Politics

TNI – నేటి రాజకీయ వార్తలు

TNI – నేటి   రాజకీయ వార్తలు

* ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ తిరగకుండా చేయాలి: చంద్రబాబు
జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. విలీన మండలాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులను పరామర్శించారు.జగన్‌కు పేటీఎం బ్యాచ్‌ వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా అల్లూరి జిల్లా గన్నవరంలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుచేసి.. పోలవరం బాధితులకు మాత్రం రూ.20 వేల కోట్ల కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. పరిహారానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. సాధించలేని అసమర్థుడు జగన్ అని దుయ్యబట్టారు. దొంగల చేతికి తాళం ఇచ్చారు.. వారు ఇష్టానుసారం దోచుకుంటున్నారని మండిపడ్డారు. పేటీఎం బ్యాచ్‌ జగన్‌కు వంద మార్కులు వేస్తే.. ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఆనంతబాబు బాధితులు ఎక్కువగా ఉన్నారని.. అనంతబాబును కాపాడే కొందరు పోలీసులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.అంతకుముందు తోటపల్లిలో ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోలేనంటూ సీఎం జగన్‌ చేతులెత్తేశారని మండిపడ్డారు. బాబాయిని చంపి ఆ కేసు నాపై పెట్టినవాళ్లు.. ఇంకెవరినైనా చంపి మీపై పెడతారని ప్రజలకు హితబోధ చేశారు. నిజాయతీ, విశ్వసనీయత లేని నేతలతో రాష్ట్రానికే ప్రమాదమని సూచించారు. రోడ్డు మార్గాన వెళ్లి పరామర్శించలేని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు.వరదలతో బాధిత ఇళ్లలో ఫ్యాన్ ఆగినందున.. ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ను ప్రజలు ఆపాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం పూర్తి చేయటం చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలని, పోలవరం ఎందుకు పూర్తికాదో తాను చూస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి కుట్రలు కుతంత్రాలు తప్ప.. ఇంకేమీ తెలీదని ధ్వజమెత్తారు. హుద్ హుద్ తుపాను సమయంలో తెదేపా ప్రభుత్వం పరిహారం పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9ను ఈ ప్రభుత్వం వరద బాధితులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ పాడు గ్రామంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు, పరిహారం ఆమలు బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

* ఇది అన్నివర్గాల సంక్షేమ ప్రభుత్వం.. కాపు నేస్తం అందులో భాగమే!
కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్‌ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

*బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమే: సోమువీర్రాజు
బీజేపీ (BJP) ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు , మాజీప్రధాని వాజ్‌పేయితో ఉన్నట్లుగా.. ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాజధాని పూర్తయ్యేదని తెలిపారు. మోదీతో చంద్రబాబు ఉంటే వైసీపీకి 150 సీట్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మిస్తామని ప్రకటించారు. సీఎం జగన్ , చంద్రబాబు తీరుతో రాజధాని రైతులు నష్టపోయారని సోమువీర్రాజు దుయ్యబట్టారు. అంతకుముందు రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని వీర్రాజు చెప్పారు. దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మామీద పడితే ఎలా’’ అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో సోమువీర్రాజు ఖంగుతిన్నారు.

*మీటర్ల బిగింపు ప్రక్రియకు మేం వ్యతిరేకం: సోమిరెడ్డి
వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియకు తాము వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు కట్టేందుకు, ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే మోటార్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేసే కుట్ర జరుగుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్లను పెట్టాల్సిందేనని సీఎం అనడం అన్యాయమన్నారు. రైతుల పంపుసెట్లకు మోటర్లు బిగించడం అన్యాయమని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణను బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తోన్నా.. మన రాష్ట్రంలో వీటి అమలుకు సీఎం జగన్ పూనుకోవడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతులపై భవిష్యత్తులో విద్యుత్ భారం తప్పదని పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

*పోలవరం కాంగ్రెస్ మానసపుత్రిక…జాతీయ ప్రాజెక్ట్: తులసిరెడ్డి
పోలవరం బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని… ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన వరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక.. జాతీయ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటేకే పోలవరం పూర్తి అయ్యివుండేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన మండిపడ్డారు.ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 30 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు నిధులు తెప్పించే శక్తి… సొంతంగా భరించే శక్తి లేదని అన్నారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.

