారు. ఆవిష్క‌ర‌ణ‌ల సూచీల్లో క‌ర్ణాట‌క‌, తెలంగాణ మొద‌టి రెండు స్థానాల్లో ఉంటే.. గుజ‌రాత్‌, బీహార్ 14, 15 స్థానాల్లో ఉన్నాయ‌ని తెలిపారు. డ‌బుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుక‌బ‌డ్డాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.