NRI-NRT

సింగపూర్ లో ‘తెలుగుబడి’ ఉత్సవం

సింగపూర్ లో ‘తెలుగుబడి’ ఉత్సవం

సింగపూర్ తెలుగు సమాజం తెలుగు బాలబాలికలకు గత 12 సంవత్సరాలుగా లాభాపేక్ష లేకుండా, సేవాదృక్పథంతో నిర్వరామంగా తరగతులను నిర్వహిస్తోంది. సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం పాఠ్య ప్రణాళికలో సాగే ఈ తరగుతులను కొవిడ్ సమయంలోనూ జూమ్ ద్వారా నిర్వహించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గత మేనెలలో పరీక్షలు నిర్వహించగా జులై 17 న ఫలితాలను ప్రకటించి ప్రశంసాపత్రాలను అందించారు. సుమారు 50 విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమానికి స్వాతి కురిచేటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
Whats-App-Image-2022-07-23-at-5-46-43-PM
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ .. సంస్కృతి సంప్రదాయాలు పదికాలాలు నిలవాలంటే భాషే ప్రధానమన్నారు. మాతృదేశానికి దూరంగా ఉండటంతోపాటు ఆంగ్లమాధ్యమంగా ఉన్న ఈ రోజుల్లో మన ‘తెలుగు బడి’ పిల్లలు మాత్రమే కుటుంబసభ్యులతో మనస్ఫూర్తిగా తెలుగులో మాట్లాడుతున్నారని చెబుతున్నప్పుడు ఎంతో ఆనందం వేసిందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సర ప్రణాళికను తెలుగు బడి కార్యనిర్వహణాధికారి, తెలుగు సమాజం కోశాధికారి మల్లికార్జున రావు పాలెపు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుబడి ఉపాధ్యాయులు కాయల రాఘవేంద్ర , కొణిజేటి శ్రీలక్ష్మి, దొంతు కిరణ్, ఆలపాటి రాఘవ , కనగాల సౌందర్య, వల్లభజోస్యుల రంగనాధ్, ముల్పూరి ప్రతిమలను సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేసింది.
Whats-App-Image-2022-07-23-at-5-46-42-PM
Whats-App-Image-2022-07-23-at-5-46-40-PM