Business

బంగారం ధరలు దాదాపు తగ్గొచ్చు – TNI వాణిజ్య వార్తలు

బంగారం ధరలు దాదాపు  తగ్గొచ్చు  – TNI వాణిజ్య వార్తలు

ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణమండలి అంచనా వేసింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం, దిగుమతి సుంకాల పెంపు వల్ల బంగారం గిరాకీ తగ్గే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ఆర్థిక అనిశ్చితులు, ధరల భారంతో జీవనవ్యయాలు అధికమవ్వడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం, దిగుమతి సుంకాల పెంపు వల్ల పుత్తడి ధర ఇతర దేశాలతో పోలిస్తే మరింత పెరగడం వంటివి వినియోగదారుల సెంటిమెంటును ప్రతికూలంగా మార్చే అవకాశం ఉందని తాజా నివేదికలో పేర్కొంది. అయితే రుతుపవనాలు బాగుంటాయనే అంచనాలు, పరిమిత శ్రేణిలోనే ధరల పెరుగుదల ఉండే పరిస్థితులు బంగారానికి అనుకూలించవచ్చని తెలిపింది. ఈ ఏడాది మొత్తంమీద 800 టన్నుల పసిడికి గిరాకీ లభించవచ్చని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ పీఆర్‌ సోమసుందరం తెలిపారు. 2021లో 797 టన్నుల పుత్తడికి గిరాకీ లభించిందన్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ వల్ల బంగారానికి మరింత పారదర్శక విపణిగా భారత్‌ మారడమే కాక, అంతర్జాతీయ మార్కెట్లపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.