DailyDose

ఈ బీరు, విస్కీల్లో ఆల్క‌హాల్ అస్స‌లు ఉండ‌ద‌ట !

ఈ బీరు, విస్కీల్లో ఆల్క‌హాల్ అస్స‌లు ఉండ‌ద‌ట !

మద్యం అంటే.. మరణంతో ములాఖత్‌! బారు నుంచి ఇంటికి చేరుకునేలోపు ఏ యాక్సిడెంట్‌కో గురికావచ్చు. తక్కువలో తక్కువ కాలో చెయ్యో విరిగిపోవచ్చు. లేదంటే, ఇంటికి చేరాక ఇల్లాలి బడితపూజ ఉండనే ఉంటుంది. కొన్నాళ్లకు ఏ కాలేయ సమస్యో బయటపడొచ్చు. ప్రాణాంతకమూ కావచ్చు. ఇన్ని సమస్యలు అవసరమా? మద్యం మానేస్తే పోలా? చాలామంది ఆ పనే చేస్తున్నారు.
..కాలక్షేపానికి నాన్‌ ఆల్కహాలిక్‌ బీరు, విస్కీ, రమ్ము, జిన్ను ఎంచుకుంటున్నారు. రుచిలో ఏమాత్రం రాజీపడకుండా.. అసలు ఆల్కహాల్‌ శాతమే లేకుండా.. ఆరోగ్యవంతమైన పానీయాలను సిద్ధం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.

Naghty-Sparking-Chordanny
duplicate text checker
నాటీ స్పార్క్లింగ్‌ చార్డొనే
స్పెయిన్‌కు చెందిన ఈ నాన్‌ ఆల్కహాలిక్‌ బ్రాండ్‌ భారత్‌లోనూ అందుబాటులో ఉంది. ద్రాక్షతో పాటు వివిధ మొక్కలతో దీన్ని తయారు చేస్తారు. వంద ఎంఎల్‌ పానీయంలో కేవలం 2.9 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక గ్లాసు తాగితే 14 కేలరీల శక్తి వస్తుంది. బాటిల్‌ ధర రూ. 21,750.

brand-swamy
బ్రాండ్‌ స్వామి
క్రాఫ్ట్‌ టానిక్‌ వాటర్‌లో భారత్‌లోనే అగ్రగామిగా ఉన్నది ముంబైకి చెందిన స్వామి కంపెనీ. వీరు ఆల్కహాల్‌ లేని మూడు కాక్‌టెయిల్‌లను అందిస్తూ బోలెడు లాభాలు ఆర్జిస్తున్నారు. వాటిలో జీఅండ్‌టీ, పింక్‌ జిన్‌ అండ్‌ టానిక్‌, రమ్‌ అండ్‌ కోలా ప్రముఖమైనవి. గతేడాది వీటిని ప్రవేశపెట్టగా ఆ కంపెనీ ఆదాయం ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగిందట. వీటిని వెనిలా, పంచదార పాకం, దాల్చిన చెక్కతో తయారుచేశారు. ఈ పానీయం 56 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది.

Kati-Patang-Delhi
కటీ పతంగ్‌
ఢిల్లీకి చెందిన క్రాఫ్ట్‌ బీర్‌ బ్రాండ్‌.. కటీ పతంగ్‌. గతేడాది ‘నాట్‌’ పేరుతో నాన్‌ ఆల్కహాలిక్‌ పానీయాల శ్రేణిని విడుదల చేసింది. వీటిల్లో కటీ పతంగ్‌ నాట్‌ జిన్‌ అండ్‌ టానిక్‌, నాట్‌ కాస్మోపాలిటన్‌, నాట్‌ ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌ బ్రాండ్‌లు ఉన్నాయి. మూడు విభిన్న రుచులలో ఈ పానీయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో మైనస్‌ కేలరీలు ఉంటాయి. నాట్‌ ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌ పానీయాన్ని 35కు పైగా మసాలా దినుసులతో తయారు చేశారు. జూన్‌లో వీటి ఉత్పత్తి ప్రారంభమైంది. నెలలోనే స్టాక్‌ అయిపోయింది. అంతటి డిమాండ్‌ మరి!

Sober-Gin-Goa
సోబర్‌ జిన్‌
కేవలం గోవాలోనే లభించే సోబర్‌ జిన్‌ ఇటీవలే మార్కెట్లో ప్రవేశించింది. ఈ జిన్‌లో ఆల్కహాల్‌ అస్సలు ఉండదు. ఐదు కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిని బెర్రీపండ్లు, అశ్వగంధ, తులసితో తయారుచేస్తారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందీ పానీయం. కాబట్టే రూ.1,499 పెట్టి కొనడానికి కూడా ఎవరూ సందేహించడం లేదు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. భారత దేశపు మొట్టమొదటి నాన్‌ ఆల్కహాల్‌ జిన్‌గా పేరు తెచ్చుకుంది.

Cool-berg-Mumbai
కూల్‌బర్గ్‌
ముంబైకి చెందిన కూల్‌బర్గ్‌ భారతదేశపు మొట్టమొదటి జీరో ఆల్కహాల్‌ బీర్‌ కంపెనీ. బార్లీని మాల్ట్‌ చేసి, అధిక ఉష్ణోగ్రతల వద్ద మరిగించి, మళ్లీ చల్లార్చి తయారు చేస్తారు. బార్లీమాల్ట్‌, అల్లం, క్రాన్‌బెర్రీ, పుదీనా, పీచ్‌, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో లభిస్తుంది. భారత్‌లో అత్యంత ఆదరణ పొందింది.

Gin-ISH-Denmark
జినిష్‌
డెన్మార్క్‌కు చెందిన నాన్‌ ఆల్కహాలిక్‌ జిన్‌.. ‘జినిష్‌’. దీనిని బెర్రీపండ్లు, ధనియాలు, మిరప గింజలు వంటి సహజసిద్ధ పదార్థాలతో చేశారు. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. డెన్మార్క్‌ GinISH ధర రూ.1,750.

Coast-From-Belgium
కోస్ట్‌
బెల్జియం తయారీ నాన్‌ ఆల్కహాలిక్‌ బీర్‌ ఇది. దీన్ని వివిధ రకాల పండ్ల నుంచి తయారు చేశారు. ఇందులో 33 కేలరీలు ఉంటాయి. బాటిల్‌ ధర రూ.250.