Devotional

భక్తులతో కిక్కిరిసిన లాల్దర్వాజ మహంకాళి ఆలయం

భక్తులతో కిక్కిరిసిన లాల్దర్వాజ మహంకాళి ఆలయం

భక్తులతో కిక్కిరిసిన లాల్దర్వాజ మహంకాళి ఆలయం
లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బోనాల పండుగ నేపథ్యంలో అమ్మవారి రంగం కార్యక్రమానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ పరిసరాలు పల్లె వాతావరణాన్ని తలపించాయి. పోతరాజు అశ్విన్ యాదవ్ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. మాతంగి అనూరాధ పచ్చికుండపై నిల్చుని రంగం వినిపించనుంది.ఆషాడం బోనాలు రెండు రోజులు పాటు జరుగుతాయి. జూలై 24న బోనాల సందడిలో భాగంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారు జామునుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. బోనాల ఉత్సవాల చివరి రోజు జూలై 25వ తేదీ రంగం, ఘటం ఊరేగింపు నిర్వహిస్తారు.

1. ఆగస్టు 1 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతో పాటు అవి అంతరించిపోకుండా టీటీడీ కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి ప్రారంభించనున్నది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి జానపద కళాకారులు తిరుమలకు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ప్రయాణ ఖర్చులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన భజన బృందాల సభ్యుల స్లాట్‌ వివరాలను ఇప్పటికే www.tirumala.orgలో అందుబాటులో ఉంచారు.

2. అంగరంగ వైభవంగా బోనాలు
హైదరాబాద్‌లో ఆషాడ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు వాడవాడలా అమ్మవారి ఆలయాల్లో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజులు, శివసత్తుల నృత్యవిన్యాసాలతో నగరం భక్తిమయమైంది. ముఖ్యంగా పాతనగరంలోని చారిత్రక లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, దానం నాగేందర్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. లాల్‌దర్వాజ బోనాల వేడుకల్లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొని, అమ్మవారికి బోనం సమర్పించారు.

3. భక్తులకోసం వర్చువల్ క్యూలైన్
శ్రీవారి దర్శనార్థం ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమలకు చేరుకుంటారు భక్తులు. పలు విధాలా టిక్కెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు భక్తులు. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేసేందుకు ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిఐపిలు, విఐపిలకు బ్రేక్, ఇతర సేవ టిక్కెట్లను అందిస్తోంది టీటీడీ (TTD). సామాన్య భక్తుల కొరకు శ్రీవారి నిత్య సేవలను లక్కీ డిప్ విధానంలో, ఆర్జిత సేవలను ఫస్ట్ కమ్ ఫస్ట్ టికెట్ విధానాన్ని అమలు చేస్తోంది టీటీడీ. ఇక రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. అంగ ప్రదిక్షణ, వయో వృద్దులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం కొరకు ప్రత్యేక క్యూకాంప్లెక్స్ లను ఏర్పాటు చేసింది.
*వర్చువల్ క్యూ అంటే ఏమిటి.?వాటివల్ల ప్రయోజనాలు ఏంటి..??
ఫిజికల్ క్యూ విధానంలో ప్రత్యక్షంగా భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గంటల తరబడి క్యూలైన్ లో పిల్లలు., వయో వృద్దులు వేచి ఉంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక క్యూ కాంప్లెక్స్ చేరుకున్న అనంతరం గంటల తరబడి వేచి ఉండాలి. క్యూకాంప్లెక్స్ లలో సైతం టీటీడీ అన్ని సదుపాయాలు చేస్తున్నప్పటికీ వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనపడటం లేదు. దీని కోసమే టీటీడీ వర్చువల్ క్యూ విధానం ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. భక్తులు ఫిజికల్ క్యూ విధానం నుంచి, వర్చువల్ క్యూ విధానం అమలు చేసే యోచన చేస్తోంది.నిర్ణిత స్లాట్ టైంలో తిరుమలకు చేరుకోగా… 2గంటల లోపే శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇలా చేయడం ద్వారా స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఫిజికల్ గా క్యూ విధానంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. టైమింగ్ ప్రకారం వచ్చిన భక్తులకు నిర్ణిత సమయంలో దర్శనభాగ్యం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన. ఇప్పటికే వయో వృద్దులు వికలాంగులు దర్శన టోకెన్స్, అంగ ప్రదిక్షణ టోకెన్స్ లోనే విడుదల
*ఆన్లైన్ లో టిక్కెట్లు జారీ చేయడం ద్వారా..
భక్తులు టిక్కెట్ల కోసం క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా వెళ్లి స్వామి వారిని రెండు గంటల సమయంలోనే దర్శించుకోవచ్చు.ప్రస్తుతం ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తూ వచ్చిన అంగప్రదిక్షణ టోకెన్లు గత మూడు నెలలుగా ఆన్లైన్ లో విడుదల చేస్తూ వస్తున్నారు. భక్తులు టిక్కెట్ల కొరకు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో టిక్కెట్లను జారీ చేస్తూ వస్తున్నారు. ఇక వయోవృద్దులు, వికలాంగులకు జారీ చేసే ఆఫ్ లైన్ టిక్కెట్లు సైతం ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. కరోనా ముందు వరకు ఈ టిక్కెట్లను ఆఫ్ లైన్ విధానం ద్వారా టిక్కెట్లు ఇచ్చే వారు. అయితే టిక్కెట్ల కోసం క్యూలైన్ లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. వయో వృద్దులు వికలాంగులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తోంది టీటీడీ.శ్రీవారి దార్శనికి వచ్చే భక్తులకు కరోనా అనంతరం టైం స్లాట్ దర్శనాలు అమలు చేసింది టీటీడీ. అయితే భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం తిరుపతిలోని క్యూ లైన్ లో భారీగా తోపులాట జరగటంతో టైం స్లాట్ దర్శనాలు రద్దు చేసిపాత విధానాన్ని అమలు చేసింది. భక్తులకు ఎలాగైనా దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించే విధంగా వర్చువల్ క్యూ విధానం అమలు చేయనుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలను క్షుణంగా అధ్యయనం చేస్తోంది టీటీడీ. అనుకున్న విధంగా అన్ని కలసి వస్తే విఐపి బ్రేక్ దర్శన సమయానికన్నా ముందే సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది.

4. బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ.
ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
***ఆచారాలు
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ మహంకాళి ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.
**పోతురాజు
దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.
**విందు సంబరాలు
బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.
**రంగం
రంగం, లేక జాతకం చెప్పడం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. భక్తుల అభ్యర్తన మేరకు పూనకంలో ఉన్నటువంటి యుక్తవయసు కన్నెపిల్లలు వచ్చే సంవత్సరం గురించి జాతకం చెబుతారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపుకు ముందు జరుగుతుంది.
***ఘటం
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ.

5. ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వన్ టౌన్ పోలీస్ స్టేషన్నుండి ఊరేగింపుగా ళాతాళలతో సారె తీసుకొచ్చిన పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు..ఆనవాయితీగా ఆషాఢమాసం సందగర్భంగా అమ్మవారికి సారె సమర్పించిటం జరిగింది…రాష్ట్ర ప్రజలు,పోలీస్ యంత్రంగం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు..అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం..ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదం నీ అమ్మ వారి చిత్రపటాన్ని అందించిన దుర్గ గుడి ఈవో భ్రమరాంబ.