NRI-NRT

పాత వీసాలు స్థానంలో కొత్త వీసా ప్రవేశపెట్టిన న్యూజీల్యాండ్.. ఇకపై..

పాత వీసాలు స్థానంలో కొత్త వీసా ప్రవేశపెట్టిన న్యూజీల్యాండ్.. ఇకపై..

తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఇన్వెస్టర్ వీసా విధానంలో న్యూజీల్యాండ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన భారీ పెట్టుబడిదారులకు ఆకర్షించేందుకు వీలుగా యాక్టివ్ ఇన్వె్స్టర్ వీసా ప్రవేశపెట్టింది. మునుపటి ఇన్వెస్టర్ కేటగిరీల స్థానంలో ఈ కొత్త వీసాను తీసుకొచ్చింది. విదేశీయులు దేశంలో తీసుకొస్తున్న వివిధ పెట్టుబడుల మధ్య సమతౌల్యం కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు దేశ వాణిజ్య ఆర్థిక, ప్రాంతీయ అభివృద్ధి శాఖ మంత్రి పేర్కొన్నారు. మునుపటి ఇన్వెస్టర్ వీసా ద్వారా దేశంలోకి వచ్చిన వారు షేర్లు, బాండ్లల్లోనే అధికంగా పెట్టుబడి పెట్టేవారని ఆయన వివరించారు. కొత్త వీసా కావాలనుకునే వారు ఇకపై నేరుగా తమ దేశ కంపెనీలకు పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించాలన్నారు. కొత్త వీసా నిబంధనల ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో సగం మాత్రమే మార్కెట్ ఈక్విటీల్లో పెట్టవచ్చు. మిగతా మొత్తాన్ని కంపెనీల్లో నేరుగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.