NRI-NRT

ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఆస్ట్రేలియాలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుక‌ల‌ను ఆస్ట్రేలియాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కేటీఆర్ బ‌ర్త్‌డే వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. కాన్‌బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేశారు.
darman1
ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన వేడుకలో రవి సాయల మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ‌ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో క‌ల్వ‌కుంట్ల‌ సాయికృష్ణ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు ఝాన్సీ నోముల, గాయత్రి అరిగెల, రాకేష్ లక్కరసు, సిద్దు గొర్ల, రమేష్ కైల రుద్ర కొట్టు, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.