*తాడిపత్రిలో భూముల కబ్జాకు ఎమ్మెల్యే యత్నం: జేసీ ప్రభాకర్ప్ర
భుత్వ భూములను తాడిపత్రి ఎమ్మెల్యే , బంధువులు కబ్జాకు యత్నిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడిపత్రిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై జాయింట్ కలెక్టర్‌ను జేసీ కలిశారు. అనంతరం జేసీ ప్రభాకర్ మాట్లాడుతూ… ల్యాండ్ డీలింగ్ చేయడమే రాజకీయ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ.60 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బంధువు కబ్జా చేస్తున్నారని అన్నారు. కబ్జా ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టినా వదిలేది లేదన్నారు. టీడీపీ వచ్చాక వాటన్నిటినీ కూల్చేస్తామని… ఇప్పుడు కబ్జాకు సపోర్ట్ చేస్తున్న పోలీసులే అప్పుడు కూల్చుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*జగన్ క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించాలి
హుద్‌హుద్‌ తుఫాన్‌ తర్వాత విశాఖను అభివృద్ధి చేసినట్లే పోలవరం ముంపు మండలాలను బాగుచేస్తానని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఏపీ విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నెల్లిపాక గ్రామంలో వరద బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ… జగన్ క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ అని మండిపడ్డారు. ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే 350 కిలోమీటర్లు పాడేరు వెళ్లేలా చేసిన అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*బీజేపీ చిత్తశుద్దిగా అమరావతి రాజధాని కి కట్టుబడి ఉంది: ఆంజనేయ రెడ్డి
అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పుని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యహరించడం చట్టవ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పాదయత్ర ఈరోజు ప్రారంభంకానున్నట్లు తెలిపారు. బీజేపీ చిత్తశుద్దిగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి )ని పార్టీ నుంచి‌ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని కి, చీకోటి ప్రవీణ్‌ కు సంబంధం ఏమిటో నిగ్గుతేల్చాలన్నారు. ఈ క్రాప్ లో రూ.140కోట్లు కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, రైతు భరోసా కేంద్రాలు రైతు ద్రోహ కేంద్రాలుగా తయారయ్యాయని ఆంజనేయరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*చంద్రబాబు చరిత్ర హీనుడు: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడు అని… ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆచరణాత్మకమైన ప్రణాళికతో పోలవరం ఆర్ అండ్ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు. 45.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని… ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామ‌న్నారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనో, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా నీటిని నింపితేనో గగ్గోలు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

*తాడిపత్రిలో భూముల కబ్జాకు ఎమ్మెల్యే యత్నం: జేసీ ప్రభాకర్t
ప్రభుత్వ భూములను తాడిపత్రి ఎమ్మెల్యే , బంధువులు కబ్జాకు యత్నిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడిపత్రిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై జాయింట్ కలెక్టర్‌ను జేసీ కలిశారు. అనంతరం జేసీ ప్రభాకర్ మాట్లాడుతూ… ల్యాండ్ డీలింగ్ చేయడమే రాజకీయ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ.60 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బంధువు కబ్జా చేస్తున్నారని అన్నారు. కబ్జా ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టినా వదిలేది లేదన్నారు. టీడీపీ వచ్చాక వాటన్నిటినీ కూల్చేస్తామని… ఇప్పుడు కబ్జాకు సపోర్ట్ చేస్తున్న పోలీసులే అప్పుడు కూల్చుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*కేసీఆర్‌ పాలన తీరు.. చేతులు కాలాక!: షర్మిల
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు… దూపైనపుడు బాయితవ్వుకున్నట్టుగా సీఎం కేసీఆర్‌ పాలన తీరు ఉందని వైఎ్‌సఆర్‌ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో మూసీ ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు, జనావాసాలు మునిగిపోతున్నా ముందస్తు చర్యలు లేవని ఆమె విమర్శించారు. ప్రతి యేటా వర్షాలకు ఇలాంటి దుస్థితి చూడాల్సి వస్తోందన్నారు. వరదలు వచ్చినపుడు.. జనం కొట్టుకుని చచ్చినపుడు మాత్రమే దొర(కేసీఆర్‌) నిద్ర లేస్తారని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామంటూ హడావిడి చేస్తారే గానీ చేతలు శూన్యమన్నారు. గత రెండు వారాలుగా భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమైతే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి.. పర్యవేక్షించాల్సిందిపోయి.. కేసీఆర్‌ దొర ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం చచ్చినా పర్వాలేదుగానీ మీకు మీ రాజకీయాలే ముఖ్యమా? అంటూ సీఎం కేసీఆర్‌ను ట్విటర్‌ ద్వారా షర్మిల ప్రశ్నించారు.

*హైదరాబాద్‌ – విజయవాడ రహదారికి ఆరు లైన్లు అవసరం లేదు: గడ్కరి
హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మొత్తాన్ని ఆరు లేన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ రహదారిపై హైదరాబాద్‌ నుంచి 14 కి.మీ. వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు లేన్ల రోడ్డు ఉందని తెలిపారు. 14 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకు ఆరు లేన్ల విస్తరణ పనులను గత నెలలోనే కాంట్రాక్టర్‌కు అప్పగించామని వెల్లడించారు. 40వ కి.మీ. నుంచి 221.5వ కి.మీ. వరకు.. అంటే 181.5 కి.మీ. మేర రహదారిని ఆరు లేన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ట్రాఫిక్‌కు నాలుగు లేన్ల రోడ్డు సరిపోతుందని స్పష్టం చేశారు. కాగా, ఇదే రహదారిపై నందిగామ-ఇబ్రహీంపట్నం-విజయవాడ రోడ్డును గత ఏడాదే ఆరు లేన్లకు విస్తరించామన్నారు.

