NRI-NRT

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

మంత్రి కేటీఆర్ జ‌న్మదిన వేడుక‌ల‌ను టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. నాగరాజు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. యువ నేత మంత్రి కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు.నేడు ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటే అదంతా మంత్రి కేటీఆర్‌ కృషి వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కోర్ కమిటీ సభ్యుడు నరేందర్ రెడ్డి మేడసాని, హరీష్ రంగా, గుండా జై విష్ణు, అరవింద్ చీకోటి, వెంకట్ రావు, శ్రీనివాస్ రేపాల, నరేష్ తేజ యాదారి, కాశీనాథ్ (ఒంగోలు ) పాల్గొన్నారు.