Movies

ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయాలంటున్న పూజా హెగ్డే

వరుస సినిమాలతో దక్షిణాదిన టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఉత్తరాది సోయగం పూజా హెగ్డే. కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌.. అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్టులతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన పూజకు హైదరాబాదీ బిర్యానీ అంటే మహా ఇష్టం. అంతేకాదు పిజ్జా అన్నా ప్రాణమేనట.కానీ, జీరో సైజ్‌తో ఫిట్‌గా ఉండాలంటే మాత్రం నోరు కట్టేసుకోవాల్సిందే. అందుకే ‘డైట్‌లో భాగంగా పచ్చి కూరగాయలు, పండ్లు, పండ్లరసాలకే మొగ్గు చూపుతున్నా’ అంటున్నది పూజ. అప్పుడప్పుడు మాత్రం బిర్యానీ, పిజ్జా ఫుల్‌గా లాగించేస్తుందట. ఏం తిన్నా, ఎంత తిన్నా ఫిట్‌గా ఉండాలంటే మాత్రం వ్యాయామం తప్పనిసరిగా చేయాలంటూ తన అభిమానులకు సలహా ఇస్తున్నది.