*పోలవరం కాంగ్రెస్ మానసపుత్రిక…జాతీయ ప్రాజెక్ట్: తులసిరెడ్డి
పోలవరంబహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని… ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన వరమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… పోలవరం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక.. జాతీయ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటేకే పోలవరం పూర్తి అయ్యివుండేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన మండిపడ్డారు.ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 30 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు నిధులు తెప్పించే శక్తి… సొంతంగా భరించే శక్తి లేదని అన్నారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు

*బీజేపీ చిత్తశుద్దిగా అమరావతి రాజధాని కి కట్టుబడి ఉంది: ఆంజనేయ రెడ్డి
అమరావతి రాజధానిగా ఉండాలని హైకోర్టు చెప్పిన తీర్పుని లెక్కచేయకుండా ప్రభుత్వం వ్యహరించడం చట్టవ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ పాదయత్ర ఈరోజు ప్రారంభంకానున్నట్లు తెలిపారు. బీజేపీ (BJP) చిత్తశుద్దిగా అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ని పార్టీ నుంచి‌ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని కి, చీకోటి ప్రవీణ్‌ కు సంబంధం ఏమిటో నిగ్గుతేల్చాలన్నారు. ఈ క్రాప్ లో రూ.140కోట్లు కుంభకోణం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, రైతు భరోసా కేంద్రాలు రైతు ద్రోహ కేంద్రాలుగా తయారయ్యాయని ఆంజనేయరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*జగరోనా వైరస్‌తో రాష్ట్రం సర్వనాశనం: లోకేశ్‌
కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరమైన జగరోనా వైరస్‌ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు గ్రామంలో గురువారం ఆయన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అడ్డగోలు పన్నుల భారం తగ్గి సామాన్యుడు బతకాలంటే జగన్‌ ప్రభుత్వం పోయి చంద్రన్న సంక్షేమ ప్రభుత్వం రావాలన్నారు. సంక్షేమం పేరుతో పేదోడికి కుడిచేత్తో రూ.10 ఇచ్చి… బాదుడే బాదుడు పేరుతో అదే పేదోడి నుంచి ఎడమ చేత్తో రూ.100 జగన్‌రెడ్డి కొట్టేస్తున్నారని విమర్శించారు. జగన్‌రెడ్డి పన్నుల బాదుడుపై తెలుగుదేశం రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు చార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు లోకేశ్‌ దృష్టికి తీసుకువచ్చారు.

*విజయసాయిరెడ్డి బుర్ర తక్కువోడు: బుద్దా వెంకన్న
విశాఖ ఆదాయంపై గురువారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్‌కు టీడీపీ బుద్దా వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు. ‘‘విజయసాయిరెడ్డికి బుర్ర ఇప్పటి వరకు అరికాళ్లలో ఉందని భావించా. కానీ బుర్ర తక్కువ వాడని ఇప్పుడు తేలిపోయింది. 2016- 17 లోనే విశాఖ జీడీపీ 43.5 బిలియన్లు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే ఆదాయం పెరిగినట్టా..? తగ్గినట్టా..?’’ అని వెంకన్న ప్రశ్నించారు.

*వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో గళం విప్పాలి: సీపీఎం
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో తమ గళం విప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి జీఎ్‌సటీ, నిత్యావసర సరకుల ధరలపై ప్రతిపక్ష పార్టీల సభ్యులంతా చేస్తున్న ఆందోళనకు సమాధానం చెప్పలేక బీజేపీ ప్రభుత్వం 24 మంది సభ్యులను సస్పెండ్‌ చేసింది. ఏపీ నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు ఎవరూ ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం గర్హనీయం.

*బాబు ఉన్న ఐదేళ్లూ అరిష్టమే: బొత్స
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విన్యాసాలు చూసే మీడియా ముందుకు వచ్చా అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘ఆయన ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ నగదు ఇచ్చేశాడా? చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వరదెక్కడ వచ్చింది? ఆయన పాలనలో ఐదేళ్లూ అరిష్టమేకదా..! పోలవరం ఆలస్యానికి కారణమెవరు? అధికారంలో ఉన్న ఐదేళ్లలో తట్టెడు మట్టి తవ్వావా? అని ప్రశ్నించారు. కేంద్రానికి పోలవరం ప్రాజెక్టునూ, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆరాచకంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వరద బాధితులకు అందుతున్న సహాయంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేసి జేజేలు పలికారన్నారు. జగన్‌ పర్యటన చూసి చంద్రబాబు చేస్తున్న డ్రామాలకు ప్రజలు సిగ్గు పడుతున్నారని బొత్స అన్నారు.