DailyDose

రక్తం పొదిగిన నగలు

రక్తం పొదిగిన నగలు

బంగారం, వెండి, ప్లాటినంతో చేసిన నగలూ … ముత్యాలూ, రత్నాలూ, ఇంకా విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలూ మనకు తెలుసు. వాటిని ఇష్టంగా ధరిస్తాం … అయితే వీటన్నింటికి భిన్నంగా రక్తాభరణాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అమ్మో రక్తంతో నగలు చేస్తున్నారా అనుకునేరు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులో స్నేహితులో, బంధువులో చనిపోతే వారి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి- ప్రత్యేక పద్ధతుల్లో దాన్ని పొడిగా మార్చి పెండెంట్లలోనూ, ఇయరపానూ, ఉంగరాల్లోనూ పొదిగి ఆభరణాలుగా తీర్చిదిద్దుతోంది ఢిల్లీకి చెందిన ప్రీతి. అంతేకాదు , దీనివల్ల ఆత్మీయుల డీఎన్ఏ కూడా ఎప్పటికీ చెక్కుచెదరకుండా భద్రంగా ఆ ఆభరణాలు రూపంలో ఉండిపోతుంది. ‘ది మేజిక్ ఆఫ్ మెమొరీస్’ పేరుతో ఆభరణాలను డిజైన్ చేస్తోన్న ప్రీతి వృత్తిరీత్యా కంటివైద్య నిపుణురాలు. పిల్లలు పుట్టాక కొన సాగించడం వీలుపడక డాక్టర్ వృత్తిని మానేసింది. సొంతంగా ఏదైనా చేయా అని వైవిధ్యంగా ఆలోచించి విదేశాల్లో జ్యూవెలరీ తయారీ- రక్తాన్నీ, బొడ్డుతా డునీ, గోళ్లనీ, వెంట్రుకల్నీ, తల్లిపాలనీ ఇమిడ్చి చేసే నగల తయారీలో ప్రత్యే కంగా కోర్సులు చేసింది. మూడేళ్ల నుంచీ వాటితో ఆభరణాలు తయారు చేస్తూ అరుదైన జ్ఞాపకాలుగా మలుస్తోంది.