NRI-NRT

వైభవంగా టాంటెక్స్ నెల నెలా తెలుగు వెన్నెల 15వ వార్షిక వేడుకలు

వైభవంగా టాంటెక్స్  నెల నెలా తెలుగు వెన్నెల 15వ వార్షిక వేడుకలు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 23న జరిగిన 15వ వార్షికోత్సవం మరియు 180వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం సాహితీ బంధువులందరి మధ్య సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు స్వాగతం పలికారు.
TANTEX-180th-Literary-Event-on-15th-Anniversary-3
*శ్రీ చక్ర కళానిలయం స్థాపకులు స్వప్నశ్రీ చకోటి శిష్య బృందం గురువులందరికీ బ్రహ్మాంజలి పేరుతో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. సాయి నృత్య అకాడమీ స్థాపకులు శ్రీమతి శ్రీదేవి ఎడ్లపాటి గారి శిష్య బృందం శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తూ “అలోకయే శ్రీ బాలకృష్ణం” అని కూచిపూడి నాట్యం చేసారు. తరువాత రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ మరియు యోగ స్థాపకులు సింధూజ ఘట్టమనేని శిష్య బృందం వినాయకుడిని, దుర్గా దేవిని, శ్రీరాముడిని పూజిస్తూ “శ్రీ విఘ్న రాజం భజే” అంటూ భరతనాట్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
TANTEX-180th-Literary-Event-on-15th-Anniversary-1
*ప్రముఖ నటుడు ఏఎన్నార్ ప్రభాకర్ తన ప్రసంగంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. డా. కోడూరి ప్రభాకర్ రెడ్డి “శ్రీనాధుడి చాటువులు” అంశం మీద ప్రసంగించారు డా. శ్యామలానందప్రసాద్ “తెలుగు సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. సాహితీ ప్రియులైన చంద్రహాస్ మద్దుకూరి సభకు డా.కోమలరాణిని పరిచయం చేసారు.
TANTEX-180th-Literary-Event-on-15th-Anniversary-4
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభకు విచ్చేసిన వారందరికీ విందు భోజనం అందించిన చౌరస్తా రెస్టారెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు
TANTEX-180th-Literary-Event-on-15th-Anniversary-5
*డా. ప్రసాద్ తోటకూర, విశిష్ట అతిథి డా. కోడూరి ప్రభాకర రెడ్డిని శాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి, విశిష్ట అతిథి ప్రభాకర్ పేర్ల గారిని శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. డా. శ్యామానంద ప్రసాద్ ను అవధాన కళా యశస్వితో సత్కరించారు.