Movies

తెలుగు ఫిలిం చాంబర్ లో ప్రముఖుల కీలక నిర్ణయాలు

తెలుగు ఫిలిం చాంబర్ లో ప్రముఖుల కీలక నిర్ణయాలు

కరోనా అన్ని ఇండస్ట్రీలతోపాటు సినిమా వాళ్లకు చాలా పాఠాలు నేర్పింది. కరోనా కాలంలో సినిమా అభిమానులంతా ఓటీటీలకు అలవాటు పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. పోటీని తట్టుకునేందుకు కాస్త ఎక్కువ చెల్లించైనా కొత్త సినిమాలను తమ ప్లాట్‌ ఫామ్‌ లో విడుదల చేసేందుకు తంటాలు పడుతూ ఉంటారు. అందులో భాగంగానే కొన్నిసార్లు థియేటర్లో విడుదలైన సినిమా కేవలం రెండు వారాల్లో కూడా ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది.అలా చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారంటూ మొదటి నుంచి ఒక వాదన ఉంది. దానిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ తాజాగా కొత్త రూల్‌ ఒకటి పాస్‌ చేసింది. రూ.6 కోట్ల బడ్జెట్ లోపల నిర్మించిన సినిమాలను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు 4 వారాల గ్యాప్ ఉండాలని నిర్మయించారు. అలాగే భారీ బడ్జెట్‌ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు 10 వారాల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధనమై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.