Movies

పారితోషికం పది కోట్లా?

Auto Draft

దక్షిణాదిన కోటి రూపాయల పారితోషికం అందుకొన్న తొలి కథానాయికగా నయనతార చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఓ కథానాయికకు ఇంతింత పారితోషికాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఓ సినిమా హిట్టు కొడితే చాలు, కొత్తమ్మాయిలకూ కోటి ఇచ్చేస్తున్నారు. ఈ దశలో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకొన్నారు నయన్‌. ఓ సినిమాకి రూ.10 కోట్లు వసూలు చేసి ఔరా అనిపిపించారు. ఇటీవల తమిళంలో ఓ కొత్త సినిమాపై నయన సంతకం చేసినట్టు సమాచారం. ఆ సినిమాకి గానూ ఏకంగా రూ.10 కోట్లు అందుకొన్నార్ట. అదదే నిజమైతే, నయన మరో కొత్త రికార్డు నెలకొల్పినట్టే. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలు సైతం రూ.10 కోట్లు తీసుకోవడం చాలా కష్టం. అలాంటిది దక్షిణాది కథానాయిక ఈ స్థాయికి చేరిందంటే గొప్ప విషయమే. నయన త్వరలోనే 75వ చిత్రం చేయబోతున్నారు. ఆ సినిమా కోసమే ఈ పారితోషికం అని టాక్‌. ఒక్కో సినిమాకీ 30 నుంచి 40 కాల్షీట్లు కేటాయించడం నయన అలవాటు. ఈ సినిమాకి మాత్రం దాదాపు మూడు నెలలు పని చేయాల్సివస్తోందట. అందుకే ఇంత పెద్ద మొత్తం చేతికి అందుతోందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి