Sports

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రాకు రజతం

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ చోప్రాకు రజతం

ఒలింపిక్‌ చాంపియన్‌, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించారు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా చోప్రా రికార్డు సృష్టించాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన 24 ఏండ్ల చోప్రా‌.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
https://twitter.com/afiindia/status/1551035585988476929/photo/1
డిఫెండింగ్ చాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. తన తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం బల్లెం విసరి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో మరోసారి తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌ జాకబ్‌ వద్లెచ్​మూడో స్థానంలో నిలిచాడు. వద్లెచ్‌ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరాడు.ప్రపంచ అథ్లెటిక్స్ చాపియన్​షిప్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా నిలిచాడు. అంతకుముందు 2003లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్​షిప్‌లో అంజు బాబి జార్జ్‌.. లాంగ్ జంప్​ విభాగంలో కాంస్యం గెల్చుకున్నది. 19 ఏండ్ల తర్వాత భారత్‌కు మళ్లీ ఇప్పుడు పథకం లభించినట్లయింది.