NRI-NRT

భారత ఎంబసీలో తెలుగు దౌత్యవేత్తకు వీడ్కోలు

భారత ఎంబసీలో తెలుగు దౌత్యవేత్తకు వీడ్కోలు

భారత దౌత్య సంబంధాలు బాగా మెరుగుపడ్డాయని సుధాకర్ దలేలా అన్నారు. 2-07-2022వ తేదీ మంగళవారం వాష్టింగన్ డీసీలో భారత డిప్యూటీ అంబాసిడర్ సుధాకర్ దలేలా పదోన్నతిపై భూటాన్ భారత రాయబారిగా నియమించడం జరిగింది. ఆయన గౌరవార్థం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏషియన్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. ఇటీవల అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలతో భారత దౌత్య, వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. దీనివల్ల భారతీయ ఎగుమతులు బాగా పెరిగాయి. మేం ఎక్కడ పనిచేస్తున్నా ఆ దేశంతో స్నేహం, సౌబ్రాతృత్వం పెరిగేలా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. అమెరికాలో నా విధి విర్వరణ నాకు బాగా సంతృప్తినిచ్చింది. ఇక్కడున్న భారతీయులు, అమెరికన్ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
IMG-20220727-WA0040
సతీష్ వేమన మాట్లాడుతూ.. భారత డిప్యూటీ రాయబారిగా సుధాకర్ తెలుగు సమాజానికి అనేక రూపాల్లో సేవలు అందించారు. అమెరికాలో ఉన్న భారతీయుల సమస్యల పరిష్కారంలో సుధాకర్ కీలకమైన పాత్ర పోషించారు. తిరిగి భారత రాయబారిగా అమెరికాకు రావాలని ఆకాంక్షిస్తున్నామన్నారుభారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి డాక్టర్ రవి కోట మాట్లాడుతూ.. భారత్- అమెరికా స్నేహ సంబంధాలను మెరుగుపర్చడంలో సుధాకర్ బాగా కృషిచేశారు. కఠినమైన సమస్యలు ఎదురైనప్పుడు కూడా వాటిని చాలా ప్రశాంతంగా పరిష్కరించారు. భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో మమేకమై అందరి మన్ననలు పొందారు.
unnamed-1
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యునిటీ ఎఫైర్స్ అన్షుల్ శర్మ, ఎన్ సీఏఐఏ అధ్యక్షుడు నయనా దేశాయ్, ఎన్ సీఏఐఏ ఛైర్మన్ సునీల్ సింగ్, ఎన్ సీఏఐఏ వైఎస్ ఛైర్మన్ డాక్టర్ యోగేంద్ర గుప్త, సత్యనారాయణ మన్నె, జీడబ్ల్యూటీసీ గ్రేటర్ వాష్టింగన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు సుధ పాలడుగు, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, భాను మాగులూరి, కవిత చల్లా, క్రిపా సింగ్, అంజు మరియు తెలంగాణ, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, తదితర సంఘాల సభ్యులు ఆయన్ను సత్కరించారు.
unnamed-1
unnamed